Optical Illusion: మీకు ఈ బొమ్మలో ఏ జంతువు కనిపిస్తోంది? దాన్ని బట్టి మీ మెదడులో ఏ వైపు బాగా పనిచేస్తుందో చెప్పొచ్చు
కళ్లను మాయ చేసే ఆప్టికల్ ఇల్యూషన్. దీన్ని బట్టి మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు.
మన శరీరాన్ని నడిపేది మెదడే. ఎడమ వైపు, కుడి వైపు అని రెండు వైపులా ఉంటుంది మెదడు. ఈ రెండింటిలో ఒక వైపు మెదడు చురుగ్గా పనిచేస్తుంది, ఆలోచనలను, నిర్ణయాలను తీసుకునేలా డామినేట్ చేస్తుంది. ఈ బొమ్మలో మీకు మొదటగా ఏ జంతువు కనిపిస్తుందో చెబితే, మీ మెదడులో ఏ వైపు భాగం ఆధిపత్యం చెలాయిస్తుందో తెలుసుకోవచ్చు. అలాగే మీ ఆలోచనలు ఎలా ఉంటాయో కూడా చెప్పచ్చు.
కోతి
బొమ్మలో కోతి కొమ్మల్ని పట్టుకుని వేలాడుతున్నట్టు మీకు మొదటగా కనిపించిందా? అంటే మీ మెదడులో కుడి భాగం చాలా చురుగ్గా పనిచేస్తోంది. ఆలోచనలు, నిర్ణయాలలో ఆధిపత్యం ప్రదర్శించేది ఆ భాగమే.
1. మీరు చాలా వినూత్నంగా ఆలోచించే సృజనాత్మక వ్యక్తి.
2. సమస్య ఎదురైనప్పుడు మీరు విమర్శనాత్మక ఆలోచనల కన్నా మీ అంతర్ దృష్టి మీద ఆధారపడతారు.
3. జీవితంలో మీకు ప్రతి ఎదురుదెబ్బని గుణాపాఠంగా భావిస్తారు.
4. మీకు గమ్యం కంటే ప్రయాణం చాలా ముఖ్యం.
5. కలలు కంటూనే ఉంటారు. అందుకే మీరు నిజ ప్రపంచంలో ఆలోచించడం, రియాల్టీ చెక్ చేసుకోవడం, చుట్టూ ఉన్న పరిస్థితులపై ఎక్కువ శ్రద్ధ చూపించడం చాలా ముఖ్యం.
6. ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు.
7. భావోద్వేగాల ఆధారంగా మీరు జీవిస్తారు.
8. సంగీతం, కళలు, సృజనాత్మక విభాగాల్లో నైపుణ్యం కలిగి ఉంటారు.
పులి
మీకు మొదట బొమ్మలో గాండ్రిస్తున్న పులి కనిపిస్తే మీ మెదడులో ఎడమ వైపు ఆధిపత్యం చెలాయిస్తోందని అర్థం. అంటే మీరు తీసుకునే నిర్ణయాలు, ఐడియాలు అన్నీ ఆ వైపు నుంచే వస్తున్నట్టు అర్థం.ఎడమ భాగం చురుగ్గా పనిచేసే వ్యక్తుల లక్షణాలు ఇలా ఉంటాయి.
1. మీరు విశ్లేషణాత్మకమైన వ్యక్తి.
2. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మీరు తార్కికంగా ఆలోచిస్తారు. గణానాత్మకంగా ఉండేందుకు ఇష్టపడతారు.
3. మీరు కొన్ని విషయాల్లో మొండిగా ఉంటారు. కొన్ని విషయాల్లో ఇతరుల అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
4. మీరు చేయాల్సిన పనులను ప్రణాళికా బద్ధంగా చేస్తారు. ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళతారు.
5. మీ లక్ష్యాలను అందుకోవడంలో భావోద్వేగాలకు చోటివ్వరు.
6. మీరు చాలా లాజికల్.
7. మీరు పెట్టుకున్న లక్ష్యాలు చాలా వాస్తవికంగా ఉంటాయి, వాటిని అందుకోవడం కూడా సులువని మీకు తెలుసు.
8. మీకు స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయి. అవెలా సాధించాలో కూడా మీకే తెలుసు.
Also read: పెళ్లికి వెళుతున్నారా? ఇలాంటి పెళ్లికూతుళ్లు చేసే పనికి మీరు బలైపోగలరు జాగ్రత్త
Also read: అసురక్షిత సెక్స్ వల్ల 17 లక్షల మందికి హెచ్ఐవీ, కలవరపెడుతున్న ఆర్టీఐ నివేదిక