Hyperthyroidism Diet: థైరాయిడ్ సమస్యా? గుడ్డు తినడం మానకండి
Thyroid Issue: థైరాయిడ్ సమస్య ఉన్న వారు తప్పకుండా కొన్ని జీవన శైలి జాగ్రత్తలు పాటించాలి. అందులో ఒకటి పౌష్టికాహారం తీసుకోవడం. అలాంటి బలమైన వాటిలో గుడ్డు కూడా ఒకటి.
What is the Best Diet for Hypothyroidism: డయాబెటిస్ తర్వాత అలాగే ఇబ్బంది పెట్టే మరో హార్మోన్ సమస్య థైరాక్సిన్ ఇంబాలెన్స్. థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాక్సిన్ ఉత్పత్తి చెయ్యకపోయినా, లేదా ఎక్కువ ఉత్పత్తి చేసినా సమస్య మొదలవుతుంది. ఈ హార్మోన్ సమస్యకు కూడా తప్పనిసరిగా రోజూ మందులు వాడడంతో పాటు, జీవన శైలి మార్పులు చేసుసుకుని సమస్యను అదుపు చెయ్యడం తప్ప మరో శాశ్వత చికిత్సేదీ అందుబాటులో లేదు. ప్రతి రోజూ క్రమం తప్పని వ్యాయామం, ఒత్తిడికి దూరంగా ఉండడం, కొన్ని తప్పనిసరిగా పాటించాల్సిన ఆహార నియమాలతో థైరాయిడ్ సమస్యను అదుపులో పెట్టుకోవచ్చు.
థైరాయిడ్ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారంలో ముఖ్యమైందిగా గుడ్డు గురించి చెప్పవచ్చు. వాటిలో ఉండే పోషకాలు థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి దోహదం చేస్తాయి. గుడ్డు తినడం వల్ల థైరాయిడ్ కు కలిగే లాభాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
గుడ్లలోని ముఖ్యమైన పోషకాలు
సెలీనియం (Selenium)
గుడ్లలో సెలీనియం సమృద్ధిగా ఉంటుంది, థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పని చేసేందుకు అవసరమయ్యే ముఖ్యమైన ఎంజైముల ఉత్పత్తికి ఈ పోషకం అవసరమవుతుంది. థైరాయిడ్ హార్మోన్లు క్రీయాశీలంగా మార్చేప్రక్రియకు ఈ ఎంజైములు అవసరమవుతాయి. గుడ్డు తినడం ద్వారా శరీరానికి తగినంత సెలీనియం అందుతుంది.
అయోడిన్ (Iodine)
అయోడిన్ థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి చాలా అవసరం. గుడ్డు లో అయోడిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హైపోథైరాయిడిజమ్ (Hypothyroidism) నివారిస్తుంది. ఐరన్ లోపం ఏర్పడితే థైరాయిడ్ గ్రంథిలో వాపు వచ్చి గాయిటర్ గా మారుతుంది.
ప్రోటీన్
గుడ్లలో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీర కణాల ఉత్పత్తికి, రిపేరుకి ప్రొటీన్ చాలా అవసరం. థైరాయిడ్ మెరుగ్గా పనిచెయ్యాలంటే శక్తి చాలా అవసరం. ప్రోటీన్ ద్వారా శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. ఫలితంగా థైరాయిడ్ హర్మోన్ పనితీరు మెరుగ్గా ఉంటుంది.
విటమిన్ D
విటమిన్ D శరీరంలో థైరాయిడ్ హార్మోన్లు క్రీయా శీలంగా ఉండేందుకు తోడ్పడుతుంది. విటమిన్ D లోపిస్తే థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. గుడ్డులో విటమిన్ D పుష్కలంగా ఉంటుంది. గుడ్డు తినేవారిలో ఈ లోపం పెద్దగా ఏర్పడదు.
విటమిన్ B12
థైరాయిడ్ ఫంక్షన్ కొరకు B12 విటమిన్ కూడా చాలా ముఖ్యం. గుడ్డులో B12 తగినంత ఉంటుంది కనుక ఇది థైరాయిడ్ ఆరోగ్యాన్నిమెరుగుపరుస్తుంది. ముఖ్యంగా హైపోథైరాయిడిజమ్ ఉన్నవారికి గుడ్డు తరచుగా తింటే మంచి ఫలితం ఉంటుంది.
గుడ్డు వలన థైరాయిడ్ కు కలిగే ప్రయోజనాలు
గుడ్లలో ఉండే సెలీనియం, అయోడిన్ వంటి ఖనిజాలు థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి వాటి పనితీరు మెరుగ్గా ఉండేందుకు సహాయపడతాయి.
గుడ్లలోని యాంటీఆక్సిడెంట్లు (సెలీనియం) థైరాయిడ్ గ్లాండ్ ను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుండి కాపాడతాయి.
అయోడిన్, సెలీనియం ద్వారా గుడ్లు థైరాయిడ్ ఫంక్షన్‌ను సపోర్ట్ చేసి, హైపోథైరాయిడిజమ్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
గుడ్డులో ఉన్న సెలీనియం, అయోడిన్, ప్రోటీన్, విటమిన్ D మరియు B12 వంటి పోషకాలు థైరాయిడ్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, థైరాయిడ్ హార్మోన్ల సమతుల్యతకు తోడ్పడుతాయి. శరీరంలో హార్మోన్లు క్రీయాశీలంగా ఉండేందుకు చురుకుగా పనిచేసేందుకు గుడ్డులోని పోషకాలు ఉపయోగపడుతాయి.
Also Read: 15 ఏళ్ల కిడ్స్లో పెరుగుతోన్న లైంగిక సమస్యలు.. ఆందోళన వ్యక్తం చేస్తున్న WHO.. కారణమిదే