అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Corona Virus: కోవిడ్ వైరస్ పుట్టింది గబ్బిలాల్లో కాదు మనుషుల్లోనే, చైనీస్ శాస్త్రవేత్త కొత్త వాదన

కోవిడ్ వైరస్ ఎక్కడ పుట్టింది అనే విషయం ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. ఇప్పుడు ఓ చైనా శాస్త్రవేత్త కొత్త వాదన మొదలుపెట్టాడు.

ప్రపంచాన్ని వణికించిన వైరస్ కోవిడ్. దీని మూలాలు ఎక్కడ అనే విషయంపై కచ్చితమైన నిర్ధారణ ఇంకా జరుగలేదు. వూహాన్ నగరంలోని ఒక మాంసాహార మార్కెట్ నుంచి ఈ వైరస్ మొదలై ఉంటుందని మొదట్లో భావించారు. ఆ తర్వాత అది గబ్బిలాల నుంచి పుట్టిందని అన్నారు. ఈ వైరస్ ఎక్కడ పుట్టింది అన్న విషయంపై ఒక్కో దేశం ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. మొత్తం మీద ఈ వైరస్ పుట్టింది మాత్రం చైనాలోనే అనే అభిప్రాయం మాత్రం ప్రపంచ దేశాలకు వచ్చింది. ముఖ్యంగా గబ్బిలాల నుండే ఈ కరోనా వైరస్ మానవులకు సోకిందని ఎక్కువ మంది పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అదే ప్రపంచానికి చాటి చెప్పారు. అయితే ఈ వైరస్ గబ్బిలాల్లోకి చేర్చింది మాత్రం చైనా శాస్త్రవేత్తలు అని కూడా అన్నారు. ఈ వైరస్ మానవ నిర్మితమైనదని ఎంతో మంది నమ్మకం. అయితే తాజాగా ఒక చైనీస్ శాస్త్రవేత్త మాత్రం ఈ వైరస్ గబ్బిలాల నుంచి మానవులకు సోకలేదని చెబుతున్నాడు.  ఈ వైరస్ మనుషుల్లోనే ఉద్భవించిందని కొత్త వాదన మొదలుపెట్టాడు. 

బీజింగ్ యూనివర్సిటీ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి చెందిన టోన్ ఇగాంగ్ అనే శాస్త్రవేత్త కరోనా వైరస్ పుట్టింది మనిషిలోనే అంటూ కొత్త వాదనకు తెర తీశాడు. వూహాన్లోని జంతు మాంసం మార్కెట్లో సేకరించిన ఈ వైరస్ నమూనాల్లోని జన్యు శ్రేణులు, వైరస్ సోకిన వ్యక్తుల్లోని జన్యువులు దాదాపు సమానంగా ఉన్నాయని చెప్పాడు. కాబట్టి ఈ వైరస్ మానవుల్లోనే పుట్టి ఉంటుందని ఆయన వాదిస్తున్నాడు. అయితే  ఈయన వాదనను మిగతా దేశాల శాస్త్రవేత్తలు కొట్టి పడేస్తున్నారు. ఇతని చెత్త వాదన అని విమర్శిస్తున్నారు. కరోనా సోకిన మొదటి వ్యక్తి కూడా చైనాకు చెందిన వాడేనని అంటున్నారు. ఏదేమైనా ఈ వాదనను నమ్మేవారు తక్కువ మందే ఉన్నారు. 

ప్రపంచాన్ని మూడేళ్ల పాటూ వణికించిన కరోనా వైరస్ 2019 డిసెంబరులో చైనాలో బయటపడింది. అక్కడ్నించి కేవలం మూడు నెలల్లో ప్రపంచదేశాలన్నింటికీ వ్యాపించింది. మొదట్లలో దీన్ని నిమోనియాగా భావించారు. తరువాత పలు పరీక్షల ద్వారా కరోనా వైరస్ సంగతి బయటపడింది. అన్ని దేశాలకు ఈ వైరస్ సులువుగా వ్యాపించేసింది. అమెరికా, భారత్, బ్రెజిల్ వంటి దేశాల్లో ఎక్కువ మరణాలు సంభవించాయి. కొన్ని నెలల పాటూ ఎన్నో దేశాలు లాక్ డౌన్ విధించాయి. కరోనా వైరస్‌ను నిలువరించే వ్యాక్సిన్ కనిపెట్టడానికే కొన్ని నెలల సమయం పట్టింది. మొత్తమ్మీద రెండు మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాక, ప్రజలకు ఉచితంగా వేశాయి ప్రభుత్వాలు. 

Also read: మామిడి పండ్లను తినేముందు కాసేపు నీళ్లలో నానబెట్టాలా? అలా చేయడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget