(Source: ECI/ABP News/ABP Majha)
Body Massage: వారానికోసారి బాడీ మసాజ్ చేయించుకుంటే ఈ సమస్యలన్నీ మాయం
విదేశాలతో పోలిస్తే మన దేశంలో బాడీ మసాజ్‌కు ఆదరణ తక్కువే.
మనదేశంలో బాడీ మసాజ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటికి వెళ్లే వారి సంఖ్య తక్కువే. కేవలం ధనవంతులు మాత్రమే బాడీ మసాజ్ సెంటర్లకు వెళుతూ ఉంటారు. బాడీ మసాజ్ అంత అవసరం లేదని అనుకుంటూ ఉంటారు చాలామంది. నిజానికి బాడీ మసాజ్ మన శరీరానికి చాలా అవసరం. ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలను కట్టడి చేస్తుంది. వారానికి ఒక్కసారి బాడీ మసాజ్ చేయించుకున్నా చాలు, ఎన్నో శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
ఒత్తిడి
మసాజ్ చేయడం వల్ల శరీరంలోని కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. ఈ కార్టిసోల్ హార్మోన్ వల్లే ఒత్తిడి అధికంగా అనిపిస్తుంది. మనకి ఏదైనా ఒత్తిడిగా అనిపించింది అంటే శరీరంలో కార్టిసోల్ హార్మోన్ ఉత్పత్తి అవుతోందని అర్థం. ఈ హార్మోన్స్ స్థాయిలను తగ్గించడం ద్వారా ఒత్తిడి, మానసిక ఆందోళనలను అదుపులో ఉంచవచ్చు. ఫలితంగా మనసు శరీరం, రిలాక్స్ గా ఉంటాయి.
కండరాల నొప్పి
బాడీ మసాజ్ చేయడం వల్ల శరీరం మొత్తం రక్తప్రసరణ సవ్యంగా జరుగుతుంది. శరీరానికి ఆనందాన్,ని ప్రశాంతతను అందించే ఎండార్ఫిన్ హార్మోను విడుదల చేయడానికి బాడీ మసాజ్ సహకరిస్తుంది. దీనివల్ల కండరాల ఒత్తిడి, నొప్పి తగ్గుతాయి. ఇది శారీరక ఆరోగ్యానికి మంచిది.
నిద్ర కోసం
నిద్రపోయే ముందు మసాజ్ చేయించుకుంటే ఎంతో ప్రశాంతంగా నిద్ర పడుతుంది. బాడీ మసాజ్ చేయించుకున్న వారికి నిద్ర నాణ్యత ఎక్కువ. శరీరం, మనసు రెండూ ప్రశాంతంగా ఉంటాయి. కనుక నిద్ర కూడా సంపూర్ణంగా పడుతుంది. ఆందోళన, ఒత్తిడి లాంటివి ఉండవు.
రోగనిరోధక శక్తికి
బాడీ మసాజ్ చేయడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇవి ఒత్తిడి హార్మోన్ ను తగ్గించడమే కాదు తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతాయి. తెల్ల రక్త కణాల సంఖ్య పెరగడం వల్ల మన రోగనిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుంది. తక్కువ అనారోగ్యాలకి గురవుతారు. అందుకే వారానికి ఒకసారైనా కచ్చితంగా మసాజ్ చేయించుకోవాలి.
అలసట తగ్గి...
బాడీ మసాజ్‌లు వారానికి రెండు లేదా మూడుసార్లు చేయించుకుంటే మానసికంగా అలసట తగ్గుతుంది. మెదడుకు రక్త ప్రవాహం పెరుగుతుంది. దీనివల్ల ఆలోచనల్లో, నిర్ణయాల్లో స్పష్టత పెరుగుతుంది. దృష్టి మెరుగుపడుతుంది. ఉత్పాదకత, సృజనాత్మకత లాంటివి పెరుగుతాయి.
ఆపరేషన్ చేయించుకున్నాక శరీరం మొత్తం మళ్లీ సవ్యంగా రక్తప్రసరణ చేయడానికి బాడీ మసాజ్ ఉపయోగపడుతుంది. గాయాల వల్ల కలిగే నొప్పి నుంచి ఈ మసాజ్ ఉపశమనం లభిస్తుంది.
Also read: డయాబెటిస్ ఉన్నవారు పరగడుపున ఖాళీ పొట్టతో తినాల్సిన ఫుడ్స్ ఇవే
Also read: వేసవిలో జ్వరాన్ని తట్టుకునే శక్తి కావాలంటే అప్పుడప్పుడు చెరుకు రసం తాగాల్సిందే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.