Smart TV Mistakes to Avoid : స్మార్ట్ టీవీ విషయంలో ఆ తప్పులు చేయకండి.. త్వరగా పాడైపోద్ది
Smart TV Safety Tips : స్మార్ట్ టీవీ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. పొరపాటు చేస్తే త్వరగా పాడైపోతాయి. ఏ పనుల వల్ల ఎక్కువ నష్టం జరుగుద్దో ఇప్పుడు తెలుసుకుందాం.

Smart TV Care Guide : స్మార్ట్ టీవీ దాదాపు ప్రతి ఇంట్లో ఉంటుంది. పైగా పెద్ద టీవీలు, ఎక్కువ ఫీచర్స్ ఉండేవి ఎంచుకుంటున్నారు. ఇవి కేవలం వినోదం కోసమే కాదు.. గ్రాండ్ లుక్స్ కోసం చాలామంది వినియోగిస్తున్నారు. కొత్తగా ఇళ్లు కడితే టీవీ క్యాబినేట్ కచ్చితంగా ఉండాల్సిందే అన్నట్టుగా స్మార్ట్ టీవీలు ఇంట్లో రోల్ ప్లే చేస్తున్నాయి. అయితే వాటి విషయంలో తెలియక చేసే పొరపాట్లు పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎలక్ట్రానిక్ వస్తువులలో చిన్నపాటి లోపం కూడా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా స్మార్ట్ టీవీలు వినియోగించేప్పుడు కొన్ని మిస్టేక్స్ చేయకూడదని చెప్తున్నారు. ఎక్కువ కాలం పాటు టీవీలు వర్క్ చేయాలన్నా.. ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి. అవేంటంటే..
ఎండలో స్మార్ట్ టీవీని ఉంచవద్దు
స్మార్ట్ టీవీని ఎండ వచ్చే లేదా ఎక్కువ వేడి ఉండే ప్రదేశంలో ఉంచవద్దు. ఇంట్లోకి ఎండవచ్చే ప్రదేశానికి కాకుండా దూరంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే.. ఎక్కువ వేడి వలన డిస్ప్లే ప్యానెల్ పాడయ్యే అవకాశం ఉంది. అలాగే అంతర్గతంగా నష్టం వాటిల్లుతుంది. కాబట్టి స్మార్ట్ టీవీని ఎప్పుడూ ఎండ తగలని ప్రదేశంలో ఉంచాలి.
స్టెబిలైజర్ వాడకం
మీ ఇంట్లో వోల్టేజ్ హెచ్చుతగ్గులు సమస్య ఎక్కువగా ఉందా? అయితే మీరు స్మార్ట్ టీవీ కోసం స్టెబిలైజర్ తీసుకోవాలి. దీనిని ఉపయోగించడం వోల్టేజ్ సమస్యలు తగ్గుతాయి. లేదంటే వోల్టేజ్ ఒక్కసారిగా తగ్గడం లేదా పెరగడం వల్ల టీవీలోని ఇంటర్నల్ పార్ట్స్ డ్యామేజ్ అవుతాయి. అందుకే స్టెబిలైజర్ ముఖ్యం.
శుభ్రం చేసేప్పుడు జాగ్రత్త
స్మార్ట్ టీవీ డిస్ప్లే సున్నితంగా ఉంటుంది. కాబట్టి దానిని శుభ్రపరిచేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తడి గుడ్డ లేదా ప్రమాదకరమైన కెమికల్స్ ఉపయోగించి స్క్రీన్ క్లీన్ చేస్తే అది దెబ్బతింటుంది. అలాగే స్క్రీన్‌ను క్లీన్ చేసేప్పుడు క్లీనర్ నేరుగా స్క్రీన్‌పై స్ప్రే చేయకూడదు. క్లీనర్‌ను ముందుగా మైక్రోఫైబర్ గుడ్డపై స్ప్రే చేసి.. అనంతరం స్క్రీన్‌ను నెమ్మదిగా శుభ్రం చేయాలి. అలాగే స్క్రీన్‌ని గట్టిగా నొక్కి తుడవకూడదు.
ఆ తప్పు చేయకండి
ఎక్కువ సమయం టీవి ఉపయోగించిన తర్వాత అది వేడిని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి స్మార్ట్ టీవికి గాలి తగలడం కోసం వెనుక వెంటిలేషన్ కోసం గ్యాప్ ఉంచండి. టీవీ వెంట్‌లను కవర్ చేయకూడదు. టీవీని గోడకు మరీ దగ్గరగా అమర్చకూడదు. టీవీని మౌంట్ చేయడానికి ముందు యూజర్ గైడ్‌ను చదవాలి. కంపెనీ టెక్నీషియన్ సహాయం తీసుకోవాలి.
స్మార్ట్ టీవీలు ఇప్పుడు లగ్జరీ కాదు. ప్రతి ఇంట్లోనూ అవి అవసరమే. కానీ వాటిని జాగ్రత్తగా ఉపయోగించకపోతే కొత్త టీవీ కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ స్మార్ట్ TV ఎక్కువకాలం పనిచేస్తుంది. మీరు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి వృథా కాకుండా ఉంటుంది.






















