Contraceptive Injection: ఒక్క ఇంజెక్షన్ మూడు నెలలు గర్భం రాకుండా అడ్డుకుంటుంది, ఇంతకీ ఇది మంచిదేనా?
గర్భనిరోధక పద్ధతుల్లో కాంట్రసెప్టివ్ ఇంజెక్షన్ కూడా ఒకటి.
గర్భనిరోధక పద్దతి అనగానే అందరికీ గుర్తొచ్చేది గర్భనిరోధక మాత్రలే. కొంతమంది కాపర్ టి కూడా వేయించుకుంటున్నారు. రెండు నుంచి నాలుగేళ్ల గ్యాప్ కావాలనుకునేవారు కాపర్ టి వేయించుకోవడానికి ఇష్టపడతారు. కానీ కొన్ని నెలలు లేదా ఏడాది మాత్రమే పిల్లలు వద్దనుకునేవారు గర్భినిరోధక మాత్రలతోనే సర్దుకుంటున్నారు. వాటిని అధికగా వాడడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు మహిళల్లో కలుగుతున్నాయి. ఆ మాత్రలు తరచూ వాడడం వల్ల లైంగిక ఆసక్తి కూడా తగ్గిపోతుంది. అది వైవాహిక జీవితంలో మరింత కల్లోలానికి దారితీయచ్చు. గర్భినిరోధక మాత్రలతో పోలిస్తే గర్భనిరోధక ఇంజెక్షన్ వేయించుకోవడం చాలా ఉత్తమం అని చెబుతున్నారు గైనకాలజిస్టులు. ఒక్కసారి వేయించుకుంటే మూడు నెలలు భయం లేకుండా ఉండొచ్చు. ఈ ఇంజెక్షన్ సక్సెస్ రేట్ కూడా ఎక్కువ.
ఏంటి ఈ ఇంజెక్షన్?
దీన్ని డిపోమెట్రోక్సీ ప్రొజెస్టిరాన్ అసిటేట్ (డీఎంపీఏ) ఇంజెక్షన్ అంటారు. ఇందులో ప్రొజెస్టరాన్ హార్మోన్ ఉంటుంది. చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మహిళలకు మాత్రమే ఈ ఇంజెక్షన్. ఇది నేరుగా మహిళ అండంపై ప్రభావం చూపిస్తుంది. గర్భాశయంలోకి వీర్యకణాలు చేరకుండా ఒక అడ్డుగోడగా నిలుస్తుంది. కాబట్టి గర్భం ధరించే అవకాశం దాదాపు సున్నా.
ధర ఎంత?
ఇది చాలా చవక ధరల్లోనే లభ్యమవుతుంది. రూ.50 నుంచి రూ.250 వరకు లభిస్తుంది. క్వాలిటీని బట్టి ధర ఆధారపడి ఉంటుంది. 1990ల్లోనే ఈ ఇంజెక్షన్ వాడేందుకు మనదేశంలో అనుమతి లభించింది. అయినప్పటికీ దీన్ని వాడే వారు చాలా తక్కువ. భారత ప్రభుత్వం చేసే కుటుంబనియంత్రణ కిట్లో కూడా ఈ ఇంజెక్షన్ లేదు.
ప్రపంచ ఆరోగ్యసంస్థ చెప్పిన దాని ప్రకారం మాత్రలతో పోలిస్తే ఈ ఇంజెక్షన్ అన్ని విధాలా మంచిది. ఇది వాడితే మహిళలో ఎముకలు బలహీనంగా మారుతాయనే వాదన ఉంది. అది కొంతవరకు నిజమే. కానీ వాడడం మానేశాక తిరిగి పటిష్టంగా మారుతాయి. కానీ గర్భనిరోధక మాత్రలు వాడడం వల్ల పునరుత్పత్తి వ్యవస్థపైనే అధిక ప్రభావం పడుతుంది. కొందరిలో సైడ్ ఎఫెక్టులు ఎక్కువై గర్భం ధరించడం కూడా కష్టతరం అవుతుంది. అది కూడా గర్భినిరోధక మాత్రలు రోజూ వేసుకోవాలి. ఈ ఇంజెక్షన్ మూడు నెలలకోసారి చేయించుకుంటే చాలు. మూడు నెలల తరువాత నెల రోజులు గ్యాప్ ఇచ్చి మళ్లీ ఇంజెక్షన్ తీసుకోవచ్చు. ఇంజెక్షన్ కు ఇంజెక్షన్ కు మధ్య గర్భం దాల్చే అవకాశం చాలా తక్కువ.
Also read: అన్నం మిగిలిపోతే ఇలా ఇడ్లీ, దోశెలు, గుంట పొంగనాలు చేసుకోండి
Also read: బీపీ అధికంగా పెరిగిపోతే ఏమవుతుంది? పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?