Heart Touching Story : లైఫ్ ఎంత అన్‌ప్రిడిక్టబుల్ కదా.. కర్నూల్ బస్ యాక్సిడెంట్ మృతుడు దీపక్ స్టోరి బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు ఆ తప్పు చేయకండి
Story of Deepak : లైఫ్ ఎంత అన్‌ప్రిడక్టబుల్ అంటే ఒక్క క్షణంలో జీవితం తలకిందులు అయిపోవచ్చు. దానికి అతిపెద్ద ఉదాహరణే.. Kurnool Bus Fire Accident.ఆ మృతుల్లోని ఓ వ్యక్తి లైఫ్ అనుకోకుండా ఎలా ముగిసిందంటే..

From Proud Son to a Painful Memory : కొందరు పేరెంట్స్ దగ్గర ఉండి చదువుకుంటారు. మరికొందరికి ఎంత లక్ ఉంటుందంటే తల్లిదండ్రుల దగ్గర ఉండే జాబ్ చేసుకునే సౌలభ్యం దొరుకుతుంది. ఎందుకంటే చాలామందికి ఈ లక్ ఉండదు. కొందరు చిన్ననాటి నుంచే చదువు పేరుతో బయటకు వచ్చేయాల్సి వస్తుంది. అలాగే జాబ్ కూడా ఎక్కడో దూరంగా చేయాల్సి వస్తుంది. అలాంటివారిలో దీపక్ కూడా ఒకడు. పేరెంట్స్‌కి దూరంగా ఉంటూ.. ఎన్నో కోరికలతో.. కష్టపడి చదివి.. జాబ్ తెచ్చుకుని సక్సెస్ అయిన ఓ అబ్బాయి లైఫ్ ఎలా ట్రాజెడీగా ముగిసిందంటే..
అన్‌ప్రిడిక్టబుల్ స్టోరీ ఆఫ్ దీపక్
ఒడిశాకు చెందిన ఇంజనీర్ దీపక్. 2022లో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచిన ఈ యువకుడు.. KPMGలో వర్క్ చేస్తున్నాడు. ఎన్నో ఏళ్ల కష్టానికి, కృషికి ఫలితం ఈ జాబ్. దీపక్ చిన్నప్పటి నుంచే.. అంటే స్కూల్లో చదివే రోజుల నుంచి ఉద్యోగం చేసేవరకు పేరెంట్స్‌కి దూరంగా ఉన్నాడు. ఇంటికి దూరంగా ఉన్నా ఎలాంటి చెడు అలవాట్లకు పోకుండా.. చదువుపై శ్రద్ధ పెట్టి ఇంజనీర్ అయ్యాడు. జాబ్ చేస్తూ కుటుంబం గర్వపడేలా చేశాడు.
ఫ్యామిలీని చూసుకోవాల్సిన టైమ్‌లో
హ్యాపీగా సాగిపోతున్న సమయంలో.. పేరెంట్స్‌ని బాగా చూసుకోవాల్సిన రోజుల్లో.. ఎవరో చేసిన తప్పిదం వల్ల ఇప్పుడు అతను లోకాన్ని వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. దీపావళి సమయంలో ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసేందుకు ఇంటికి వచ్చిన దీపక్.. జాబ్ కోసం రిటర్న్ అవుతున్నప్పుడు జరిగిన కర్నూల్ బస్ యాక్సిడెంట్(Kurnool Bus Fire Accident)లో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. చదువు, జాబ్ విషయంలో దూరంగా ఉన్నా.. కొడుకు మళ్లీ వస్తాడనే కోరిక పేరెంట్స్‌లో ఉంటుంది. కానీ ఇక ఎప్పటికీ తిరిగిరాడు అనేది ఆ పేరెంట్స్‌ని మరింత శోకంలోకి నెట్టేసింది.
View this post on Instagram
ఇగ్నోర్ చేయడం అలవాటుగా మారుతున్న రోజులివి
దీపక్ స్టోరి చాలామందికి రిలేటబుల్‌గా ఉంటుంది. ఎందుకంటే వివిధ కారణాల వల్ల చాలామంది ఇంటికి దూరంగా ఉంటారు. కానీ లైఫ్ ఎప్పుడు ఎలా ట్విస్ట్‌లు ఇస్తుందో ఎవరూ ఊహించలేము. కాబట్టి మీకున్న కొంచెం టైమ్‌లో మీవారికి దూరంగా ఉన్నా.. దగ్గరగా ఉండేందుకు ట్రై చేయండి. కొందరు చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటి అంటే.. ఫ్యామిలీ నుంచి లేదా ఫ్రెండ్స్ నుంచి కాల్స్ వస్తే ఇగ్నోర్ చేస్తారు. మళ్లీ ఏదొక పనిలో పడి పూర్తిగా కాల్ చేయడం వదిలేస్తారు. మీరు కూడా అలాంటివారిలో ఒకరు అయితే ఆ అలవాటు మార్చుకోండి.
ఫ్యామిలీ టైమ్‌లో రాజీ వద్దు..
మీకు గానీ.. మీరు ప్రేమించే వ్యక్తులకు గానీ.. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులకు గానీ ఏదైనా జరిగితే తర్వాత ఆ పెయిన్ తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ లైఫ్‌లో బిజీగానే ఉంటారు. కానీ ఫ్యామిలీకి ఇచ్చే సమయంలో రాజీపడకండి. జాబ్ వచ్చాక దీపక్ కూడా పేరెంట్స్‌ని బాగా చూసుకోవాలి.. వారితో టైమ్ స్పెండ్ చేయాలి అనుకుని ఉండొచ్చు. కానీ విధి మాత్రం అతని రాతను మరోలా మార్చింది. కాబట్టి మీ చిన్ని, బుజ్జి లైఫ్‌ని ఎక్కువ కాంప్లికేట్ చేసుకోకుండా.. నచ్చిన వ్యక్తులతో టైమ్ స్పెండ్ చేయండి. లేదా నాలుగు మాటలు మాట్లాడుతూ ఉండండి.






















