అన్వేషించండి

High BP : బీపీ అధికంగా పెరిగిపోతే ఏమవుతుంది? పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?

హైబీపీ చాలా సాధారణ సమస్యగా చూస్తారు చాలా మంది. కానీ అది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది.

అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు, మనదేశంలో కొన్ని కోట్ల మంది ఆ సమస్యతో బాధపడుతున్నారు. దీన్ని హైబీపీ, హైపర్ టెన్షన్ అని కూడా పిలుస్తారు. బీపీ రాకముందే జాగ్రత్తపడాలి, వచ్చాక మాత్రం పూర్తిగా నయం కావడం అనేది ఉండదు. జీవితాంతం మందులు వాడాల్సి వస్తుంది. కానీ చాలా మంది మందులు వాడేందుకు కూడా ఇష్టపడరు. హైబీపీని చాలా సాధారణ సమస్యగా తీసుకుంటారు. ఆరోగ్యం శ్రద్ధ పెట్టరు. కానీ హైబీపీని అలా మందులు వాడకుండా వదిలేస్తే అది మీ ప్రాణాలు తీసేంత ప్రమాదకరంగా మారిపోతుంది. బీపీ పెరిగితే రక్తనాళాలపై ఒత్తిడి అధికంగా పెరుగుతుంది. రక్తం అతి వేగంగా రక్త నాళాల గోడలను గుద్దుకుంటూ ప్రవహిస్తుంది. దీని వల్ల ఆ గోడలు దెబ్బతింటాయి. రక్తనాళాలు దెబ్బతింటే గుండెపై భారం పడుతుంది. గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. కొంతమంది హైబీపీ పెరిగిపోతే కింద పడి స్పృహ కోల్పోతారు. చాలా విసురుగా కిందపడినప్పుడు తలకు గాయాలై మరణించే అవకాశం కూడా ఎక్కువ. అందుకు హైబీపీని తక్కువ అంచనా వేయకుండా నియంత్రణలో ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. మందులు రోజూ కచ్చితంగా వాడాలి. మందుల విషయంలో నిర్లక్ష్యం వద్దు. 

ఈ పనులు వద్దు
ఆహారంలో అధికంగా ఉప్పు తీసుకోవడం వంటివి చేయద్దు. దీని వల్ల సమస్య మరింతగా ముదిరిపోతుంది. మందులు వాడినా కూడా ఫలితం లేకుండా అయిపోతుంది. అలాగే చెడు జీవనశైలి కూడా మంచిది కాదు. సమయానికి తగినట్టు ఆహారం తినడం, నిద్రపోవడం వంటివి చేయాలి. అధిక బరువు పెరిగినా, నిద్ర తగినంత లేకపోయినా, అధికంగా ఒత్తిడికి గురైనా హైబీపీ సమస్య పెరిగిపోతుంది. అలాగే వ్యాయామం రోజూ చేయాలి. కనీసం అరగంట పాటూ వాకింగ్ చేయాలి. 

ఆహారంలో మార్పులు తప్పవు
ముఖ్యంగా తినే ఆహారంలో మార్పులు చేసుకోక తప్పదు. బీపీ అధికంగా ఉండేవారు పొటాషియం అధికంగా ఉండే పదార్థాలను తినాలి. రోజుకో అరటిపండు తింటే చాలా మంచిది. రక్తనాళాలకు పొటాషియం చాలా అవసరం. రక్తసరఫరా కూడా మెరుగుపడుతుంది. రక్త సరఫరా ప్రశాంతంగా సాగుతుంటే రక్తనాళాల గోడలపై ఒత్తిడి పడదు. దీని వల్ల బీపీ పెరగదు. యాపిల్స్, ఓట్స్, బాదంపప్పులు, పాలకూర, కోడి గుడ్లు, డ్రైప్రూట్స్ వంటివి అధికంగా తినాలి. చేపలు వారానికి రెండు సార్లయినా తింటే చాలా మంచిది. తీపి పదార్థాలు, కూల్ డ్రింకులు తగ్గించేయాలి. తాజా పండ్లు, కూరగాయలు రోజూవారీ ఆహారంలో ఉండేట్టు చూసుకోవాలి. చిక్కుడు జాతి కూరగాయలు తింటే చాలా మంచిది. 

రక్తపోటును ఇలా చూస్తారు...
సాధారణ రక్తపోటు - 120/80 mmHg
రక్తపోటు పెరిగితే (మొదటి దశ) - 130/139 mmHg
అధిక రక్తపోటు - 180/129 mmHg దాటితే. 

