అన్వేషించండి

2025 Tata Sierra vs old Sierra: 33 ఏళ్ల తర్వాత వచ్చిన కొత్త మార్పులు ఏంటి?

2025 టాటా సియెరాను పాత సియెరాతో పోల్చితే డిజైన్‌, ఇంటీరియర్‌, ఇంజిన్‌ ఆప్షన్లలో ఎంత మారిందో సింపుల్‌గా అర్థమయ్యేలా వివరించిన స్టోరీ ఇది.

New vs Old Tata Sierra Comparison: టాటా మోటార్స్‌ తిరిగి తీసుకొచ్చిన కొత్త 2025 సియెరా ఇప్పుడు ఆటోమొబైల్‌ మార్కెట్లో పెద్ద ఎక్స్‌పెక్టేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. 1991లో భారతీయ మార్కెట్లోకి వచ్చిన పాత సియెరా అప్పట్లోనే ప్రత్యేకమైన డిజైన్‌తో మనలో చాలా మందికి గుర్తుండిపోయింది. మధ్యలో అమ్మకాలు ఆగిపోయినా, ఆ SUVకి ఉన్న క్రేజ్‌ మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. ఇప్పుడు, 22 ఏళ్ల తర్వాత, కొత్త సియెరా పాత SUV స్పూర్తితో, పూర్తిగా ఆధునిక ఫీచర్లతో తిరిగి రావడం మరింత ఆసక్తిని రేపుతోంది.

డిజైన్‌లో వచ్చిన పెద్ద మార్పులు
పాత సియెరాలో ఉన్న కర్వ్‌లాంటి రియర్‌ గ్లాస్‌ సెక్షన్‌ అప్పట్లోనే ఐకానిక్‌. ఇప్పుడు ఆ డిజైన్‌ను నేరుగా రిపీట్‌ చేయడం సేఫ్టీ నిబంధనల వల్ల సాధ్యం కాదు గానీ, టాటా దీనిని కలర్‌ కాంట్రాస్ట్‌ ట్రీట్‌మెంట్‌తో స్మార్ట్‌గా రీక్రియేట్‌ చేసింది. రియర్‌ విండో పైన ఉన్న బ్లాక్‌ ప్యానెల్‌ పాత సియెరా లుక్‌ను గుర్తు చేస్తుంది.

అలాగే పాత SUVలో ఉన్న స్క్వేర్‌ వీల్‌ ఆర్చెస్‌, హై బోనెట్‌ స్టాన్స్‌ కూడా కొత్త సియెరాలో కనిపిస్తాయి. కానీ, మోడ్రన్‌ టచ్‌గా 19-అంగుళాల పెద్ద వీల్స్‌, ఎయిరో డిజైన్‌, ఫుల్‌-విడ్త్‌ LED లైట్‌ బార్‌, స్ప్లిట్‌ హెడ్‌ల్యాంప్స్‌ వంటి కొత్త లుక్‌ ఎలిమెంట్స్‌ జోడించారు.

మొత్తానికి పాత SUVకి గౌరవం ఇస్తూనే, ఆధునిక SUV మార్కెట్లో గట్టి పోటీ ఇచ్చేలా కొత్త సియెరా రూపుదిద్దుకుంది.

ఇంటీరియర్‌లో పూర్తి మార్పు
పాత సియెరాలో చాలా వరకు యుటిలిటేరియన్‌ లుక్‌ ఉండేది. ఎయిర్‌ కండిషనింగ్‌, పవర్‌ విండోస్‌, టాకోమీటర్‌ను అప్పట్లో ప్రీమియం ఫీచర్లుగా భావించేవారు.

ఇక కొత్త సియెరాలో మాత్రం ఇంటీరియర్‌ పూర్తిగా నెక్ట్స్‌ లెవెల్‌లో ఉంది. డ్యాష్‌బోర్డ్‌ అంతా ఒక భారీ ట్రిపుల్‌ స్క్రీన్‌ సెటప్‌తో ఉంటుంది. డ్రైవర్‌కు డిజిటల్‌ క్లస్టర్‌, మధ్యలో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌, కోడ్రైవర్‌కు కూడా అదనపు స్క్రీన్‌ అమర్చారు. JBL Dolby Atmos సౌండ్‌ సిస్టమ్‌, సాఫ్ట్‌ టచ్‌ మెటీరియల్స్‌, పెద్ద స్టోరేజ్‌, మెరుగైన ఎర్గోనామిక్స్‌ వంటివి కొత్త SUVకు ప్రీమియం ఫీల్‌ ఇస్తాయి.

పాత మోడల్‌లో సాధారణమైన ఫోర్‌-స్పోక్‌ స్టీరింగ్‌ ఉండేది. ఇప్పుడు అదే స్టైల్‌ను ఆధునిక రూపంలో మళ్లీ డిజైన్‌ చేసి, ఇల్యూమినేటెడ్‌ టాటా లోగోతో ఇచ్చారు.

ఇంజిన్‌ ఆప్షన్లలో భారీ మార్పులు
పాత సియెరా మొదట నేచురల్‌ డీజిల్‌ ఇంజిన్‌తో వచ్చింది. తర్వాత 91hp టర్బో డీజిల్‌, 4x4 ఆప్షన్‌ కూడా అందించారు.

2025 సియెరా అయితే చాలా వెరైటీలు ఇస్తోంది. కంపెనీ అధికారికంగా ప్రకటించకపోయినా, కొత్త సియెరాలో ఇవి ఉండొచ్చని భావిస్తున్నారు:

1.5L నేచురల్‌ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ - 120hp

1.5L టర్బో పెట్రోల్‌ - 170hp

1.5L డీజిల్‌ - 116hp (కర్వ్‌ నుంచి తీసుకునే అవకాశం)

ఈ ఇంజిన్లకు మాన్యువల్‌, ఆటోమేటిక్‌ ఆప్షన్లు ఇస్తారు. సియెరా ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ తర్వాత లాంచ్‌ అవుతుంది. అయితే 4x4 ఆప్షన్‌ ప్రస్తుతం ఉండకపోవచ్చు. కుటుంబ వినియోగం దృష్ట్యా FWD తోనే చాలామంది సరిపెట్టుకుంటారు.

పాత సియెరా నోస్టాల్జియా, కొత్త సియెరా ఫీచర్లు రెండిటినీ కలిపిన SUV ఇది. హ్యుందాయ్‌ క్రెటా, గ్రాండ్‌ విటారా వంటి బలమైన ప్రత్యర్థుల మధ్య టాటా ఈసారి గట్టిగానే పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సియెరా నేమ్‌ప్లేట్‌తో తిరిగి రావడంతో మార్కెట్లో ఆసక్తికరమైన పోటీ నెలకొనబోతోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget