అన్వేషించండి

Hyundai Venue N Line కోసం Venue కంటే రూ.74,000 ఎక్కువ ఇవ్వాల్సిన అవసరముందా? - పూర్తి విశ్లేషణ

Hyundai Venue N Line ధర Venue కంటే సుమారు రూ.74,000 ఎక్కువ. ఈ అదనపు ఖర్చుకు నిజంగా విలువ ఉందా?. డిజైన్‌, ఫీచర్లు, డ్రైవింగ్ ఫీల్‌, లోపాలపై విశ్లేషణ.

Hyundai Venue N Line Review: హ్యుందాయ్ వెన్యూ కొత్త మోడల్‌ ఇప్పటికీ తన సెగ్మెంట్‌లో ప్రీమియం SUV‌లా ఫీలింగ్ ఇస్తోంది. అయితే మీరు కాస్త స్పోర్టీ లుక్‌, ప్రత్యేకమైన ప్రెజెన్స్‌, ఇంకా కొంత ఎక్స్‌క్లూజివ్ ఫీల్‌ కావాలనుకుంటే వెన్యూ N లైన్ కూడా ఒక ఆప్షన్‌. కానీ దాని కోసం, వెన్యూ టాప్-ఎండ్ మోడల్‌తో పోలిస్తే సుమారు రూ.74,000 అదనంగా చెల్లించాలి. మరి ఈ అదనపు మొత్తం నిజంగా విలువైనదేనా?. ఇప్పుడు ఒక్కొక్క అంశం విడివిడిగా తెలుసుకుందాం.

ఇంజిన్‌ & డ్రైవింగ్: మార్పులు ఉన్నాయా?

వెన్యూ N లైన్‌లో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ (120hp, 172Nm) ఉంటుంది. ఇది 7-స్పీడ్ DCT లేదా 6-స్పీడ్ మాన్యువల్‌ (N6 ట్రిమ్‌) ఆప్షన్‌లతో వస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, స్టాండర్డ్ వెన్యూ లాగే ఉంటుంది. ఎలాంటి అదనపు పవర్‌, టార్క్‌, సస్పెన్షన్ మార్పులు లేవు. 

అయితే ఒక చిన్న అదనపు ప్రత్యేకత ఉంది - డ్యూయల్ టిప్ ఎగ్జాస్ట్. తక్కువ స్పీడ్‌లో ఒక్క చిన్న స్పోర్టీ నోట్‌ వస్తుంది. కానీ 3,000 RPM దాటిన తర్వాత ఇంజిన్ శబ్దమే ఎక్కువగా వినిపిస్తుంది. ఇది ఆఫ్టర్‌ మార్కెట్‌ ఎగ్జాస్ట్‌లా శక్తిమంతమైన సౌండ్ ఇవ్వదు, కానీ పూర్తిగా లీగల్ & ప్రీమియంగా అనిపిస్తుంది.

బయటి లుక్‌లో భారీ మార్పులు

వెన్యూ N లైన్ స్టైల్‌ను ఇష్టపడే వారికి ఇది అసలు బోరు కొట్టదు. కొనుగోలు చేసిన వెంటనే ఇది స్పోర్టీ SUVలా బయటే కనిపిస్తుంది. దీనికి...

  • మోర్‌ అగ్రెసివ్‌ ఫ్రంట్ బంపర్
  • స్లిమ్ గ్రిల్
  • గ్లోస్ బ్లాక్ + రెడ్ యాక్సెంట్స్
  • బాడీ కలర్ క్లాడింగ్‌ మీద రెడ్ లైన్
  • 17-ఇంచ్ అద్భుతమైన అలోయ్ వీల్స్
  • అన్ని చక్రాలకు డిస్క్ బ్రేక్స్ + రెడ్ కాలిపర్స్
  • Hyundai Ioniq 5 N స్పూర్తితో డ్యూయల్ రిడ్జ్ స్పాయిలర్

ఇంటీరియర్‌లో ఏం మార్పులు జరిగాయి?

క్యాబిన్ పూర్తిగా ఆల్-బ్లాక్ థీమ్, ఎక్కడ చూసినా రెడ్ స్టిచింగ్‌, స్పోర్టీ స్టీరింగ్ వీల్‌ (Ioniq 5 N స్టైల్).

అదనంగా:

  • N బాడ్జింగ్ స్టీరింగ్
  • కొత్త లెదరెట్ సీట్లు
  • అరోమా డిఫ్యూజర్
  • అదనపు ADAS ఫీచర్లు
  • ముఖ్యంగా రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ + అసిస్ట్

దాదాపు అన్ని ఫీచర్లు HX10 టాప్ ట్రిమ్‌తో సేమ్‌గా ఉంటాయి, కానీ ప్రెజెన్స్ మాత్రం N లైన్‌లో ఎక్కువగా ఉంటుంది.

హ్యుందాయ్‌ వెన్యూ ఎన్‌ లైన్‌లో ఏం మిస్సయ్యింది?

గత N లైన్ మోడళ్లలో సస్పెన్షన్‌ + స్టీరింగ్‌ ట్యూనింగ్ ఉండేది.

ఈసారి:

  • సస్పెన్షన్ మార్పులు లేవు
  • స్టీరింగ్ ట్యూనింగ్ లేదు
  • డ్రైవింగ్ ఫీల్‌లో పెద్ద తేడా లేదు

వెన్యూ N లైన్ ఇప్పుడు డ్రైవింగ్‌ మార్పు లేదు, స్టైల్ కోసమే రూపొందించారు.

అయితే... అదనపు రూ.74,000కు విలువ ఉంటుందా?

మీరు SUVలో స్పోర్టీ ప్రెజెన్స్ కోరుకుంటారా?, స్పోర్టీ క్యాబిన్ లుక్ కూడా ఇష్టమా?, అయితే N లైన్ సరైన ఆప్షన్. కానీ.. డ్రైవింగ్ పెర్ఫార్మెన్స్‌లో పెద్ద మార్పులు కోరుకునే ఆటోమొబైల్ లవర్స్‌ అయితే కొంచెం నిరాశ చెందవచ్చు. నిజాయితీగా చెప్పాలంటే, వెన్యూ N లైన్ ఒక ప్రత్యేక స్పోర్టీ మోడల్‌లా కాకుండా ఒక అదనపు ట్రిమ్‌లా మాత్రమే కనిపిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
Advertisement

వీడియోలు

The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
KTR No Respect to CM Revanth Reddy | సభానాయకుడు వచ్చినా KTR నిలబడకపోవటంపై సోషల్ మీడియాలో చర్చ | ABP Desam
BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Araku Special Trains: అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
Peddi Movie : రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
Embed widget