అన్వేషించండి

ప్రేయసి ముఖంపై తన పేరును టాటూగా వేసిన ప్రియుడు, ఈ సైకోను ఏం చేయాలి?

తనకు బ్రేకప్ చెప్పిందనే కారణంతో ఓ ప్రియుడు తన ప్రియురాలి ముఖంపై టాటూ వేసి రివేంజ్ తీర్చుకున్నాడు.

సైకోగాడితో పడలేక ఆమె బ్రేకప్ చెప్పింది. దీంతో ప్రతీకారంతో రగిలిపోయిన అతడు.. ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత ఆమె ముఖం మీద బలవంతంగా తన పేరును పచ్చబొట్టుగా పొడిచి.. ‘‘నీకు దిక్కున్న చోటు చెప్పుకో’’ అని వదిలేశాడు. బ్రెజిల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయంగా మారింది. 

బ్రెజిల్‌లోని సావో పాలోకు చెందిన 18 ఏళ్ల తయానే కాల్డాస్ అనే యువతి ఇటీవల పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఆమె మాజీ ప్రియుడు గాబ్రియెల్ కొయెల్హో ఆమెను తన కారులోకి బలవంతంగా ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత ఆమెను ఎక్కి తౌబాటే మున్సిపాలిటీలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అతడు తన పేరును ఆమె ముఖంలో కుడివైపు చెవి నుంచి గడ్డం వరకు పచ్చబొట్టు పొడిచాడు. అలా చేయొద్దని, నొప్పిని భరించలేకపోతున్నా.. అని మొత్తుకున్నా సరే అతడు మాట వినకుండా బలవంతంగా ఆమె ముఖంపై టాటూను పొడిచేశాడు. 

కూతురు కనిపించడం లేదనే కంగారు కాల్డాస్ తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఎట్టకేలకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కోయెల్లో తండ్రి తన కొడుకు చేసిన పనిని సమర్ధించాడు. ఆ టాటు వేయించుకోడానికి కాల్డాస్ సంతోషంగా అంగీకరించిందని పోలీసులకు తెలిపాడు. అతడు అలా చేయడం తనకు అస్సలు నచ్చలేదని, తనపై దాడి చేస్తాడనే కారణంతో.. అతడు ఆ పనిచేస్తున్నప్పుడు మౌనంగా ఉండిపోయానని ఆమె వెల్లడించింది. అయితే, ఈ కేసులో అతడు కొన్నాళ్లు మాత్రమే జైల్లో ఉంటాడని, విడుదలైన తర్వాత మళ్లీ ఏం చేస్తాడనే భయం తనని వెంటాడుతోందని తెలిపింది. 

Also Read: నా భార్య రోజూ మ్యాగీ పెట్టి చంపేస్తోంది - కోర్టుకు భర్త మొర, చివరికి..

కాల్డాస్ పరిస్థితి తెలిసి.. ఇప్పుడు కొన్ని టాటూ సంస్థలు ఆమె ముఖం మీద ఉన్న టాటూను తొలగించేందుకు ముందుకొచ్చాయి. ఇటీవలే ఆమె లేజర్ రిమూవల్ సెషన్‌లో పాల్గొంది. అలాగే, తన ప్రియుడి పేరుతో ఉన్న మరో మరో రెండు టాటూలను కూడా తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. కోయెల్హో టాటూ ఆర్టిస్ట్. కాల్డాస్, కోయెల్హో‌లు 2019 నుంచి డేటింగ్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య స్పర్థలు రావడంతో ఎనిమిది నెలల కిందట విడిపోయారు. దీంతో అతడు ఆమెపై ఇలా రివేంజ్ తీర్చుకున్నాడు. భవిష్యత్తులో ఆమె ముఖం మరెవ్వరూ చూడకూడదనే కోపంతో టాటూను చేక్కేశాడు. ఇలాంటి సైకోగాళ్లకు ఎలాంటి శిక్ష వేస్తే బుద్ధి వస్తుందో మీరే చెప్పండి. 

Also Read: జ్వరం, నొప్పులకు ఈ మాత్ర వాడుతున్నారా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget