News
News
X

Pig Hotels: ఈ హోటల్ కేవలం పందులకే - ఫుల్ సెక్యూరిటీ, వైద్యుల పర్యవేక్షణతో లగ్జరీ లైఫ్!

పందులు ఎక్కడ నివసిస్తాయ్? ఈ ప్రశ్నకు వెంటనే వచ్చే సమాధానం.. ఏముంది? ఎక్కడ బురద ఉంటే అక్కడ ఉంటాయ్. కానీ, చైనాలో అలా కాదు అవి హోటల్‌లో మాత్రమే నివసిస్తాయి.

FOLLOW US: 

ళ్లు చెదిరే బహుళ అంతస్తుల భవనాలు, చుట్టూ హై సెక్యూరిటీ కెమెరాలు. బయటి వ్యక్తులు లోపలికి వెళ్లకుండా కఠిన చర్యలు. ఇవేవో దేశ భద్రతకు సంబంధించిన బిల్డింగులు కాదు. పందుల పెంపకం కోసం చైనాలో ఏర్పాటు చేసిన భవనాలు. వింటుంటేనే కాస్త ఆశ్చర్యం కలిగినా.. ఇది ముమ్మాటికీ వాస్తవం. పందులు తినే ఆహార పరిశీలన మొదలుకొని.. అవి రోగాల బారిన పడకుండా ఉండేందుకు 24 గంటల పాటు డాక్టర్ల పర్యవేక్షణ ఉంటుంది ఇక్కడ.

ప్రపంచంలోనే అతిపెద్ద పందుల పెంపక కేంద్రం

చైనాలోని సర్కారు నిర్ణయంతో పందుల కోసం ప్రత్యేకంగా హోటళ్లను ఏర్పాటు చేస్తున్నారు. తొలుత తక్కువ అంతస్థుల్లో పందుల పెంపకం మొదలు పెట్టిన చైనా సర్కారు.. ప్రస్తుతం వాటి సామర్థ్యాన్ని పెంచుకుంటూ వెళ్తోంది. దక్షిణ చైనాలో 13 అంతస్తులు ఉండే ఓ హోటల్‌ ను  దాదాపు 10 వేల పందులు ఉండేలా సకల సౌకర్యాలతో నిర్మించారు. అటు బీజింగ్‌ సమీపంలోని పింగూలో మరో భారీ భవంతిని నిర్మించారు.  ఏడాదికి  సుమారు లక్షన్నర పందుల ఉత్పత్తే లక్ష్యంగా దీన్ని రూపొందించారు. ఈ పందుల హోటళ్ల నిర్మాణంలో ముయాన్‌ ఫుడ్స్‌, న్యూహోప్‌ గ్రూప్‌ సహా పలు కంపెనీలు భాగస్వామ్యం అవుతున్నాయి. ఈ నెలాఖరులోగా.. హుబేలో ప్రైవేట్ యాజమాన్యంలోని సంస్థ అయిన Zhongxin Kaiwei మోడరన్ ఫార్మింగ్, 26-అంతస్తుల పిగ్ హోటల్‌ను పూర్తి కాబోతుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పందుల పెంపక నిర్మాణంగా రికార్డులు చెబుతున్నాయ్. ఇందులో సంవత్సరానికి  54,000 టన్నుల పంది మాంసం ఉత్పత్తి చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.  

బయో సెక్యూరిటీ జోన్లలో పందుల పెంపకం

చైనా ప్రజలు  రోజువారీ ఆహారంలో ఎక్కువగా పంది మాంసమే ఉంటుంది. అయితే 2018లో అక్కడ ఆఫ్రికా స్వైన్‌ ఫ్లూ విజృంభించింది. దీని కారణంగా సుమారు 40 కోట్ల పందులు చనిపోయాయి. దేశంలోని మొత్తం పందుల్లో సగానికి పైగా మృత్యువాత పడటంతో పంది మాంసం కొరత విపరీతంగా ఏర్పడింది. రేటు భారీగా పెరిగింది. దేశీయంగా అవసరాలను తీర్చుకునేందుకు చైనా భారీగా దిగుమతులను పెంచింది. ఈ కారణంగా అక్కడ భారీగా ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో చైనా నష్ట నివారణ చర్యలు చేపట్టింది. పందుల మీద వైరస్ ఎఫెక్ట్ లేకుండా చూడటంతో పాటు వాటి ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించింది. అందులో భాగంగానే బయో సెక్యూరిటీ జోన్లలో పందుల పెంపకానికి ఓకే చెప్పింది. అలా ఈ పిగ్స్ హోటళ్లు రూపొందుతున్నాయి.  

