ఇంట్లో వైఫై పెట్టించుకున్నా.. రీచ్ సరిగ్గా ఉండట్లేదా? అయితే ఈ టిప్స్ మీకోసమే.

వైఫై రోటర్​ని సరైన ప్రదేశంలో పెట్టుకోవాలి. మైక్రేవేవ్స్, టీవీలు, ఫ్రిడ్జ్​లకు దూరంగా ఉంచాలి.

మీ రోటర్​ని రెగ్యులర్​గా రీబూట్ చేయాలి. వారానికోసారి రీస్టార్ట్ చేస్తే స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది.

బ్లూటూత్ స్పీకర్స్, బేబీ మానిటర్స్, ఇతర వైర్​లెస్​ డివైస్​లు వైఫై వినియోగానికి అడ్డం కలిగించవచ్చు. 5GHz బ్యాండ్‌కి మారితే మంచిది.

తెలియని యూజర్స్, పక్కింటివారు వినియోగిస్తుంటే మీ వైఫై కనెక్షన్ స్లో అవుతుంది.

WPA2, WPA3 encryption ఫాలో అవ్వండి. అలాగే స్ట్రాంగ్ పాస్​వర్డ్ పెట్టుకుంటే మంచిది.

పెద్ద ఇంట్లో ఉన్నప్పుడు లేదా డెడ్​ జోన్​లో ఉన్నప్పుడు Wi-Fi repeater/extender వాడితే బెస్ట్.

ఎక్కువ డివైస్​లు కనెక్ట్ అయి ఉంటే.. రోటర్​ సెట్టింగ్స్​లోకి వెళ్లి ఇంపార్టెంట్ డివైస్​లు ఉంచి మిగిలినవి తీసేయండి.

అప్​డేట్స్, ఆటో డౌన్​లోడ్స్, హెవీ డౌన్​లోడ్స్ రాత్రుళ్లు పెట్టుకుంటే మంచిది.