Pregnancy Tips : ప్రెగ్నెన్సీకోసం ట్రై చేస్తోన్నవారు కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్.. గైనకాలజిస్ట్ ఇస్తోన్న టిప్స్ ఇవే
Pregnancy Tips in Telugu : ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేవారు ప్రోటీన్ తీసుకుంటే చాలామంచిదని చెప్తున్నారు నిపుణులు. ముఖ్యంగా వెజిటేరియన్స్ మంచి ప్రోటీన్ కోసం ఏ ఫుడ్స్ తీసుకుంటే మంచిదో చూసేద్దాం.

Foods to Support Conception : తల్లికావాలని ప్రయత్నిస్తోన్న మహిళలు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తుంటే ముందు నుంచే ఆహారంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వారి ప్రెగ్నెన్సీ ట్రయల్స్‌లో భాగంగా ప్రోటీన్‌ను తీసుకుంటే మంచిదని చెప్తున్నారు నిపుణులు. మొక్కల ఆధారిత ప్రోటీన్ అయితే ప్రెగ్నెన్సీ అవకాశాలను మెరుగుపరుస్తుందని చెప్తున్నారు. వెజిటేరియన్సే కాదు.. ప్రోటీన్ కోసం నాన్ వెజిటేరియన్స్ కూడా తినగలిగే హెల్తీ ప్రోటీన్ సోర్స్‌లు ఏంటో.. వాటి వల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.
గర్భధారణకు ప్రయత్నిస్తున్న వారికి ప్రోటీన్ ఉత్తమ వనరని తెలిపారు గైనకాలజిస్ట్ డాక్టర్ సంతోషి. "Consuming enough protein as a vegetarian isn’t that difficult. Plant protein is considered to be the best source of protein for people who are trying to conceive. Some of the best sources of vegetarian protein" అంటూ టాప్ 5 ప్రోటీన్ ఫుడ్స్‌ని సూచించడంతో పాటు వాటి వల్ల కలిగే లాభాలు తెలిపారు.
ఓట్స్
చాలామంది తమ డైలీ రొటీన్లో ఇడ్లీ, దోశలు ఎక్కువగా తింటారు. మీరు కూడా అలాంటివారిలో ఒకరు అయితే కచ్చితంగా మీరు వాటికి బదులుగా ఓట్స్ తీసుకోండి. వీటిలో 8 నుంచి 12 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీనిలో కార్బోహైడ్రేట్లు కడుపు నిండుగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. కాబట్టి గట్ హెల్త్‌కి మంచిది.
పప్పులు
చిక్కుళ్లు, పప్పులు ప్రోటీన్‌కు మంచి సోర్స్. కాబట్టి వీటిని రోజులో కనీసం ఓ పూట అయినా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఇది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కనీసం రోజుకు 100 గ్రాముల ప్రోటీన్ లేదా చిక్కుళ్లు తీసుకుంటే శరీరానికి 12 నుంచి 15 గ్రాముల ప్రోటీన్ అందుతుంది.
నట్స్, సీడ్స్
రోజూ గుప్పెడు నట్స్, సీడ్స్ కలిపి తీసుకుంటే కూడా శరీరానికి మంచి ప్రోటీన్ అందుతుంది. పిల్లల కోసం ట్రై చేసేవారు కచ్చితంగా తినాల్సిన హెల్తీ ఫుడ్ ఇది. 100 గ్రాముల బాదం పప్పులో 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. రోజూ అంత తినలేము కాబట్టి.. వాటిని మీరు వివిధ నట్స్, సీడ్స్‌తో మిక్స్ చేసుకుని తినొచ్చు. దీనివల్ల శరీరానికి మంచి పోషణ అందుతుంది.
సోయా
వెజిటేరియన్స్‌కి సోయా, టోపు, మిల్మేకర్ వంటివి ప్రోటీన్‌కి చాలా బెస్ట్ ఆప్షన్. వీటిని నాన్వెజ్టేరియన్స్ కూడా తీసుకోవచ్చు. రోజులో ఏదో పూట వీటిని తీసుకోవడం వల్ల 15 నుంచి 20 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. మిల్మేకర్లో అయితే ఇంకా ఎక్కువే అందుతుంది.
క్వినోవా
మీరు ప్రోటీన్ కోసం రైస్‌కి బదులుగా క్వినోవా తీసుకోవచ్చు. దీనివల్ల అదనపు ప్రోటీన్ శరీరానికి అందుతుంది. ప్రోటీన్ కాస్త తక్కువగా ఉన్నప్పటికీ.. ఇది మరెన్నో ప్రయోజనాలు అందిస్తుంది. నెమ్మదిగా జీర్ణమవుతుంది. శరీరంలో చక్కెరలను బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది.
వీటితో పాటు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేవారు ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చని తెలిపారు. అయితే నిపుణులు సూచించినప్పుడే వీటిని తీసుకుంటే మంచిదని చెప్తున్నారు. అలాగే నాన్వెజిటేరియన్స్ కూడా ప్రోటీన్ కోసం ఈ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ సోర్స్ తమ డైట్లో తీసుకోవచ్చని చెప్తున్నారు. ఇది సంతానోత్పత్తి సమస్యల్ని దూరం చేసి.. ప్రెగ్నెన్సీ పొందడంలో హెల్ప్ చేస్తుందని వివరించారు సంతోషి.






