నిరంతరం నిపుణుల పర్యవేక్షణ

ఈ హోటళ్లలో పందులు చాలా సురక్షిత వాతావరణంలో పెరుగుతాయి. బయటి నుంచి ఎలాంటి హానికర సూక్ష్మక్రియులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎప్పటికప్పుడు పరీక్షించిన దాణాను మాత్రమే వీటికి అందిస్తారు. ఇందులో పని  చేసే సిబ్బంది సైతం ప్రత్యేక దుస్తులను ధరిస్తారు. పందులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా నిరంతరం డాక్టర్ల పర్యవేక్షణ ఉంటుంది. సాంప్రదాయ పందుల పెంపకంతో పోల్చితే.. తక్కువ విస్తీర్ణంలో అత్యంత అనుకూల వాతావరణం ఇవి పెరుగుతాయి. పర్యవరణ వనరుల వినియోగం సైతం చాలా తగ్గుతుంది.  అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. పిగ్ హోటళ్లలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వ్యాప్తి చెందితే భారీ నష్టం సంభవించే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. ఒకవేళ అదే జరిగితే నియంత్రించడం చాలా కష్టమంటున్నారు.

Also Read: వాట్సాప్‌లో ఆ రంగుల హార్ట్ ఎమోజీలకు అర్థం తెలుసా? ఒక్కో కలర్‌కు ఒక్కో భావం!

Also Read: టాయిలెట్‌లో టైంపాస్? గంటలు గంటలు దానిపై కూర్చుంటే చెప్పుకోలేని రోగం వస్తుందట!

Published at : 22 Aug 2022 07:31 PM (IST) Tags: china pig farming pig hotels pigs

సంబంధిత కథనాలు

Women's Health: మహిళలూ, మీరు ఈ వయస్సుకు వస్తే ఈ ఐదు పరీక్షలు తప్పనిసరి! లేకపోతే..

Women's Health: మహిళలూ, మీరు ఈ వయస్సుకు వస్తే ఈ ఐదు పరీక్షలు తప్పనిసరి! లేకపోతే..

Coronavirus: గొంతు నొప్పిగా ఉందా? జలుబు అనుకుంటే పొరబడినట్లే - ఎందుకో తెలుసా?

Coronavirus: గొంతు నొప్పిగా ఉందా? జలుబు అనుకుంటే పొరబడినట్లే - ఎందుకో తెలుసా?

Gut Health: ఇలా చేశారంటే మీ పేగులు చెడిపోతాయ్ - ఈ అలవాట్లకు దూరంగా ఉండండి

Gut Health: ఇలా చేశారంటే మీ పేగులు చెడిపోతాయ్ - ఈ అలవాట్లకు దూరంగా ఉండండి

Hair Care: నిగనిగలాడే జుట్టు కోసం కరివేపాకు - ఈ చిట్కాలు పాటిస్తే పొడవైన జుట్టు మీ సొంతం

Hair Care: నిగనిగలాడే జుట్టు కోసం కరివేపాకు - ఈ చిట్కాలు పాటిస్తే పొడవైన జుట్టు మీ సొంతం

వీటిని అతిగా తింటే శరీరంలో విషంగా మారిపోతాయి

వీటిని అతిగా తింటే శరీరంలో విషంగా మారిపోతాయి

టాప్ స్టోరీస్

Amaravati Vs Three Capitals : అమరావతికి పోటీగా మూడు రాజధానులపై విస్తృత ప్రచారం - వైఎస్ఆర్‌సీపీ స్ట్రాటజీ ప్రజల్లోకి వెళ్తుందా ? ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతారా ?

Amaravati Vs Three Capitals :  అమరావతికి పోటీగా మూడు రాజధానులపై విస్తృత ప్రచారం - వైఎస్ఆర్‌సీపీ స్ట్రాటజీ ప్రజల్లోకి వెళ్తుందా ? ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతారా ?

KCR National Party : జాతీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధం, హైదరాబాద్ చేరుకుంటున్న నేతలు

KCR National Party : జాతీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధం, హైదరాబాద్ చేరుకుంటున్న నేతలు

Sri Rajarajeshwari Ashtakam: సకల విజయాలను అందించే అష్టకం, దసరా రోజు చదువుకుంటే మంచిది

Sri Rajarajeshwari Ashtakam: సకల విజయాలను అందించే అష్టకం, దసరా రోజు చదువుకుంటే మంచిది

Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో 3 రోజులపాటు వర్షాలు: IMD

Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో 3 రోజులపాటు  వర్షాలు: IMD