By: ABP Desam | Updated at : 29 Apr 2022 01:23 PM (IST)
Edited By: harithac
(Image credit: Pixabay)
వేసవిలో అధికంగా అమ్ముడుపోయే పండు పుచ్చకాయ. రోజుకో పుచ్చకాయను లాగించే వాళ్లు కూడా ఉన్నారు. ఉష్ణోగ్రత పెరుగుతున్నప్పుడు పుచ్చకాయ తినడం చాలా మంచిదే. వడదెబ్బ బారిన పడకుండా ఈ పండు కాపాడుతుంది. ఎందుకంటే దీనిలో తొంభై శాతం నీరే ఉంటుంది. ఇది చాలా తక్కువ కెలోరీలను కలిగి ఉంటుంది కాబట్టి ఎంత తిన్నా బరువు పెరుగుతారనే భయం లేదు. తీపి తినాలనుకునేవారికి ఈ పండు చాలా ఉత్తమం, ఇందులో నేచురల్ స్వీట్నెస్ ఉంటుంది. అయితే ఇంట్లోని పెద్దలు కొంతమంది పుచ్చకాయ తిన్నాక నీళ్లు తాగనివ్వరు. కనీసం ఓ గంట గ్యాప్ ఇచ్చి తాగమని చెబుతారు. ఎందుకో తెలుసా?
ఆయుర్వేదం చెబుతున్నదిదే
పూర్వం అందరూ ఆయుర్వేదాన్నే నమ్మేవారు. ఇప్పటికీ ఇంట్లోని చాలా మంది పెద్దలు ఆయుర్వేదాన్ని నమ్ముతారు. ఆయుర్వేదంలో చెప్పిన ప్రకారం పుచ్చకాయలో సమృద్ధిగా నీరు ఉంటుంది, దాన్ని తిన్నాక నీళ్లు తాగితే, శరీరంలో నీరు అవసరానికి మించి చేరిపోతుంది. దీని వల్ల పొట్ట ఉబ్బరంగా అనిపించవచ్చు. ఈ నీళ్లు పొట్టలో ఉన్న జీర్ణరసాన్ని పలుచగా మార్చేస్తుంది. దీని వల్ల ఇతర ఆహారాలు జీర్ణం కావడం కష్టంగా మారుతుంది. అలాగే శరీరంలోని చక్రాల సమతుల్యతను కూడా దెబ్బతీస్తుంది. అందుకే పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగితే కొంతమందిలో వెంటనే అసౌకర్యంగా అనిపిస్తుంది. ఈ పరిస్థితి జీర్ణ క్రియ ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే పెద్దవాళ్లు పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగొద్దని చెబుతారు.
సైన్సు ఏమంటోంది?
శాస్త్రీయంగా ఈ విషయం ఎక్కడా రుజువు కాలేదు. అయినా కూడా పుచ్చకాయ తిన్న తరువాత నీళ్లు తాగకుండా ఉండడమే మంచిదని చెప్పేవారున్నారు. మరీ దాహం వేస్తే ఒకసారి నీళ్లు సిప్ చేయచ్చు. కొందరి పొట్ట చాలా సున్నితంగా పనిచేస్తుంది, అలాంటివారు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
ఆరోగ్యప్రయోజనాలెన్నో...
పుచ్చకాయలో అధిక స్థాయిలో లైకోపీన్ ఉంటుంది. దీనివల్ల పుచ్చకాయ గుజ్జుకు అంత ఎరుపు రంగు వస్తుంది. ఇది అత్యుత్తమ యాంటీ ఆక్సిడెంట్. శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను బయటకు పంపడం ద్వారా ఎంతో మేలు చేస్తుంది. తద్వారా కణాల డ్యామేజ్ ను అరికడుతుంది. ఇందులో థయామిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్ బి6, ఫొలేట్, మెగ్నిషియం, ఫాస్పరస్, పొటాషియం, జింక్, కాపర్, మాంగనీస్, సెలీనియం, కోలిన్, బీటైన్ వంటి అత్యవసర పోషకాలు లభిస్తాయి. అందుకు పుచ్చకాయ తిని బయటికి వెళితే వడదెబ్బ అంత సులువుగా కొట్టదు.
Also read: ఒక్క ఇంజెక్షన్ మూడు నెలలు గర్భం రాకుండా అడ్డుకుంటుంది, ఇంతకీ ఇది మంచిదేనా?
Thyroid: హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్నారా? ఈ ఆహారాలను దూరంగా పెట్టాల్సిందే
Diabetes: అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్, టైప్ 2 డయాబెటిస్ ఉంటే మెదడు త్వరగా ముసలిదైపోతుంది
Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!
Dhaniya Powder: ఈ ధనియాల పొడిని అన్నంతో, ఇడ్లీతో తినొచ్చు, ఎలా చేయాలో తెలుసా?
Brain Foods: పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే బ్రెయిన్ ఫుడ్స్ ఇవన్నీ, రోజుకొకటైనా తప్పకుండా తినిపించాల్సిందే
Weather Updates: నేడు ఈ జిల్లాల్లో వర్షం, ఎల్లో అలర్ట్ జారీ! ఏపీలో నేడు 2-4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
Hyderabad: నేడు Hydకి మోదీ, ఈ రూట్లలో ట్రాఫిక్కు నో ఎంట్రీ! ముందే వేరే మార్గాలు చూసుకోండి
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు