అన్వేషించండి

ఇంట్లోని బియ్యం మూటలో త్వరగా పురుగులు పట్టేస్తున్నాయా? ఈ చిట్కాలు పాటిస్తే పురుగులు చేరవు

బియ్యానికి పురుగులు పట్టడం అనేది ప్రతి ఇంట్లో జరిగేదే. వాటిని ఎలా వదిలించుకోవాలో, బియ్యం పురుగులు పట్టకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

బియ్యం, పప్పులు ఎక్కువ కాలం పాటు ఇంట్లోనే ఉంటే వాటికి పురుగులు పట్టేస్తాయి. బియ్యానికి మాత్రం చాలా తక్కువ సమయంలోనే పురుగులు పట్టే అవకాశం ఉంది. వాటిని పదేపదే శుభ్రం చేసుకోవడం కూడా కష్టమే. అసలు వాటికి పురుగులే పట్టకుండా చూసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు కదా. బియ్యం లేదా పప్పులు కొని తెచ్చాక చిన్న చిట్కాలు పాటించడం ద్వారా వాటికి పురుగులు పట్టకుండా కాపాడుకోవచ్చు. 

పురుగులు ఎందుకు పడతాయి?
అసలు బియ్యానికి ఎందుకంత త్వరగా పురుగులు పడతాయి? అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ పురుగులు నివసించడానికి అనువైన వాతావరణం ఉంటే చాలు బియ్యంలో కాపురం మొదలుపెట్టేస్తాయి. పిల్లలు పెట్టి సంతతి పెంచేస్తాయి. పంటలు కోసి ఆహార ప్రాసెసింగ్ కేంద్రానికి తీసుకెళ్లేటప్పుడు వాటిలో కొన్ని పురుగులు ఉండే అవకాశం ఉంది. ప్రాసెసింగ్ అంతా అయ్యాక బియ్యాన్ని మూటల్లో కట్టి అమ్మేస్తారు. ఆ మూటలో ఒక్క పురుగు ఉన్న చాలు, అనువైన వాతావరణం రాగానే తమ జనాభాను పెంచే పనిలో ఉంటాయి. అలా బియ్యానికి పురుగులు అధికంగా పట్టేస్తాయి. అలాగే తడి తగిలినా బియ్యానికి పురుగు పట్టే అవకాశం ఉంది. అందుకే గాలి చొరబడని, తడి తగలని కంటైనర్లలో బియ్యాన్ని నిల్వ ఉంచుకోమని చెబుతారు. బియ్యంలో కొన్ని రకాల పదార్థాలు కలపడం ద్వారా పురుగులను నివారించవచ్చు. 

బిర్యానీ ఆకులు
బియ్యానికి పట్టిన పురుగులను వదిలించుకోవడానికి ఇది ఉత్తమ మార్గం.  మీరు చేయాల్సిందల్లా బియ్యం కంటైనర్లో ఆరేడు బిర్యానీ ఆకులను ఉంచండి. బియ్యం ఎక్కువ మొత్తంలో ఉంటే ఎక్కువ బిర్యానీ ఆకులను కలపండి. గాలి చొరబడకుండా బియ్యం మూటను కట్టేయండి. 

లవంగాలు 
బలమైన సువాసన గల ఈ సుగంధ ద్రవ్యాలు బియ్యానికి పురుగులు పట్టకుండా అడ్డుకుంటాయి. వంట గదిలో సూక్ష్మక్రిములు లేకుండా నివారించడంలో లవంగాలు ముందుంటాయి. లవంగం నూనెను స్ప్రే చేసినా కూడా పురుగులు పట్టవు.

వెల్లుల్లి 
ప్రతి ఇంట్లో లభించే అత్యద్భుతమైన పదార్థం వెల్లుల్లి. దీన్ని పొట్టు తీశాక బియ్యంలో కలిపేయాలి. అలా బియ్యం వాడినంత కాలం వాటిని అలానే ఉంచుకోవచ్చు. పురుగులు వెల్లుల్లి ఉన్నచోట ఆ ఘాటుకు ఉండలేవు.

ఎక్కువగా పురుగులు పడితే బియ్యాన్ని సూర్య కాంతిలో ఎండబెట్టాలి. అలా అని మరీ ఎర్రటి ఎండలో ఎండబెడితే, గింజలు విరిగిపోయి నూకల్లా తయారవుతాయి. కాబట్టి సూర్యకాంతి తగిలేటట్టు ఒక షీట్ మీద విస్తరించి ఎండబెట్టండి. పురుగులన్నీ పోయాక గాలి చొరబడని కంటైనర్లో వేసి ప్యాక్ చేయండి. ప్రతి రెండు నెలలకు ఒకసారి బియ్యం, ఇతర ధాన్యాలు, పప్పులు ఇలా ఎండలో ఉంచడం మంచిది. 

అగ్గిపెట్టెతో కూడా పురుగులను అడ్డుకోవచ్చు. ఇది మీకు వింతగా అనిపిస్తున్నా నిజమే. ఎందుకంటే అగ్గిపెట్టెల్లో సల్ఫర్ ఉంటుంది. బియ్యం మూటలో అగ్గిపెట్టెలను తెరిచి ఉంచండి. ఆ చుట్టుపక్కల ఎక్కడా పురుగులు కనిపించవు. అలాగే నల్ల మిరియాలు చల్లడం ద్వారా పురుగులు పట్టకుండా చూసుకోవచ్చు. బియ్యంలో అల్లం ముక్క, పసుపును కలపడం ద్వారా పురుగులను పారద్రోలవచ్చు.

Also read: నా భార్య అతి ప్రేమను, అతి జాగ్రత్తను భరించలేకపోతున్నాను, అది ప్రేమా? అనుమానమా?

టాప్ హెడ్ లైన్స్

Dengue Vaccine India: డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!
డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Womens Health: మహిళలు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఎందుకు మానకూడదు? డాక్టర్లు చెప్పిన 5 సమస్యలు ఇవే
మహిళలు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఎందుకు మానకూడదు? డాక్టర్లు చెప్పిన 5 సమస్యలు ఇవే
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
Embed widget