Also read: వారానికి రెండు సార్లు ఈ పండు తింటే చాలు, గుండె జబ్బులొచ్చే అవకాశం తగ్గుతుంది

Also read: మీకు ఈ బొమ్మలో ఏ జంతువు కనిపిస్తోంది? దాన్ని బట్టి మీ మెదడులో ఏ వైపు బాగా పనిచేస్తుందో చెప్పొచ్చు

టాప్ హెడ్ లైన్స్

High Cholesterol : భారత్‌లో 87.3 శాతం మందికి అధిక కొలెస్ట్రాల్.. ఫ్యామిలీ హిస్టరీ కంటే ఆహారమే కీలకమట
భారత్‌లో 87.3 శాతం మందికి అధిక కొలెస్ట్రాల్.. ఫ్యామిలీ హిస్టరీ కంటే ఆహారమే కీలకమట
Cough and Cold in Kids : చలికాలంలో పిల్లలకు దగ్గు, జలుబు వచ్చాయా? ఉపశమనం కోసం ఈ చిట్కాలు ఫాలో అవ్వండి
చలికాలంలో పిల్లలకు దగ్గు, జలుబు వచ్చాయా? ఉపశమనం కోసం ఈ చిట్కాలు ఫాలో అవ్వండి
Late Dinner Side Effects : రాత్రి భోజనం ఆలస్యంగా చేస్తున్నారా? బ్లడ్ షుగర్ నుంచి నిద్ర వరకు.. ఎలాంటి ప్రభావం పడుతుందంటే
రాత్రి భోజనం ఆలస్యంగా చేస్తున్నారా? బ్లడ్ షుగర్ నుంచి నిద్ర వరకు.. ఎలాంటి ప్రభావం పడుతుందంటే
Toilet Paper Health Risks : టాయిలెట్ పేపర్ వాడటం మంచిదేనా? చర్మ సమస్యల నుంచి కెమికల్స్ వరకు.. పూర్తి వివరాలు ఇవే
టాయిలెట్ పేపర్ వాడటం మంచిదేనా? చర్మ సమస్యల నుంచి కెమికల్స్ వరకు.. పూర్తి వివరాలు ఇవే

వీడియోలు

Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్
Sanju Samson 67 Runs vs New Zealand | న్యూజిలాండ్‌పై సంజూ శాంసన్ ధనాధన్ బ్యాటింగ్
Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana BJP Strategy: తెలంగాణలో కమలదళం బిగ్ ప్లాన్ - మోదీ, అమిత్ షా పర్యటనలతో అసంబ్లీ పోరుకు బీజేపీ సిద్ధం!
తెలంగాణలో కమలదళం బిగ్ ప్లాన్ - మోదీ, అమిత్ షా పర్యటనలతో అసంబ్లీ పోరుకు బీజేపీ సిద్ధం!
Jagan vs Sharmila: అంత ప్రాణభయం ఉంటే దేశం వదిలి వెళ్లిపో జగన్! కౌంటర్ ఇచ్చిన షర్మిల బంధువులు
అంత ప్రాణభయం ఉంటే దేశం వదిలి వెళ్లిపో జగన్! కౌంటర్ ఇచ్చిన షర్మిల బంధువులు
AP Local Body Polls: నామినేషన్లలో వైసీపీ నేతల రికార్డు - అడ్డుకుంటున్నారని రివర్స్ ఆరోపణలు - ఓటమి కారణాలను ముందే చెబుతున్నారా?
నామినేషన్లలో వైసీపీ నేతల రికార్డు - అడ్డుకుంటున్నారని రివర్స్ ఆరోపణలు - ఓటమి కారణాలను ముందే చెబుతున్నారా?
Bigg Boss Season 10 Today October 23rd: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒకటైపోయిన త్రిగుణ్, శివ! రోహిత్, రాంప్రసాద్‌లకు టెన్షన్.. కలిసిపోదాం అంటూ మంతనాలు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒకటైపోయిన త్రిగుణ్, శివ! రోహిత్, రాంప్రసాద్‌లకు టెన్షన్.. కలిసిపోదాం అంటూ మంతనాలు!
High Cholesterol : భారత్‌లో 87.3 శాతం మందికి అధిక కొలెస్ట్రాల్.. ఫ్యామిలీ హిస్టరీ కంటే ఆహారమే కీలకమట
భారత్‌లో 87.3 శాతం మందికి అధిక కొలెస్ట్రాల్.. ఫ్యామిలీ హిస్టరీ కంటే ఆహారమే కీలకమట
Best Hybrid Cars: అత్యంత చవకైన హైబ్రిడ్ కార్లు ఇవి, కొనేముందు ఈ లిస్ట్ చూడండి
అత్యంత చవకైన Hybrid Cars, కొనేముందు ఈ లిస్ట్ చూసి డిసైడ్ చేసుకోండి
Aadarsha Kutumbam Trailer Review : ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ - వయలెంట్ యాక్షన్‌తో పాటే వెంకీ మార్క్ కామెడీ త్రివిక్రమ్ డైలాగ్స్
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ - వయలెంట్ యాక్షన్‌తో పాటే వెంకీ మార్క్ కామెడీ త్రివిక్రమ్ డైలాగ్స్
చైనా‌తో ఘర్షణపై ITBP డీజీ కీలక ప్రకటన.. ప్రధాని మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ
చైనా‌తో ఘర్షణపై ITBP డీజీ కీలక ప్రకటన.. ప్రధాని మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ
Embed widget