అన్వేషించండి

World Stroke Day : ప్రపంచ స్ట్రోక్ డే.. FAST టెస్ట్ అంటే ఏమిటి? స్ట్రోక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

World Stroke Day : స్ట్రోక్​పై అవగాహన కల్పిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ స్ట్రోక్ డే నిర్వహిస్తున్నారు. స్ట్రోక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో.. ప్రాణాంతకం కాకూడదంటే ఏమి చేయాలో చూసేద్దాం.

Stroke Day 2025 : ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 29వ తేదీన వరల్డ్ స్ట్రోక్​ డే(World Stroke Day) నిర్వహిస్తున్నారు. ప్రజల్లో స్ట్రోక్​ గురించి అవగాహన పెంచడం, తీవ్రతను గుర్తించడం, సమయానికి చికిత్స ఎంత అవసరమో చెప్తూ.. వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ (World Stroke Organization) 2006లో దీనిని ప్రారంభించింది. అసలు స్ట్రోక్ అంటే ఏమిటి? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వస్తే తీసుకోవాల్సిన చికిత్సలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

స్ట్రోక్ (Stroke Meaning)

స్ట్రోక్ అంటే బ్రెయిన్​కు రక్తప్రవాహం ఆగిపోవడం లేదా మెదడులో రక్తస్రావం జరగడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఇలా జరిగినప్పుడు మెదడులోని కణాలు కొన్ని నిమిషాల్లోనే చనిపోవడం మొదలవుతాయి. ఆ సమయంలో శరీరంలో ఒకవైపు పక్షవాతం జరగడం, మాటలు తడబడటం, చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

స్ట్రోక్ రావడానికి కారణాలు ఇవే.. (Causes of Stroke)

కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు స్ట్రోక్ రావడానికి కారణాలు అవుతాయి. వాటిలో అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ ప్రధానంగా ఉన్నాయి. ఒత్తిడి కూడా స్ట్రోక్​కు కారణమవుతుంది. అలాగే ఎక్కువగా పొగ తాగేవారికి కూడా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. మద్యం సేవించడం, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం కూడా స్ట్రోక్ రావడానికి కారణాలు అని చెప్తున్నారు నిపుణులు. 

స్ట్రోక్ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. (Symptoms of Stroke)

స్ట్రోక్ వచ్చినప్పుడు ముఖం ఒకవైపు వంగిపోతుంది. చేతులు లేదా కాళ్లు లేపలేని స్థితి వస్తుంది. మాటలు తడబడతాయి. లేదా పూర్తిగా మాట్లాడలేకపోతారు. తలనొప్పి, మలబద్ధకం, చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

FAST పరీక్ష అంటే..

స్ట్రోక్‌ను ఈజీగా గుర్తించడానికి FAST పద్ధతిని ఉపయోగిస్తారు. అదేంటంటే.. F – Face : ముఖం వంగిపోయిందా లేదా చూడాలి. A – Arm : ఒక చేయి బలహీనమైందా చెక్ చేయడం. S – Speech : మాటలు తడబడటం. T – Time : వెంటనే వైద్యుడిని సంప్రదించడం. ఈ టెస్ట్ ఈజీగా స్ట్రోక్ వచ్చిందో లేదో తెలుపుతుంది కాబట్టి.. వైద్య సహాయం వెంటనే తీసుకోవాలి. 

జాగ్రత్తలు, నివారణ చర్యలు (Precautions & Prevention):

స్ట్రోక్ రాకూడదంటే లైఫ్​స్టైల్​లో కొన్ని మార్పులు చేసుకోవాలి. రోజూ 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఉప్పు, ఫ్యాట్, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు తగ్గించాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే మంచిది. పొగ, మద్యం తాగడం మానేయాలి. రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవాలి. హైడ్రేటెడ్​గా ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. 

స్ట్రోక్ వస్తే పరిస్థితి చాలాసార్లు దారుణంగా మారుతుంది. కానీ సకాలంలో గుర్తిస్తే సమస్య తీవ్రం కాకుండా చూసుకోవచ్చు. అలాగే ప్రాణాలను రక్షించగలుగుతారు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget