మంచి అమ్మాయి, మంచి అబ్బాయి అని అనిపించుకోవాలని అందరికీ ఉంటుంది.

మంచిగా ఉండటం మంచిదే కానీ.. అది కొన్నిసార్లు మీకే చెడు అవుతుంది.

ఎదుటివారి మన్ననల కోసం కాకుండా మీకోసం మీరు బతకడం ప్రారంభించండి.

మీకు వచ్చిన అవకాశాలు ఎదుటివారికోసం వదులుకోకండి.

మీ ఇష్టాలు, అభిరుచులు గుర్తించి వాటిని ఫుల్ ఫిల్ చేసుకోండి.

మీకంటూ కొన్ని లక్ష్యాలు పెట్టుకుని వాటిని సాధించండి.

మీ లోపాలను స్వీకరించి.. ముందుకు సాగండి.

మీ ప్రైవసీకి భంగం లేకుండా ఎదుటివారితో కొన్ని బౌండరీలు సెట్ చేసుకోండి.

మన పని మనం చేసుకోవడం కూడా ఓ మంచి పనే అని గుర్తించండి.