అన్వేషించండి

Diabetes: డయాబెటిస్ ఉన్నవారు పరగడుపున ఖాళీ పొట్టతో తినాల్సిన ఫుడ్స్ ఇవే

డయాబెటిస్ ఉన్నవారు ఆహార పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వారి కోసం కొన్ని సూపర్ ఫుడ్స్ ఇవిగో

రోజంతా శరీరం ఉత్తేజంగా పని చేయాలంటే  పరగడుపున తినే ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు అల్పాహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. వారు పొట్ట నిండడమే కాదు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో నెమ్మదిగా విడుదల చేసే ఆహారాలను ఎంపిక చేసుకోవాలి. అల్పాహారంలో షుగర్ స్థాయిలను అధికంగా చేసే ఫుడ్ ను తింటే రోజంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మధుమేహం ఉన్నవారు ఉదయానే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అధికంగా కలిగి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మన కాలేయం అదనపు గ్లూకోజ్‌ని ఉత్పత్తి చేస్తుంది. మీకు దాహంగా అనిపించినా, అతిగా మూత్ర విసర్జన చేసినా, ఉదయాన్నే చూపు మందగించినట్టు అనిపించినా... మీ రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నట్టు లెక్క. కాబట్టి ఆహార పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పరగడుపునే తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే. 

1. ఉదయాన పరగడుపున ఒక స్పూను ఆవు నెయ్యిలో చిటికెడు పసుపు పొడి కలుపుకొని తినేయాలి. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా రోజంతా కాపాడడంలో ముందుంటుంది. అలాగే తీపి పదార్థాలు తినాలన్న కోరికలను కూడా నియంత్రిస్తుంది. నెయ్యి పొట్ట నిండిన భావనను పెంచితే, పసుపు శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.

2. ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సిడర్ వెనిగర్ తాగిన మంచిదే. లేదా ఒక స్పూన్ ఉసిరి రసం తాగిన ఉత్తమమే. ఇది లేకుంటే గ్లాసు నీటిలో నిమ్మరసం కలిపి పరగడుపున తాగేయండి. ఈ ద్రావకాలు శరీరంపై ఆల్కలైజింగ్ ప్రభావాన్ని చూపిస్తాయి. శరీరాన్ని ఆల్కలీన్‌గా ఉంచడానికి ఈ ద్రవ పదార్థాలను ఎంచుకోవచ్చు. 

3. దాల్చిన చెక్క వల్ల మధుమేహలుకు ఎంతో ఉపయోగం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే ఒక మసాలా. రోజంతా రక్తంలో చక్కెర స్థాయిలు నిర్వహించడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. దాల్చిన చెక్కతో టీ చేసుకుని తాగితే మంచిది.

4. మెంతి నీరు మధుమేహలకు నిజంగానే సూపర్ ఫుడ్. దీన్ని తీసుకోవడం వల్ల శరీరం కార్బోహైడ్రేట్లను శోషించుకోకుండా కాపాడుతుంది. ఒక టీ స్పూన్ మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయం లేచాక ఆ నీటిని తాగేయాలి. ఆ గింజలను కూడా నమిలి మింగేయాలి. ఇలా నెల రోజులు చేస్తే చాలు పూర్తిగా అదుపులోకి వచ్చేస్తుంది.

5. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితేనే కాదు తగ్గితే కూడా సమస్యే. అలా తగ్గకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇందుకోసం ప్రోటీన్ నిండిన ఆహారాన్ని పరగడుపున తినాలి. రాత్రి నానబెట్టిన బాదం పప్పును, ఉదయం తినాలి. వీటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఉదయం పూట ఖాళీ పొట్టతో టీ లేదా కాఫీ తినడం మంచిది కాదు.

Also read: వేసవిలో జ్వరాన్ని తట్టుకునే శక్తి కావాలంటే అప్పుడప్పుడు చెరుకు రసం తాగాల్సిందే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Embed widget