అన్వేషించండి

Tata Sierra 2025 ఫ్యామిలీ యూజ్‌కి సూట్ అవుతుందా? మీ కోసం పూర్తి వివరాలు

కొత్త Tata Sierra ఫ్యామిలీ యూజ్‌కి ఎంత ప్రాక్టికల్‌గా ఉంటుంది?, స్పేస్‌, కంఫర్ట్‌, ఫీచర్లు, స్క్రీన్ లేఅవుట్‌, సన్‌రూఫ్‌, ADAS, తెలుగు ఫ్యామిలీలు చూసే ప్రధాన పాయింట్లన్నీ ఈ కథనంలో.

Tata Sierra 2025 Review: టాటా మోటార్స్‌ నుంచి వచ్చిన కొత్త Sierra 2025, ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ హీట్‌ పెంచింది. రెండు దశాబ్దాల తర్వాత తిరిగి వచ్చిన ఈ కారు, ఈసారి పూర్తి ఆధునిక లైఫ్‌స్టైల్‌ SUVగా రూపుదిద్దుకుంది. బాక్సీ డిజైన్‌తో ఒరిజినల్ Sierra (పాత సియెరా) కి గౌరవం ఇచ్చేలా కనిపించే ఈ కొత్త మోడల్, ఫ్యామిలీ యూజ్‌కి ఎంత ప్రాక్టికల్‌గా ఉంటుంది?. ఇదే విషయాన్ని చాలా సింపుల్‌గా, కుటుంబాలు చూసే కోణంలో తెలుసుకుందాం.

టెక్-లోడెడ్ ఇంటీరియర్ - ఫ్యామిలీలకు నచ్చే సెటప్

కొత్త Sierra లో 3-స్క్రీన్ లేఅవుట్ ప్రధాన ఆకర్షణ. డ్రైవర్‌కు డిజిటల్ క్లస్టర్, మధ్యలో రెండు పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌లు (మొత్తం 3 స్క్రీన్‌లు) ఇచ్చారు. కంటెంట్ షేర్ చేసే ఫీచర్ ఉండటం వల్ల ముందు వైపు ప్రయాణికులకు కూడా ఎక్కువ ఉపయోగకరం.

Curvvలో చూసిన నాలుగు-స్పోక్ స్టీరింగ్ వీల్ ఇక్కడ కూడా ఉంది. మధ్యలో వెలిగే Tata లోగో, టచ్ సెన్సిటివ్ కంట్రోల్స్ ఈ కారు లుక్ & ఫీల్‌ను మరింత ప్రీమియంగా మారుస్తాయి. క్యాబిన్‌కు బ్లాక్-గ్రే థీమ్‌, సీట్లకు డ్యూయల్‌ టోన్ గ్రే/బేజ్ ఫినిష్ ఇవ్వడం వల్ల ఇంటీరియర్ చాలా క్లీన్‌గా, మెచ్యూర్‌గా కనిపిస్తుంది.

రియర్ సీట్ - కుటుంబాలు ఎక్కువగా చూసేది ఇదే

సియెరా రివీల్ ఈవెంట్‌లో అందరూ గమనించింది ఒకే విషయం - కారు లోపలి స్పేస్. ముందు సీటు పొడవైన వ్యక్తి కోసం సెట్ చేశారు, అయినప్పటికీ రియర్ లెగ్‌రూమ్ కూడా బాగానే ఉంది.

సీటు బేస్ వెడల్పుగా ఉంంది

సెంటర్ టన్నెల్ చిన్నగా ఉండటం వల్ల మూడో వ్యక్తి కూడా కంఫర్ట్‌గా కూర్చోవచ్చు

బ్యాక్‌ రెస్ట్ రిక్లైన్ అవుతుంది

రియర్ ఆర్మ్‌రెస్ట్ + కప్ హోల్డర్లు

65W ఫాస్ట్ ఛార్జింగ్ USB

రియర్ విండోలకి రిట్రాక్టబుల్ సన్ బ్లైండ్స్

ఈ పాయింట్లన్నీ చూసినప్పుడు, ఇది క్లియర్‌గా కుటుంబాలకు అనుకూలంగా డిజైన్ చేసిన SUV అని తెలుస్తుంది.

కంఫర్ట్ ఫీచర్లు - ఫ్యామిలీ యూజ్‌లో పెద్ద ప్లస్

కొత్త సియెరాలో చాలా ప్రాక్టికల్ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణ వంటి వేడి ఎక్కువగా ఉండే వాతావరణంలో ఇవి ఉపయోగకరమైనవి.

పనోరామిక్ సన్‌రూఫ్ C-పిల్లర్ వరకు పొడవుగా ఉంటుంది, క్యాబిన్‌ మొత్తం ఎక్కువ వెలుగుతో, విశాలంగా కనిపిస్తుంది

JBL ఆడియో + సబ్‌వూఫర్ (ప్రీమియం వేరియంట్లలో)

పవర్డ్ & వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు

డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్

వైర్‌లెస్ ఛార్జింగ్

360° కెమెరా - పార్కింగ్‌ సమయంలో చాలా హెల్ప్ అవుతుంది

రియర్ సన్‌షేడ్స్

సాఫ్ట్ టచ్ ప్యానెల్స్ & పెద్ద స్టోరేజ్ స్పేస్

ఫ్యామిలీ యూజ్‌కి అత్యంత ముఖ్యమైనవైన సౌలభ్యం, ఎర్గోనామిక్స్, హెల్పింగ్‌ ఫీచర్లు - ఈ మూటిండిపైనా కొత్త Sierra లో స్పష్టంగా ఫోకస్ చేశారు.

సేఫ్టీ - ఫ్యామిలీలకు అన్నింటికంటే ఎక్కువ ఇంపార్టెంట్

కొత్త Sierra Level-2 ADAS సూట్‌తో వచ్చింది.

లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొల్లిజన్ వార్నింగ్ లాంటి ఫీచర్లు దీని లోభాగం.

ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 3-పాయింట్ సీట్‌ బెల్ట్స్, అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్స్ - ప్రతి సీటుకూ ఇచ్చారు, ఇది చాలా మంచి విషయం.

ఒక ఫ్యామిలీ కార్ అంటే ఎలా ఉండాలి?

  • రియర్ స్పేస్ బాగుండాలి
  • రైడ్ కంఫర్ట్ మంచిగా ఉండాలి
  • ఫీచర్లు ఉపయోగకరంగా ఉండాలి
  • సేఫ్టీ పక్కాగా ఉండాలి

Sierra ఈ నాలుగు బాక్సులన్నీ టిక్ చేస్తోంది. Curvvలో ఉన్న రూఫ్‌లైన్ సమస్య ఇక్కడ లేదు. రియర్ హెడ్‌రూమ్, బూట్ స్పేస్ మరింత ప్రాక్టికల్‌గా ఉండేలా డిజైన్ చేశారు. అఫీషియల్ లాంచ్ తర్వాత ధర, హైవే రైడ్ క్వాలిటీ, రియల్ ఫ్యూయల్ ఎఫిషెన్సీ తెలుస్తాయి. అప్పుడు ఇంకా క్లియర్ పిక్చర్ వస్తుంది. ప్రస్తుతం చూసినంత వరకు, కొత్త Sierra ఫ్యామిలీ యూజ్ కోసం చాల బలమైన ఆప్షన్‌గా కనిపిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 vs ట్రయంఫ్ ట్రాకర్ 400.. వేగంలో ఏది కింగ్? రియల్‌ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
పెట్రోల్, డీజిల్‌కు ఇక CNG తోడు.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOలో సన్‌రూఫ్‌తో కొత్త లుక్‌
Mahindra XUV 3XO తో మరింత మైలేజ్‌.. CNG వేరియంట్‌ వచ్చేస్తోంది.. అక్టోబర్ 15న!
పెద్ద చక్రాలు, కొత్త ఇంజిన్‌.. Aprilia SXR GT 125లో ఇంకా ఏం ఉన్నాయో కొనే ముందే తెలుసుకోండి
సూపర్‌ స్టైలిష్‌ స్కూటర్‌ Aprilia SXR GT 125 మీద ఇంట్రెస్ట్‌ ఉందా?, ఈ 5 విషయాలు మీకు తెలుసా?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Embed widget