By: ABP Desam | Updated at : 14 Apr 2023 05:38 PM (IST)
Edited By: Soundarya
Image Credit: Pexels
వేసవిలో ఆరోగ్యంగా హైడ్రేట్ గా ఉండటం చాలా అవసరం. ఎంత ఎక్కువగా నీటిని తీసుకుంటే అంత మంచిది. శరీరాన్ని ఎప్పుడు నిర్జలీకరణం కాకుండా చూసుకోవాలి. నీటితో పాటు వేడి వాతావరణంలో మిమ్మల్ని శక్తివంతంగా, హైడ్రేట్ గా ఉంచే అనేక రకాల పానీయాలు ఉన్నాయి. వీటిని మీరు సులభంగా ఇంట్లోనే తయారు చేసుకుని తాగొచ్చు. ఇవి తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది. ఎండలో నుంచి రాగానే వీటిని తాగితే మీకు హాయిగా బడలిక లేకుండా ఉంటుంది. అవేంటంటే..
వరియాలి షర్బత్ ని ఫెన్నెల్ సీడ్ షర్బత్ అని కూడా పిలుస్తారు. సొంపు గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటితో చేసిన షర్బత్ వేసవిలో తీసుకుంటే చలువ చేస్తుంది. సొంపు గింజలు రాత్రంతా నీటిలో నానబెట్టి వాటిలో చక్కెర, నిమ్మరసం, మరికొన్ని సుగంధ ద్రవ్యాలు వేసి మిశ్రమాన్ని బాగా ఉడకబెట్టాలి. ఇలా చేయడం వల్ల తీపి, జిడ్డుగా ఉండే పానీయం రెడీ అవుతుంది. ఈ షర్బత్ లోని సొంపు గింజలు శీతలీకరణకు ప్రసిద్ధి చెందాయి. వేసవిలో తలెత్తే జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి. ఇందులోని చక్కెర శక్తిని ఇస్తుంది. డీహైడ్రేషన్, అలసటగా ఉన్న వారికి దాహం తీర్చే అద్భుతమైన పానీయం ఇది.
ఇంట్లోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. ఒక కప్పు సొంపు గింజలు నానబెట్టి వాటిలో చక్కెర, సుగంధ ద్రవ్యాలు వేసి ఉడికించుకోవాలి. మిశ్రమం చల్లారిన తర్వాత నిమ్మరసం, నల్ల ఉప్పు వేసి కలుపుకుని తాగాలి.
బేల్ షర్బత్ అనేది బేల్ పండు గుజ్జుతో తయారు చేస్తారు. ఈ పండు ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. వేసవిలో ఈ పండు తీసుకుంటే శరీరాన్ని హైడ్రేట్ గా, శక్తివంతంగా చేస్తుంది. ఇందులో విటమిన్ సి, బి, పోతాశీయంతో పాటు ఖనిజాలు ఉన్నాయి. శరీర వేడిని తగ్గించడంలో బేల్ షర్బత్ పని చేస్తుంది.
ఈ షర్బత్ చేయడానికి ఒక బేల్ పండు గుజ్జు తీసి అందులో చక్కెర, నీరు, చిటికెడు ఉప్పు కలపాలి. రుచిని మరింత పెంచుకునేందుకు కొన్ని తాజా పుదీనా ఆకులు, నిమ్మరసం కూడా జోడించుకోవచ్చు.
రాగి పిండితో దీన్ని తయారు చేస్తారు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడులో ప్రసిద్ధ వేసవి పానీయం. రాగి అంబిల్ ఒక రిఫ్రెష్ డ్రింక్. గ్లూటెన్ లేనిది. ఫైబర్ అధికంగా ఉంటుంది. కాల్షియం, ఇతర ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. వేసవిలో దీన్ని తీసుకుంటే శరీరం హైడ్రేట్ గా ఎనర్జిటిక్ గా ఉంచేందుకు సహాయపడుతుంది.
రాగి అంబిల్ చేయడానికి రాగి పిండిని నీటిలో ఉండలు లేకుండా కలుపుకుని తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. రుచి కోసం ఉప్పు, మజ్జిగ, తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసుకోవచ్చు. ఇది చల్లారిన తర్వాత తీసుకోవాలి. మరింత రిఫ్రెష్ చేయడానికి ఇందులో ఐస్ క్యూబ్ లు జోడించుకోవచ్చు.
పేదవాడి ప్రోటీన్ పౌడర్ సత్తు పిండి. కాల్చిన బెంగాల్ గ్రామ్ లేదా చిక్ పీస్( శనగలు) తో తయారు చేయబడిన పిండి. అధిక ప్రోటీన్ కంటెంట్ కి ప్రసిద్ధి చెందింది. సత్తు పిండిలో నీరు, నిమ్మరసం, రుచికి సరిపడా చక్కెర లేదా తేనె కలుపుకోవాలి. వీటన్నింటినీ కలుపుకుని ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. సత్తు నిమ్మరసం శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. శక్తిని ఇస్తుంది. చక్కెర పానీయాలకు చక్కని ప్రత్యామ్నాయం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ఉప్పు, కారం అద్దుకుని పండ్లు తింటున్నారా? అయితే ఈ సమస్యలు ఎదుర్కోవాల్సిందే
New Virus: ప్రపంచానికి పొంచి ఉన్న మరో 'వైరస్' ముప్పు- కరోనాని మించిపోయేలా మరణాలు!
Millets: చిరుధాన్యాలు తింటే బీపీ, షుగర్ అదుపులో ఉంటాయా?
కాలిన గాయాలకు వెంటనే చేయాల్సిన ప్రథమ చికిత్స ఇదే
Blood Cholesterol: రక్తంలో కొలెస్ట్రాల్ను తగ్గించుకోవాలా? అయితే ఈ పనులు చేయండి
Paschima Namaskarasana: పశ్చిమ నమస్కార ఆసనం అంటే ఏంటి? ఎలా వేయాలి? ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
బీజేపీపార్టీ ప్రతినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం
AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్
God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్తో వచ్చిన జయం రవి!
Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!
/body>