By: Haritha | Updated at : 24 Sep 2023 11:14 AM (IST)
(Image credit: Pixabay)
ప్రతిరోజూ అరగంట పాటైనా వాకింగ్ చేయమని చెబుతుంటారు. రోజూ వాకింగ్ చేసే వారికి అనారోగ్యాలు వచ్చే అవకాశం తగ్గుతుంది. చాలామంది వాకింగ్ అనగానే జంటగా స్నేహితులతో కలిసి వెళుతుంటారు. వాళ్లతో వాకింగ్ చేస్తూ మాట్లాడుతూనే ఉంటారు. మరికొందరు చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏకాగ్రత మాటల మీదకి, పాటల మీదకి వెళుతుంది. కానీ నడక మీద ఉండదు. కాబట్టి నడక వల్ల కలిగే పూర్తి ప్రయోజనాలను పొందాలంటే సైలెంట్ వాకింగ్ చాలా అవసరం అని చెబుతున్నారు వైద్యులు.
వాకింగ్‌కి వెళ్తున్నప్పుడు ఒంటరిగా వెళ్లేందుకు ప్రయత్నించండి. అలా ఒంటరిగా వెళ్లేవారు నిశ్శబ్దంగా ఉండడం ఉండే అవకాశం ఉంది. ఎవరితోనూ మాట్లాడరు. ఇదే సైలెంట్ వాకింగ్. సైలెంట్ వాకింగ్ శరీరంపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. సైలెంట్‌గా వాకింగ్ చేస్తున్నప్పుడు మీ దృష్టి చుట్టూ ఉన్న ప్రకృతి పైనే ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ మాట్లాడుకుంటూ వాకింగ్ చేసే వారితో పోలిస్తే, సైలెంట్ వాకింగ్ చేసేవారు ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. సైలెంట్ వాకింగ్ చేసే వారిలో మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఒత్తిడి కలిగే అవకాశం తగ్గుతుంది. వారిలో పాజిటివిటీ, క్రియేటివిటీ పెరుగుతుంది. సోమరితనం పోతుంది.
ఇక ఫోన్లో పాటలు పెట్టుకుంటూ వింటూ వెళ్లే వారికి కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. వాకింగ్ కి వెళ్లే అరగంట లేదా గంట ఎలాంటి గాడ్జెట్స్ ను చేతిలో పెట్టుకోకండి. కేవలం మీ నడక మీదే ఫోకస్ చేయండి. ఇది మీకు మానసికంగా కూడా ఎంతో రిలీఫ్ గా అనిపిస్తుంది. రోజు ఇలా చేసేవారు కొన్ని రోజుల్లోనే ఒత్తిడి మానసిక ఆందోళన వంటి వాటి నుంచి బయటపడతారు.
వాకింగ్ చేశాక శరీరానికి చాలా అలసటగా ఉంటుంది. మళ్ళీ తిరిగి శరీరాన్ని శక్తివంతం చేసే బాధ్యత మీదే. వాకింగ్ చేసి వచ్చాక ఒక ఐదు నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత ఒక అరటిపండును తింటే మంచిది. ఇది శరీరాన్ని వెంటనే శక్తివంతం చేస్తుంది. అంతేకాదు అరటి పండ్లు త్వరగా జీర్ణం అవుతాయి కూడా. మార్నింగ్ వాక్ చేశాక త్వరగా బరువు తగ్గాలి అనుకునే వారు ఓట్స్ చేసిన ఆహారాన్ని తింటే మంచిది వాకింగ్ ఓట్ మీద కలిపి మీ బరువును త్వరగా తగ్గిస్తాయి. అలాగే సోయా బీన్స్ తో చేసే టోఫు పన్నీర్ కూడా మంచిదే. దీంతో చేసిన బ్రేక్ ఫాస్ట్ లను తింటే శక్తి త్వరగా అందుతుంది. అయితే దీనిలో సోడియం కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి తక్కువగా తినడం మంచిది.
బరువు త్వరగా తగ్గాలనుకునేవారు రోజుకు గంట పాటు వాకింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది క్యాలరీలను కరిగిస్తుంది. ఇలా బరువు తగ్గాలనుకునేవారు వాకింగ్ చేస్తూ అధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని దూరంగా పెట్టాలి. కేవలం అధిక బరువే కాదు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నడక ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవాలి. ప్రతిరోజు 30 నిమిషాలు నడిస్తే గుండె సంబంధ వ్యాధులు రావడం తగ్గుతాయి. ఎముకలు బలంగా మారుతాయి. కండరాల శక్తి కూడా పెరుగుతుంది. రోజుకు అరగంట నడవడం వల్ల 150 క్యాలరీలను కరిగించవచ్చు. అయితే నెమ్మదిగా నడిస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. వేగంగా నడవాల్సిన అవసరం ఉంది.
Also read: ఒక్కసారి పైనాపిల్ హల్వా తింటే మీకు ఇంకే హల్వా నచ్చదు, రెసిపి ఇదిగో
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Waxing at Home : ఇంట్లోనే పార్లల్లాంటి వాక్సింగ్.. స్మూత్ స్కిన్ కోసం ఇలా చేయండి
Facts about Christmas : క్రిస్మస్ గురించి అమ్మబాబోయ్ అనిపించే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.. మీకు తెలుసా?
Diet Soda Drinks: డైట్ సోడా డ్రింక్స్ అధికంగా తాగుతున్నారా? మీ కాలేయం ప్రమాదంలో పడినట్లే, నష్టలివే!
Instant Breakfast Recipe : బరువును తగ్గించే ఈజీ రెసిపీ.. దీనికి ఆయిల్ అవసరమే లేదు
Diabetic Coma : డయాబెటిక్ కోమాకి కారణాలు ఇవే.. ప్రాణాలమీదకి తెచ్చే సమస్యకు చెక్ పెట్టొచ్చా?
YSRCP Gajuwaka : వైసీపీకి గాజువాక ఇంచార్జ్ గుడ్ బై - వెంటనే గుడివాడ అమర్నాథ్కు బాధ్యతలు !
Hyderabad News: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎండీ సజ్జనార్ - 'మహాలక్ష్మి' పథకంపై పరిశీలన, ఇబ్బందులుంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని సూచన
Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!
Happy Birthday Nabha Natesh: నభా నటేష్ బర్త్ డే: అందాల నటికి అవకాశాలు నిల్ - పాపం, ఆ యాక్సిడెంట్‌తో!
/body>