2025లోనే చూడబోతున్న 3 ఇంపార్టెంట్ EVలు: మారుతి, టాటా, మహీంద్రా నుంచి మార్కెట్‌ను కుదిపేసే ఎలక్ట్రిక్ కార్లు!
2025 చివరిలో, భారత మార్కెట్‌లో మహీంద్రా, మారుతి, టాటా EVలు దూసుకురానున్నాయి. ఈ మూడు కార్లు డిజైన్, రేంజ్, ఫీచర్ల పరంగా ఏం కొత్తదనం తీసుకురానున్నాయో వివరాలు మీకోసం.

Upcoming Electric SUVs 2025 India: 2025 చివరకు చేరుకునే సరికి భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ మరింత వేగం అందుకుంటోంది. ఈ ఏడాది ఇప్పటికే చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVలు) వచ్చినా, జనం ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూడు పెద్ద మోడల్స్ ఇంకా లాంచ్ కావాల్సి ఉంది. ఇవి ఒక్కోటి తమ సెగ్మెంట్‌లో సాలిడ్ ఇంపాక్ట్ ఇవ్వగల సామర్థ్యంతో వస్తున్నాయి. ఆ మూడు EVలు - Mahindra XEV 9S, Maruti Suzuki e Vitara, Tata Sierra EV. ఇవి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి డిమాండ్ పలకవచ్చు.
1. Mahindra XEV 9S - 3 వరుసల ఎలక్ట్రిక్ SUV
నవంబర్ 27న లాంచ్ కానున్న మహీంద్రా XEV 9S, ఈ బ్రాండ్ నుంచి రాబోయే మొదటి 3-వరుసల e-SUV. INGLO ప్లాట్‌ఫామ్‌పై ఈ మోడల్ రూపుదిద్దుకుంది. అధికారిక వివరాలు ఇంకా వెల్లడించకపోయినా... XEV 9e, BE 6లో ఉన్న అదే 59kWh, 79kWh బ్యాటరీ ఆప్షన్‌లు ఇస్తారని అనుకోవచ్చు. పెద్ద బ్యాటరీతో 650km వరకు ARAI రేంజ్ వచ్చే అవకాశం ఉంది.
డిజైన్ విషయానికి వస్తే... XEV 9e మాదిరిగానే స్లీక్ LED లైట్ బార్, ట్రైయాంగిల్ హెడ్‌ల్యాంప్స్, ఆకర్షణీయమైన ప్రొఫైల్ కనిపిస్తాయి. ఇంటీరియర్ మాత్రం మరో లెవల్‌లో ఉండొచ్చు, ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్, హర్మాన్ కార్డాన్ సౌండ్, మెమరీ ఫంక్షన్‌తో పవర్ డ్రైవర్ సీట్, పనోరమిక్ సన్‌రూఫ్, బాస్ మోడ్, లెవల్ 2 ADAS వంటి ఫీచర్లు వస్తాయి.
ప్రస్తుతం భారత మార్కెట్‌లో XEV 9Sకి డైరెక్ట్ రైవల్ లేదు. Kia Carens Clavis EV, BYD eMax 7లాంటివి MPVs కావడంతో, కొత్తగా రానున్న Mahindra SUVకి ప్రత్యేక స్థానం దక్కే ఛాన్స్ ఉంది.
2. Maruti Suzuk e Vitara - మారుతి తొలి EV
డిసెంబర్ 2న మారుతి తన మొదటి EV ఇ-విటారాను భారత మార్కెట్‌లో విడుదల చేస్తోంది. e Vitara రెండు పవర్‌ట్రెయిన్‌లతో వస్తోంది, అవి:
144hp - 49kWh బ్యాటరీ - 344km WLTP రేంజ్
174hp - 61kWh బ్యాటరీ - 428km WLTP రేంజ్
61kWh వేరియంట్ ARAI టెస్ట్ ప్రకారం 500km+ రేంజ్ ఇవ్వొచ్చన్న అంచనాలు ఉన్నాయి.
రగ్గ్‌డ్ డిజైన్, LED ల్యాంప్స్, బలమైన సైడ్ క్లాడింగ్, ఏరో స్టైల్ వీల్స్‌తో SUV లుక్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇంటీరియర్‌లో డ్యుయల్ స్క్రీన్ సెటప్, కీలెస్ ఎంట్రీ, సన్‌రూఫ్, 360 కెమెరా, ADAS, పవర్డ్ డ్రైవర్ సీట్, ఇన్‌ఫినిటీ ఆడియో, వైర్‌లెస్ అండ్రాయిడ్/ఆపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లు అందుతాయి.
ఇది, మారుతికి EV సెగ్మెంట్‌లో తొలి అడుగు కావడంతో, అందరి దృష్టి ఈ SUVపైనే ఉంది.
3. Tata Sierra EV - ఐకానిక్ పేరుకు ఎలక్ట్రిక్ ట్విస్ట్
Sierra ICE వెర్షన్‌ను నవంబర్ 25న లాంచ్ చేయనున్న టాటా, Sierra EVని కూడా ఈ ఏడాది చివర్లో పరిచయం చేయనుంది. ధరలు మాత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రకటించే అవకాశం ఉంది.
బ్యాటరీ ఆప్షన్లను టాటా ఇంకా ప్రకటించకపోయినా, Curvv EV (55kWh), Harrier EV (65kWh) ప్యాక్స్‌నే ఉపయోగించే ఛాన్స్ ఉంది.
డిజైన్‌లో మాత్రం కీలక మార్పు కనిపించవచ్చు, ICE వెర్షన్‌లో ఉన్న బ్లాక్ గ్రిల్ స్థానంలో EVలో క్లోజ్డ్ బాడీ కలర్ గ్రిల్ ఉంటుంది. LED లైట్ బార్స్, షార్ప్ లుక్ అలాగే కొనసాగుతాయి.
ఫీచర్లలో - ADAS, పనోరమిక్ సన్‌రూఫ్, JBL సౌండ్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు.. ఇలా మొత్తం ICE మోడల్‌లో ఉన్న టాప్ ఫీచర్లు EVకీ వస్తాయి.
ఈ కారు Hyundai Creta Electric, MG ZS EV, Mahindra BE 6తో పోటీ పడనుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















