ఉప్మాతో ఇన్ని లాభాలా?

ఓడియమ్మా.. ఉప్మాతో ఆరోగ్యానికి ఇన్ని లాభాలా? హాయిగా లాగించేయండి

Published by: Geddam Vijaya Madhuri

న్యూట్రిషియన్స్​ నిండిన ఫుడ్

బ్రేక్​ఫాస్ట్​గా ఉప్మాతింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు డైటీషియన్లు. దీనిలోని న్యూట్రిషియన్స్ హెల్త్​కి చాలా మంచిదంటున్నారు.

ఫైబర్​ అందుతుంది

ఉప్మాలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మెరుగైన జీర్ణక్రియను అందించి హెల్తీగా ఉంచుతుంది. కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

ఐరన్..

రక్తహీనతతో ఇబ్బంది పడేవారు.. ఐరన్​ ఇష్యూతో పోరాడేవారు ఉప్మాను హాయిగా తీసుకోవచ్చు. దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తకణాలకు చాలా మంచిది.

గ్లూటన్ ఫ్రీ

కొందరు ఆరోగ్య సమస్యల దృష్ట్యా గ్లూటన్ ఫ్రీ ఫుడ్​ కోసం చూస్తారు. అయితే మీకు ఉప్మా బెస్ట్ ఆప్షన్. గ్లూటన్ సమస్యలుంటే హాయిగా ఉప్మా చేసుకుని లాగించేయండి అంటున్నారు.

యాంటీ ఆక్సిడెంట్లు

ఉప్మాలోని యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి కణాల డ్యామేజ్​ని దూరం చేస్తాయి. అంతేకాకుండా వివిధ ఆరోగ్య సమస్యలనుంచి శరీరాన్ని కాపాడుతాయి.

మధుమేహులకు..

ఉప్మాలోని ఫైబర్.. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కూడా దీనిని బ్రేక్​ఫాస్ట్​గా తీసుకోవచ్చు.

కొలెస్ట్రాల్ తగ్గుతుంది

దీనిలోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ సమస్యలను తగ్గిస్తాయి. దీనివల్ల హార్ట్ హెల్తీగా మారుతుంది. హై కొలెస్ట్రాల్ ఉండేవారు దీనిని హాయిగా తీసుకోవచ్చు.

బరువును తగ్గించడంలో

బరువును తగ్గించడంలో ఉప్మా మంచి ప్రయోజనాలు అందిస్తుంది. దీనిలో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేసి.. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.

బోన్స్ హెల్త్​కి

ఉప్మాలో కాల్షియం ఉంటుంది. ఇది స్ట్రాంగ్ బోన్స్​ని ప్రమోట్ చేస్తుంది. పంటి ఆరోగ్యానికి కూడా మంచిది.

ఇలా చేసుకుంటే

ఉప్మాను తెల్లరవ్వతో చేసుకున్నా.. గోధుమ రవ్వతో చేసుకున్న దానిలో క్యారెట్, బీన్స్ వంటివి వేసుకుంటే హెల్త్​కి మంచిది. ఏది.. ఎలా తీసుకున్న లిమిటెడ్​గా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

అవగాహన కోసమే

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. (Images Source : Envato)