అన్వేషించండి

GI tag for Paan: ప్రఖ్యాత GI ట్యాగ్ పొందిన బనారసి పాన్, కాశీ వెళ్లినవారు కచ్చితంగా తినాల్సిన కిళ్లీ ఇది

వారణాసిలో దొరికే ప్రఖ్యాత బనారసీ పాన్ రుచి అదిరిపోతుంది. ఇది తాజాగా GI ట్యాగ్ పొందింది.

కాశీనే వారణాసి అని వారణాసిని బనారస్ అని ఎంతోమంది పిలుచుకుంటారు. ఉత్తర భారత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఇది ప్రముఖ నగరం. గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ఇది ప్రసిద్ధి. అలాగే ఆహారపరంగానూ వారణాసి ఎంతో స్పెషల్. ఇక్కడ దొరికే కొన్ని రకాల ఆహారాలు చాలా ప్రత్యేకమైనవి. చాట్, కచోరి, లస్సి ఈ నగరానికే పేరు తెచ్చాయి. ఇప్పుడు ‘బనారసి పాన్’ కూడా ఈ జాబితాలో చేరింది. ఈ బనారసి పాన్ గురించి  బాలీవుడ్ పాటల్లోనే కాదు ప్రసిద్ధ నవలల్లో కూడా వినిపిస్తూ ఉంటుంది. ఎట్టకేలకు ఈ పాన్ GI ట్యాగ్ సాధించింది. ఈ ప్రఖ్యాత కిళ్లీతో పాటూ ఇప్పటివరకు కాశీ నుంచి 22 ఉత్పత్తులు ఈ ట్యాగ్‌ను పొందాయి. అందులో ముఖ్యమైనవి బనారసి లాంగ్డా మామిడి, రాంనగర్ భంట్ అనే వంకాయ, ఆడమ్చిని అనే బియ్యం రకం. ఇప్పుడు బనారసి పాన్ ఈ ట్యాగ్ సాధించి వారణాసి పేరును మరింత పెంచింది. 

ఏంటీ GI ట్యాగ్?
GI అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్. ఇది ఉత్పత్తులకు ఇచ్చే ప్రఖ్యాతమైన సర్టిఫికెట్. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికి సంబంధించిన ఉత్పత్తులకు ఈ GI ట్యాగ్ అందిస్తారు. ఇది రావడం కష్టతరం.  భారతదేశంలోని చెన్నైలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ ఆఫీసు ఉంది.  ఈ ఆఫీసు వారే ఈ ట్యాగ్‌ను మంజూరు చేస్తుంది.ఈ ట్యాగ్ అందుకున్నాక వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద పేటెంట్స్, ట్రేడ్ మార్కులు వంటివి వస్తాయి. వ్యవసాయ ఉత్పత్తులు, హస్తకళలు, పారిశ్రామిక ఉత్పత్తులు, వంటకాలు... ఇలా రకరకాల ఉత్పత్తులకు GI ట్యాగ్ అందిస్తారు. ఈ ట్యాగ్  రావడం వల్ల ఆ ఉత్పత్తికి ప్రత్యేక గుర్తింపుతో పాటు విలువ కూడా పెరుగుతుంది. 

బనారసి పాన్ ఎలా ఉంటుంది?
ఈ బనారసి పాన్ చాలా ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇందులో ముఖ్యమైన పదార్థం పాన్ పట్టా. ఇది తమలపాకులో ఒక రకమైనది. ఆ తమలపాకుల్లో సుపారి, గుల్కండ్, సోంపు, కేసర్ చట్నీ, చునా, కొబ్బరి, టూటీ ఫ్రూటీ, ఇలాచి, జైఫాల్ పౌడర్ వంటివన్నీ కలిపి చుట్టి ఇస్తారు.  దీన్ని తింటే రుచి అదిరిపోతుంది. వారణాసి వెళ్లినవారు కచ్చితంగా ఈ పాన్‌ను రుచి చూసే వస్తారు. 

భారతదేశంలో GI ట్యాగ్ పొందిన ఎన్నో ప్రత్యేక ప్రసిద్ధ ఆహారాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన డార్జిలింగ్ టీ, కొంకణ ప్రాంతానికి చెందిన ఆల్ఫోన్సో మామిడి, మహారాష్ట్రాకు చెందిన నాగ్‌పూర్ ఆరెంజ్, ఇండో గాంగటెక్ ప్రాంతానికి చెందిన బాస్మతి రైస్, కర్ణాటకకు చెందిన కూర్గ్ అరబికా కాఫీ, కర్ణాటకు చెందిన మైసూర్ పాక్, ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఆగ్రా పీఠ్, కేరళ నుంచి మలబార్ మిరియాలు, తిరుపతి లడ్డూ, రాజస్థాన్లోని బికనీర్ భుజియా, మణిపూర్ నుంచి బ్లాక్ రైస్.... ఇలా ఎన్నో ఆహారాలు ఇప్పటివరకు GI ట్యాగ్ పొందాయి. 

Also read: ఇంట్లోని బియ్యం మూటలో త్వరగా పురుగులు పట్టేస్తున్నాయా? ఈ చిట్కాలు పాటిస్తే పురుగులు చేరవు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
Embed widget