ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ (ఏహెచ్ఏలు) మొటిమలను తగ్గించి.. వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడానికి హెల్ప్ చేస్తుంది. చర్మం మెరుపును మెరుగుపరచడానికి ఇవి హెల్ప్ చేస్తాయి.
చెరకు రసం తరచుగా సహజమైన సూపర్ డ్రింక్గా పేరుపొందింది. ఇది పోషకాలతో నిండి ఉంటుంది. శరీరాన్ని చల్లగా ఉంచుతుందని ప్రసిద్ధి చెందింది.
ఇది శరీరంలో డీహైడ్రేషన్ సమస్యలను తగ్గిస్తుంది. హైడ్రేషన్ కోసం దీనిని తీసుకోవచ్చు.
కొంతమందికి చెరుకు రసం తాగడం కూడా హానికరం కావచ్చు. అనేక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.
మధుమేహం ఉన్నవారు చెరుకు రసం తాగకూడదు. చెరుకు రసంలో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది.
రక్తపోటు తక్కువగా ఉన్నవారు చెరుకు రసం తాగడం మానుకోవాలి. చెరుకు రసం రక్తపోటును తగ్గిస్తుంది. ఇది మైకం, బలహీనతకు కారణం కావచ్చు.
స్థూలకాయంతో బాధపడేవారు చెరకు రసం కూడా తీసుకోకూడదు.. ఎందుకంటే ఇది కేలరీలు, చక్కెర అధికంగా కలిగి ఉంటుంది. ఇది బరువు పెరిగేలా చేస్తుంది.
మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు చెరుకు రసం కూడా తీసుకోకూడదు. చెరుకు రసంలో పొటాషియం అధికంగా ఉంటుంది.