అన్వేషించండి

HIV: అసురక్షిత సెక్స్ వల్ల 17 లక్షల మందికి హెచ్ఐవీ, కలవరపెడుతున్న ఆర్టీఐ నివేదిక

మనదేశంలో హెచ్ఐవీ బారిన మరిన్ని లక్షల మంది పడినట్టు ఒక నివేదిక ద్వారా బయటపడింది.

చికిత్సే లేని భయంకర రోగం హెచ్ఐవీ. చాప కింద నీరులా మనదేశంలో లక్షల మందికి సోకింది ఈ వ్యాధి. అసురక్షిత లైంగిక కార్యకలాపాల వల్లే సోకినట్టు చెబుతోంది జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ. గత పదేళ్లలో కొత్తగా ఎయిడ్స్ బారిన పడిన వారి సంఖ్య పదిహేడు లక్షలుగా తేలింది. మధ్యప్రదేశ్ కు చెందిన కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ హెచ్ఐవీ బాధితులు దేశంలో ఎంత మంది ఉన్నారో? కొత్తగా ఎంతమందికి ఆ వ్యాధి సోకిందో వివరాలు కావాలని సమాచార హక్కు చట్టం ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. అందులో 2011-2021 మధ్యకాలంలో 17,08,777 మంది అసురక్షిత సెక్స్ ద్వారా హెచ్ఐవీ బారిన పడినట్టు నివేదిక ద్వారా తెలిసింది. అయితే గతంతో పోలిస్తే హెచ్ ఐవీ సోకుతున్న రేటు కాస్త నెమ్మదించిందనే చెప్పాలి. 2011-12లో 2.4 లక్షల మందికి హెచ్ఐవీ సోకింది. అదే 2020-21  మధ్య కాలంలో 85,268 మంది ఎయిడ్ బారిన పడినట్టు గుర్తించారు. 

ఆంధ్రప్రదేశే టాప్
రాష్ట్రాల వారీగా చూసుకుంటే గత పదేళ్లలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లో 3,18,814 మందికి హెచ్ఐవీ సోకింది. తరువాత మహారాష్ట్రలో 2,84,577 మందికి సోకింది. తమిళనాడులో 1,16,536 మందికి, ఉత్తర ప్రదేశ్లో 1,10,911 మందికి, గుజరాత్ లో 87,440 మందికి సోకినట్టు నిర్ధారించారు. 

రక్తం ద్వారా...
2011-12 నుంచి 2020-21 వరకు అసురక్షితంగా రక్తం ఎక్కించడం, రక్తానికి సంబంధించిన చికిత్సల కారణంగా 15, 782 మందికి హెచ్ఐవీ సోకినట్టు నిర్ధారించారు. అంటే వీరు ఎలాంటి అసురక్షిత లైంగిక కార్యకలపాలకు పాల్పడకపోయినా కూడా చిన్నచిన్న పొరపాట్ల వల్ల వైరస్ బారిన పడ్డారు. అంటే ఎయిడ్స్ రోగికి గుచ్చిన సూదినే వీరికి గుచ్చడం, లేదా ఎయిడ్ రోగి రక్తాన్ని వీరికి ఎక్కించడం అలాంటి చర్యల వల్ల వీరు హెచ్ఐవీ రోగులుగా మారారు. అలాగే హెచ్ఐవీ సోకిన తల్లి ద్వారా బిడ్డలకు వ్యాపించిన కేసులు కూడా ఉన్నాయి. అలా 4,423 మంది బిడ్డలు హెచ్ఐవీ బాధితులుగా మారారు.  2020 నాటికి దేశంలో మొత్తం 81,430 మంది పిల్లలు, 23 లక్షల మంది పెద్దలు హెచ్ఐవీతో జీవిస్తున్నట్టు ఆర్టీఐ నివేదిక చెబుతోంది. 

హెచ్ఐవీ శరీరంలోకి చేరాక నేరుగా రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది. దీనికి చికిత్స సకాలంలో తీసుకోకపోతే అది ఎయిడ్స్ గా మారుతుంది. 

లక్షణాలు ఇలా...
హెచ్ఐవీ సోకిన తరువాత కొన్ని వారాలకు జ్వరం, గొంతునొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిజానికి ఇది పెద్దగా లక్షణాలు చూపించదు. ఎయిడ్స్ గా మారాక మాత్రం బరువు తగ్గిపోవడం, జ్వరం, రాత్రి చెమటలు పట్టడం, విపరీతంగా అలసిపోవడం, ఏ పనీ చేయలేకపోవడం వంటివి కలుగుతాయి. దీనికి చికిత్స లేదు. కానీ కొన్ని మందులు వాడడం ద్వారా ఎక్కువ కాలం జీవించవచ్చు. 

Also read: ఎలన్ మస్క్‌ను వేధిస్తున్న ఆరోగ్య సమస్య ఇదే, అందుకేనేమో ఆయన ఆలోచనలు అంత స్పెషల్

Also read: స్లీప్ వాకింగ్‌కు కారణాలివే, ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం పొంచి ఉన్నట్టే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Embed widget