అన్వేషించండి

Sugarcane Juice: వేసవిలో జ్వరాన్ని తట్టుకునే శక్తి కావాలంటే అప్పుడప్పుడు చెరుకు రసం తాగాల్సిందే

చెరుకు రసం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వేసవిలో చెరుకు రసాన్ని కచ్చితంగా తాగాలి.

వేసవికాలం దగ్గర పడిదంటే దాహం పెరిగిపోతుంది. అందరూ కొబ్బరి నీళ్ళు, పండ్ల రసాలు తాగడానికే మక్కువ చూపిస్తారు. కానీ ఒక గ్లాసు చల్లని చెరుకు రసం తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎండలో బాగా తిరిగి వచ్చాక ఒక గ్లాసు చల్లని చెరుకు రసం తాగి చూడండి, నిమిషాల్లో శరీరం తేరుకుంటుంది. డిహైడ్రేషన్ బారిన పడకుండా తట్టుకునే శక్తి దానికి వస్తుంది. చెరుకు రసంలో ఫైబర్, ప్రోటీన్,  విటమిన్ బి6, విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే చెరుకు రసాన్ని పవర్ హౌస్ అని చెప్పుకోవచ్చు. మన శరీరం కోల్పోయిన చక్కెరను తిరిగి అందించడం ద్వారా డిహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది ఈ జ్యూస్. అంతే కాదు చెరుకు రసం తాగడం వల్ల మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన చెరుకు రసం కాలేయాన్ని పలు రకాల ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. బిల్‌రూబిన్ స్థాయిలను అదుపులో ఉంచి కాలేయానికి రక్షణ కల్పిస్తుంది. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవడానికి అవసరమైన ప్రోటీన్లను, పోషకాలను ఇది భర్తీ చేస్తుంది. ఎండలో బాగా తిరిగాక వడదెబ్బ కొడితే జ్వరం రావడం సహజం. ఆ జ్వరంతో పోరాడే శక్తిని చెరుకు రసం ఇస్తుంది. కాబట్టి వారానికి రెండు మూడు సార్లు అయినా చెరుకు రసాన్ని తాగడం అలవాటు చేసుకోండి.

1. చెరుకు రసం తాగాక మూత్ర విసర్జన ఎక్కువసార్లు అవుతుంది. ఆ మూత్ర విసర్జన ద్వారా శరీరంలోని టాక్సిన్లు, ఇన్ఫెక్షన్లకు కారణమైన వైరస్‌లు బయటికి పోతాయి. అంతేకాదు చెరుకు రసం తాగడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది. 

2. చెరుకు రసం తాగడం వల్ల జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. పొట్ట ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. మలబద్ధకం సమస్యకు చికిత్స చేస్తుంది.

3. జ్వరం వచ్చినప్పుడు వచ్చే ఇతర సమస్యల నుంచి చెరుకు రసం కాపాడుతుంది. పిల్లల్లో జ్వరం వచ్చినప్పుడు మూర్ఛ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఆ సమయంలో చెరుకు రసం తాగితే మూర్చ రాకుండా ఇది అడ్డుకుంటుంది. జ్వరం వచ్చినప్పుడు ప్రోటీన్లు నశిస్తాయి.  వాటిని తిరిగి నింపడంలో చెరుకు రసం సహాయపడుతుంది. 

4. ఈ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. 

5. వేసవిలో చాలామంది బలహీనంగా మారుతారు. కాబట్టి కచ్చితంగా చెరుకు రసం తాగాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటివి జీర్ణ రుగ్మతలు, కాలేయ వ్యాధులు, శ్వాస కోశ ఇన్ఫెక్షన్లు రాకుండా సహాయపడతాయి.

6. ఈ రసంలో కాల్షియం, మెగ్నీషియం, భాస్కరం, ఇనుము, పొటాషియం వంటివి ఉన్నాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ఆస్టియోపొరాసిస్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. వైద్యులు కూడా ఒక గ్లాసు చెరుకు రసం తాగాలని సిఫారసు చేస్తున్నారు. 

Also read: వెల్లుల్లిని మీ వంటగది గార్డెన్లో సులువుగా ఇలా పెంచేయండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget