అన్వేషించండి

Red Wine: రెడ్ వైన్ తాగడం వల్ల స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుందా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

రెడ్ వైన్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే అది మితంగా తీసుకున్నపుడు మాత్రమే వాటిని పొందగలుగుతారు.

ల్ల ద్రాక్షని పులియబెట్టి చేసే ఒక పానీయం రెడ్ వైన్. ఇది తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలా మంది అంటుంటారు. గుండెకి మేలు చేస్తుందని, బరువు తగ్గించడంలో సహాయపడుతుందని చెప్తారు. వైన్ తాగడం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఆరోగ్యానికి మంచిది కదా అని అతిగా రెడ్ వైన్ తాగడం వల్ల దాని ప్రయోజనాలు పొందకపోగా ఇతర అనారోగ్య సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాస్తవానికి ఆల్కహాల్ అధిక వినియోగం వల్ల స్ట్రోక్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని నిపుణులు సూచిస్తున్నారు. నెలల్లో ఎటువంటి సమయంలోనైనా ఐదు కంటే ఎక్కువ పానీయాలు తాగడం వల్ల స్ట్రోక్ కి దగ్గరగా వెళ్తున్నట్టే అని హెచ్చరిస్తున్నారు. రెడ్ వైన్ పూర్తి స్థాయి ఆల్కహాల్ కాదు. ఇందులో 12-15 శాతం ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. ఈ వైన్ అతిగా తాగడం వల్ల ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉందని అంటున్నారు. కానీ మితంగా దీన్ని తీసుకుంటే స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు.

మెదడుపై ఎలా ప్రభావం చూపిస్తుంది?

స్ట్రోక్ ప్రమాదాల విషయంలో వైన్ రక్షణాత్మకంగా ప్రభావాన్ని చూపిస్తుందని కోపెన్ హగన్ సిరి హార్ట్ స్టడీలో ప్రచురించిన ఒక అధ్యయనంలో వెల్లడించింది. వైన్ లో ఫ్లేవనాయిడ్స్ , టానిన్ లు ఉన్నాయి. ఇవి స్ట్రోక్ ప్రమాదాన్ని అడ్డుకోగలవు. అయితే వైన్ తీసుకునే సమయం కూడా ముఖ్యమే. రెడ్ వైన్ లోని రసాయనాలు మంట, ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. ఇందులోని కొన్ని లక్షణాలు వ్యాధులు రాకుండా, నరాలు దెబ్బతినకుండా మెదడుని రక్షిస్తుంది. ఎర్ర ద్రాక్ష తొక్కలు, విత్తనాల్లో కనిపించే సమ్మేళనం రెస్వెరాట్రాల్ హెమే ఆక్సిజనేజ్ స్థాయిలను పెంచుతుందని పరిశోధనలో తేలింది. ఇది మెదడులోని నరాల కణాలని దెబ్బతినకుండా కాపాడుతుంది. స్ట్రోక్ వచ్చినప్పుడు ఎంజైమ్ స్థాయిలు పెరగడం వల్ల మెదడు తనను తాను రక్షించుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. రెస్వెరాట్రాల్ ఇస్కీమిక్ స్ట్రోక్‌ మెదడు నిరోధకతను సమర్ధవంతంగా నిర్మించగలదని అధ్యయనంలో నిరూపించబడింది.

ఇతర ఆరోగ్య ప్రయోజనాలు

వైన్ సాధారణంగా భోజనంతో పాటు వేయించిన ఆహారాలతో కలిపి తీసుకుంటారు. వైన్ వినియోగం వల్ల స్ట్రోక్ ని నిరోధించడంలో సహాయపడుతుందని వివిధ అధ్యయనాల్లో తేలింది. శరీరంలోని మంచి కొలెస్ట్రాల్ పెంచి, రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తుంది. రక్తనాళాలో ఉండే కణాల పొరను మెరుగుపరుస్తుంది. రెడ్ వైన్లోని పోషకాలు రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తాయి. ధమనులలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడతాయి. వీటిలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

అతిగా తాగకూడదు

అధిక ఆల్కహాల్ తాగడం అనేది స్ట్రోక్ వచ్చే అవకాశాన్నిపెంచుతుంది. ఊబకాయం, అధిక రక్తపోటుతో పాటు అవయవాలని దెబ్బతీస్తుంది. ఇతర ఆరోగ్య సమస్యలు, మందులు తీసుకుంటున్నట్లయితే వైన్ అసలు తాగకూడదు. వైన్ తాగడం వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ స్ట్రోక్ సమస్య ఉన్నవాళ్ళు వైద్యులని సంప్రదించకుండా తాగకూడదు.

రోజుకి ఎంత మోతాదు: అధ్యయనాల ప్రకారం మహిళలు రోజుకి 150 ఎమ్ఎల్ రెడ్ వైన్ తాగొచ్చు. మగవారైతే 300 ఎమ్ఎల్ అంటే రెండు గ్లాసుల రెడ్ వైన్ తాగవచ్చు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: నెలసరి నొప్పులు వేధిస్తున్నాయా? ఈ ఆహార పదార్థాలతో చెక్ పెట్టొచ్చు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
Maharashtra Govt Formation: మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
Kakinada Port Ship Seized: అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
Embed widget