WhatsApp Emojis: వాట్సాప్‌లో ఆ రంగుల హార్ట్ ఎమోజీలకు అర్థం తెలుసా? ఒక్కో కలర్‌కు ఒక్కో భావం!
ఇప్పుడంతా ఏమోజీల రాజ్యమే. ప్రేమ అనగానే రెడ్ హార్ట్ సింబల్ మాత్రమే పెట్టేస్తారు. మరి మిగతా రంగుల్లోని హార్ట్ సింబల్స్ అర్థాలు తెలుసా?
WhatsApp Emojis: ఇప్పుడు మాటలు, మెసేజుల కాలం పోయింది. అంతా ఏమోజీలే నడుస్తున్నాయి. సోషల్ మీడియాలో మెసేజ్ లు కంటే ఏమోజీలే ఎక్కువ వినియోగిస్తున్నారు. ఏదైనా రియాక్షన్ ఇవ్వాలంటే ఇంతక ముందు మెసేజ్ రూపంలో ఇచ్చే వాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఒక్క ఏమోజీ చాలు. మన మనసులోని భావం, మన ఫీలింగ్ ఏంటి అనేది తెలిపేందుకు ఒక్క ఏమోజీ పెట్టేస్తే సరిపోతుంది. రోజు రోజుకీ టెక్నాలజీ మరింత కొత్త పొంతలు తొక్కుతూ అప్ డేట్ వెర్షన్ మనకు ఇచ్చేస్తుంది. వాట్సప్ అనే కాదు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఏమోజీలే రాజ్యమేలుతున్నాయని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదేమో.
ప్రేమ, కోపం, బాధ, సంతోషం, దుఖం, నవ్వు, ఏడుపు, ఆకలి ఇలా ఏ ఫీలింగైనా ఒక్క ఏమోజీలో చెప్పేస్తున్నారు. ఎక్కడ మెసేజ్ టైప్ చేసి టైం వేస్ట్ చేసుకుంటాములే అని కొందరు ఏమోజీలతోనే మాట్లాడేసుకుంటారు. ఒక్కో ఏమోజీకి ఒక్కో అర్థం ఉంటుంది. అలాగే ప్రేమని వ్యక్తం చేసేందుకు హార్ట్ సింబల్ ఏమోజీలు ఇప్పుడు వాట్సప్ లో చాలా రంగుల్లో కనిపిస్తున్నాయి. అయితే వాటికి ఉన్న అర్థం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అందరూ సాధారణంగా ఎరుపు రంగు హార్ట్ సింబల్ నే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మిగతా వాటితో మనకి ఎందుకులే అని వాటి గురించి తెలుసుకోరు, పట్టించుకోరు. అయితే వివిధ రంగుల్లో ఉన్న హార్ట్ ఏమోజీలకు ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉందని మీకు తెలుసా? అవేంటో చూసేయండి మరి.
❤ రెడ్ హార్ట్ ఏమోజీ
ఇది అందరూ ఎక్కువగా ఉపయోగించేది. నిజంగా ప్రేమలో ఉన్న వాళ్ళు దీని సాధారణంగా ఉపయోగిస్తారు. తమ మనసుకి నచ్చిన విషయం అయినా కూడా వెంటనే రెడ్ హార్ట్ ఏమోజీ పెట్టేస్తారు.
❤ బ్లాక్ హార్ట్
దీన్ని వ్యంగ్యంగా కూడా ఉపయోగిస్తారు. ఇబ్బందికరమైన హాస్యాన్ని, రొమాంటిక్ లవ్, ఎమోషనల్ ఫీలింగ్ కలిగి ఉన్నప్పుడు దీన్ని సూచిస్తారు. విచారకరమైన విషయాలను సూచించేటప్పుడు కూడా ఈ బ్లాక్ హార్ట్ ఏమోజీ ఉపయోగిస్తారు.
❤ తెలుపు రంగు హార్ట్ ఏమోజీ
ఎవరైనా తమ ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు వారి పట్ల సానుభూతి చూపించేందుకు సంకేతంగా వైట్ హార్ట్ ఏమోజీ చూపిస్తారు. ఇది సానుభూతికి అర్థం.
❤ బ్లూ కలర్ హార్ట్
ప్రేమ, మద్దతు, ప్రశంసలు, ఆనందం, ఉత్సాహాన్ని వ్యక్తపరిచే సమయంలో ఈ బ్లూ హార్ట్ ఏమోజీ ఉపయోగించవచ్చు.
❤ పసుపు కలర్ హార్ట్ ఏమోజీ
సున్నితత్వాన్ని ఇది సూచిస్తుంది. ఎవరైనా కొత్త వ్యక్తులతో పరిచయం అయినా సమయంలో తాము ఎంత సున్నిత మనస్కులో చెప్పేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది.
❤ పర్పుల్ హార్ట్ సింబల్
కొంటెతనానికి ఇది సరిపోతుంది. అందుకే మీలోని కొంటెతనం చూపించేటప్పుడు దీన్ని వాడేయండి మరి. ఇది అందరికీ పంపించేది కాదండోయ్. అందుకే దీన్ని ఉపయోగించేటప్పుడు కాస్త ఆలోచించండి.
❤ గ్రీన్ హార్ట్ సింబల్
గ్రీన్ అనగానే పర్యావరణానికి సంబంధించినది అని అనుకుంటారేమో. అలా ఏమి లేదు. కానీ ఎక్కువగా పర్యావరణం, ఆకుపచ్చని అందాల గురించి మాట్లాడేటప్పుడు దీన్ని ఉపయోగిస్తారు. అందుకే మీరు హార్ట్ ఏమోజీలు పంపించేటప్పుడు ఒకసారి ఆలోచించి పోస్ట్ చేయండి.
Also Read: ఓ మై గాడ్, కోవిడ్ సోకినవారికి మూర్చల ముప్పు - మాస్క్ పెట్టుకోపోతే కష్టమే!
Also Read: టాయిలెట్‌లో టైంపాస్? గంటలు గంటలు దానిపై కూర్చుంటే చెప్పుకోలేని రోగం వస్తుందట!