News
News
వీడియోలు ఆటలు
X

Surya Namaskar: రోజూ సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆ సమస్యలన్నీ దూరం

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతారు.

FOLLOW US: 
Share:

సూర్య నమస్కారాలు ఒక నిర్దిష్ట క్రమంలో చేసే ప్రసిద్ధ యోగాభ్యాసం. ఇది శ్వాసను అదుపులో ఉంచుతూ శరీరాన్ని సాగదీయడం వంటిది. ఇందులో 12 భంగిమలు ఉంటాయి. ఈ 12 భంగిమలు రోజూ వేయడం వల్ల శరీరంలోని వివిధ భాగాలు ఆరోగ్యంగా మారుతాయి. సంపూర్ణ శారీరక, మానసిక శ్రేయస్సుకు ఈ సూర్య నమస్కారాలు సహకరిస్తాయని చెబుతారు. వీటిని రోజూ పాటించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు యోగా నిపుణులు. 

1. సూర్య నమస్కారాలు నిర్దిష్ట క్రమంలో చేయడం వల్ల శరీరం మొత్తానికి మెరుగైన రక్తప్రసరణ జరుగుతుంది. దీనివల్ల అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. 

2. సూర్య నమస్కారాల్లో చాలా భంగిమలు ముందుకు, వెనక్కు వంగి చేయాల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల కండరాలు వ్యాకోచిస్తాయి. శరీరం మొత్తం చురుగ్గా మారుతుంది. 

3. సూర్య నమస్కారాలు చేయడం వల్ల క్యాలరీలు ఎక్కువగా బర్న్ చేసుకోవచ్చు. బరువు తగ్గడానికి కూడా ఇది సహకరిస్తుంది. కండరాలను కాపాడడంతో పాటు జీవక్రియలు చురుగ్గా సాగేలా చేస్తుంది. 

4. ఒత్తిడి, ఆందోళనతో బాధపడే వారికి సూర్య నమస్కారాలు తగిన యోగాభ్యాసం. వీటిని రోజూ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన స్థాయిలు తగ్గుతాయి. ప్రశాంతమైన మనసు లభిస్తుంది.

5. సూర్య నమస్కారాలు పొట్ట ప్రాంతానికి రక్తప్రసరణను పెంచుతాయి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగ్గా, ప్రభావంతంగా జరుగుతుంది. పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది.

6. చేతులు, కాళ్లు, కండరాలు గట్టిపడతాయి. శరీరం అభివృద్ధి చెందుతుంది.

7. నడుము సన్నగా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. సూర్య నమస్కారాలు రోజూ చేస్తే నడుము సన్నబడి, మెరుపుతీగలా మారతారు. 

8. శరీరంలోని ప్రతి అవయవంలోని వ్యర్థాలను, విషపదార్థాలను తొలగించే శక్తి వీటికి ఉంది. 

బ్రహ్మీ ముహూర్తంలో ఈ సూర్య నమస్కారాలను చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తాయి. వేద పురాణాలలో కూడా వీటి ప్రస్తావన ఉంది. రామాయణంలో రావణాసురుడితో యుద్ధానికి ముందు రాముడికి అగస్త్య మహాముని సూర్ నమస్కారాలను బోధించి నట్టు చెబుతారు. యుద్ధకాండలో వాల్మీకి రామాయణంలో సూర్య నమస్కారాల శ్లోకాలను ప్రస్తావించారు. 

సూర్య నమస్కాలు సూర్య కిరణాలు శరీరాన్ని తాకుతుండగా చేయాలి. ఇలా చేయడం వల్ల కిరణాలు శరీరంలోకి ప్రవేశించి శుద్ధి చేస్తాయి. ఆలోచన శక్తిని కూడా మారుస్తాయి. సూర్య నమస్కారాల్లో కొన్నింటిని వేగంగా చేస్తే, కొన్నింటినీ నెమ్మదిగా చేయాలి. సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. థైరాయిడ్ సమస్య ఉన్న వారు సూర్య నమస్కారాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 

Also read: కోవిడ్ వైరస్ పుట్టింది గబ్బిలాల్లో కాదు మనుషుల్లోనే, చైనీస్ శాస్త్రవేత్త కొత్త వాదన

Also read: మామిడి పండ్లను తినేముందు కాసేపు నీళ్లలో నానబెట్టాలా? అలా చేయడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 15 Apr 2023 11:07 AM (IST) Tags: Surya Namaskar Surya Namaskar benefits Surya Namaskar for Daily Health with Surya Namaskar

సంబంధిత కథనాలు

డయాబెటిక్ కంటి సమస్యలకు కొత్త మందు? కొత్త ఆవిష్కరణలు ఏం చెబుతున్నాయి?

డయాబెటిక్ కంటి సమస్యలకు కొత్త మందు? కొత్త ఆవిష్కరణలు ఏం చెబుతున్నాయి?

Farm Milk Vs Packet Milk: తాజా పాలు Vs ప్యాకెట్ పాలు: ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసా?

Farm Milk Vs Packet Milk: తాజా పాలు Vs ప్యాకెట్ పాలు: ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసా?

Joint Pains: కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? ఈ ఆహారంతో నొప్పుల నుంచి ఉపశమనం

Joint Pains: కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? ఈ ఆహారంతో నొప్పుల నుంచి ఉపశమనం

Thyroid Cancer: పదే పదే బాత్రూమ్‌కు పరుగులు పెడుతున్నారా? ఈ లక్షణం క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు

Thyroid Cancer: పదే పదే బాత్రూమ్‌కు పరుగులు పెడుతున్నారా? ఈ లక్షణం క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు

మీకు ఈ మాత్రలు తీసుకొనే అలవాటు ఉందా? ఇక జీవితం మీద ఆశలు వదిలేయాల్సిందే!

మీకు ఈ మాత్రలు తీసుకొనే అలవాటు ఉందా? ఇక జీవితం మీద ఆశలు వదిలేయాల్సిందే!

టాప్ స్టోరీస్

Coromandel Train Accident: కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదా? ప్రతిపక్షాల వాదనల్లో నిజమెంత?

Coromandel Train Accident: కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదా? ప్రతిపక్షాల వాదనల్లో నిజమెంత?

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు-  నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Assembly Elections: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల సందడి - కీలక ఆదేశాలు ఇచ్చిన ఈసీ

Assembly Elections: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల సందడి - కీలక ఆదేశాలు ఇచ్చిన ఈసీ

Train Travel Insurance: మీ కుటుంబాన్ని రోడ్డుపాలు చేయకండి, 45 పైసలకే ₹10 లక్షల ప్రయాణ బీమా

Train Travel Insurance: మీ కుటుంబాన్ని రోడ్డుపాలు చేయకండి, 45 పైసలకే ₹10 లక్షల ప్రయాణ బీమా