Bihar Cabinet Ministers: బిహార్ కేబినెట్ అప్‌డేట్.. 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం.. డిప్యూటీ సీఎం కోసం హోరాహోరీ
ఎన్డీఏ ప్రభుత్వం గురువారం బిహార్ లో కొలువుదీరనుంది: ఉపేంద్ర కుష్వాహా భార్య స్నేహలత, సంతోష్ లకు మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం జరుగుతోంది.

పాట్నా: నవంబర్ 20న బిహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. గురువారం ఉదయం 11:30 గంటలకు రాజధాని పాట్నాలోని గాంధీ మైదానంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో పాటు 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం. డిప్యూటీ సీఎం పదవికి బీజేపీ నుంచి సామ్రాట్ చౌదరి, మంగళ్ పాండే, విజయ్ కుమార్ సిన్హా రేసులో ఉన్నారు. విజయ్ సిన్హా స్పీకర్ పదవికి కూడా రేసులో ఉన్నారని వినిపిస్తోంది.
బీజేపీ నుంచి మంత్రులుగా నితిన్ నవీన్, రమా నిషాద్, శ్రేయసి సింగ్, పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఒకరు లేదా ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించే అవకాశం కనిపిస్తోంది. ఓ మహిళను కూడా డిప్యూటీ సీఎంగా నియమించే అవకాశం ఉందని కూటమి నుంచి సమాచారం. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. బీజేపీ నుంచి రేణు దేవి బీహార్‌లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారని తెలిసిందే.
జేడీయూ కోటా నుంచి ఎవరికి ఛాన్స్
సమాచారం ప్రకారం, జేడీయూ కోటా నుంచి చాలా మంది పాత మంత్రులను తిరిగి నియమించే అవకాశాలున్నాయి. వీరిలో బిజేంద్ర యాదవ్, విజయ్ కుమార్ చౌదరి, లేసీ సింగ్, జమా ఖాన్, శ్రవణ్ కుమార్, రత్నేష్ సదా మరియు మదన్ సహానీల పేర్లు ఉన్నాయి. కొత్త ముఖాల్లో జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేష్ కుష్వాహా , కలాధర్ మండల్‌లను మంత్రులుగా కానున్నారు.
మరోవైపు, రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం) నుంచి ఉపేంద్ర కుష్వాహా భార్య స్నేహ లతా మంత్రి రేసులో ఉన్నారు. హిందుస్థానీ అవామ్ మోర్చా (హమ్) నుంచి జాతీయ అధ్యక్షుడు సంతోష్‌ను తిరిగి మంత్రిగా నియమించే అవకాశమందుి. ఆయన మంత్రిగా కొనసాగుతున్నారు.
డిప్యూటీ సీఎం రేసులో దిలీప్ జైస్వాల్
బీజేపీ కోటా నుంచి తిరిగి అవకాశం దక్కించుకునే పాత మంత్రులలో సామ్రాట్ చౌదరి, మంగళ్ పాండే, నితిన్ నవీన్, విజయ్ కుమార్ సిన్హా, నితీష్ మిశ్రా, రేణు దేవి, జనక్ రామ్‌ల పేర్లు ఉన్నాయి. కొత్త ముఖాల విషయానికి వస్తే, శ్రేయసి సింగ్, రమా నిషాద్‌లను మంత్రులుగా నియమించవచ్చు. బిహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ సైతం డిప్యూటీ సీఎం రేసులో ఉన్నారు. విజయ్ కుమార్ సిన్హా డిప్యూటీ సీఎం, స్పీకర్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు పదవులకు పోటీలో ఉన్నారు. రామకృపాల్ యాదవ్ కూడా స్పీకర్ లేదా మంత్రి అవుతారని నేతలు చెబుతున్నారు. ప్రేమ్ కుమార్ కూడా స్పీకర్ పదవికి రేసులో ఉన్నారు.























