By: ABP Desam | Updated at : 24 Dec 2022 06:38 PM (IST)
Edited By: Soundarya
Image Credit: Unsplash
పూర్వం మట్టి పాత్రల్లో వంట చేసే వాళ్ళు. తర్వాత రాగి, ఇత్తడి పాత్రల్లో వంట చేసేవాళ్ళు. ఐరన్ వంట పాత్రల వాడకం కూడా పురాతన కాలం నుంచి వస్తుంది. ఈ పాత్రలకి మంట బాగా తగులుతుంది. అలాగే శుభ్రం చెయ్యడానికి కూడా సులువుగా ఉంటాయి. సాంప్రదాయకమైన కరాహి, వోక్ వంటి ఇనుమ పాత్రల్లో వండటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. చికెన్ వేయించడం దగ్గర నుంచి ఆమ్లెట్ వరకు అన్నింటికీ దీన్ని ఉపయోగిస్తారు.
☀ ఐరన్ వంట సామాన్లలో ఆహారం వండటం వల్ల ఐరన్ కంటెంట్ పెరుగుతుంది. వివిధ పరిశోధనాల ప్రకారం ఐరన్ లోపం వల్ల హిమోగ్లోబిన్ తగ్గుతుంది. ఐరన్ సాంద్రత పెంచేందుకు ఇనుము పాత్రల్లో వంట చేసుకుని తినొచ్చు.
☀ వంటకి అత్యంత సురక్షితమైన పాత్రల్లో ఒకటి ఇది. నాన్ స్టిక్, అల్యూమినియం పాత్రల కంటే ఐరన్ పాత్రలు చాలా మంచివి. వీటిలో వంట చెయ్యడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉండదు.
☀ ఇనుప కడాయిలో వండినప్పుడు కూరలు కంటికి ఇంపైన ముదురు రంగులో కనిపిస్తాయి. కానీ వాటిని ఆ పాత్రలో నుంచి వేరే పాత్రకి మార్చాలి లేదంటే ఆ కూర రంగు నల్లగా మారిపోతుంది.
☀ నీళ్ళు పోసిన కూరలు ఎక్కువ సేపు ఉంచకూడదు. దానివల్ల పాత్ర రుచి కూరకి అంటుతుంది. అందుకే ఇనుము పాత్రలు కేవలం వంట చెయ్యడానికి మాత్రమే ఉపయోగించాలి. ఆహారాన్ని నిల్వ చేయకూడదు.
☀ పాత్ర బాగా బరువుగా ఉంటే నాణ్యంగా ఉందని అనుకుంటారు. పాత్ర మందంగా ఉంటే వేడెక్కడానికి, ఉడికేందుకు సమయం ఎక్కువ తీసుకుంటుంది. అలా అని మరీ తేలిక పాత్రలు కొనుగోలు చేస్తే త్వరగా వేడెక్కి.. ఆహార పదార్థాలు మాడిపోతాయి.
⦿ ఇనుప పాత్రలు నీటి తేమ తగిలితే తుప్పు పట్టే ప్రమాదం ఉంది. అందుకే ఈ పాత్రలు భద్రపరిచే విషయంలో అదనపు శ్రద్ధ అవసరం. ఐరన్ వేర్ ని టేబుల్ సాల్ట్ తో స్క్రబ్ చేయడం ద్వారా శుభ్రం చేసుకోవచ్చు. ఇది పాత్రల జిడ్డుని కూడా వదిలిస్తుంది.
⦿ కరాహి పాత్రలని తేలికపాటి డిటర్జెంట్ తో కడగాలి. తుప్పు పట్టకుండా కూరగాయల నూనె కొద్దిగా వాటికి రాసి నిల్వ చేసుకోవచ్చు.
⦿ ఐరన్ పాత్రలు కడిగిన తర్వాత వెంటనే టవల్ తో తుడిచి పూర్తిగా ఆరబెట్టాలి. లేదంటే నీరు పోయే విధంగా కొద్దిగా వేడి చేసినా సరిపోతుంది. తుప్పు పట్టిన వాటిలో ఆహారం వండటం మంచిది కాదు.
⦿ యూఎస్ ఎన్విరాన్ మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రకారం చిన్న మొత్తంలో తుప్పు కడుపులోకి వెళ్లినా ఆరోగ్యానికి హాని కలిగించదు. కానీ హెమోక్రోమాటోసిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడేవారికి మాత్రం అది ప్రమాదకరం. తుప్పు కడుపులోకి వెళ్తే.. అక్కడి నుంచి అది అంతర్గత అవయవాల్లోకి చేరుతుంది. అక్కడ ఇనుమును పోగేస్తుంది. దానివల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నారా? ఈ ఆహార పదార్థాలు తినాల్సిందే
Banana Coffee: సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ బనానా కాఫీ- ఇది ఎలా తయారు చేస్తారంటే!
ఆ వ్యక్తి గొంతులో మొక్కలు మొలిచేశాయ్, ఇదో విచిత్రమైన ఆరోగ్య సమస్య - ప్రపంచంలోనే ఇది తొలికేసు
Diabetes: ఓట్స్ ఇడ్లీ - డయాబెటిస్ వారి కోసం ప్రత్యేకం ఈ బ్రేక్ఫాస్ట్
రోటీని నేరుగా మంట మీద కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా?
Ragi Cake Recipe: రాగి పిండితో చేసే ఆరోగ్యకరమైన చాక్లెట్ కేక్ - పిల్లలకు హెల్తీ రెసిపీ
RGV On Jagan Governament : సీఎం జగన్ అసెంబ్లీని ఎప్పుడు రద్దు చేస్తారో చెప్పేసిన ఆర్జీవీ - కానీ చిన్న ట్విస్ట్ ఉందండోయ్ ..
Samantha : అమ్మది అలెప్పీ అయినా మలయాళం నేర్పలేదు - కొచ్చిలో తల్లిపై సమంత కంప్లైంట్
LSG Vs DC: వార్నర్ సేనను మట్టికరిపించిన లక్నో - 50 పరుగులతో ఘనవిజయం!
Lokesh On Kethireddy : చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు- గుడ్ మార్నింగ్ మహానటుడు అంటూ కేతిరెడ్డిపై లోకేశ్ సెటైర్లు