Baby Shark Song : ప్రపంచ జనాభా 780 కోట్లు.. కానీ ఆ వీడియోలు 1000 కోట్ల మంది చూశారు ! అవాక్కయ్యారా ?
చిన్న పిల్లల రైమ్ .. "బేబీ షార్క్ .. డూ ..డూ" వీడియో యూట్యూబ్‌లో వెయ్యి కోట్లకుపైగా వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది.
మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే.. వారికి టీవీ లేదా ఫోన్‌లో రైమ్స్ పెట్టి కాసేపు సైలెంట్ చేద్దామనే ప్లా అమలు చేసే ఉంటారు. ఇలా రైమ్స్ పెట్టినప్పుడు వారికి ఎన్నో సార్లు బేబీ షార్క్ సాంగ్ చూపించి ఉంటారు. మీరు కూడా చూసి ఉంటారు. ఈ అనుభవం మీదే కాదు.. పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరిది. ఎందుకంటే.. ఆ బేబీ షార్క్ సాంగ్‌కు ఇప్పటికి వెయ్యి కోట్ల వ్యూస్ వచ్చాయి. ప్రపంచ జనాభా 780 కోట్లు మాత్రమే. కానీ ఆ వీడియోకు వెయ్యి కోట్ల వ్యూస్ రావడం సంచనాత్మకం అయింది.
https://www.youtube.com/watch?v=XqZsoesa55w
Also Read: సరసాలతో సంపాదన.. అమ్మాయిలతో ‘పులిహోర’ కలపడమే ఇతడి ఉద్యోగం
దక్షిణకొరియాకు చెందిన 'పింక్ ఫాంగ్' యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేశారు. 'బేబీ షార్క్ డూ.. డూ..డూ' అంటూ చిన్నపిల్లలు మ్యూజిక్ కు తగ్గట్లుగా డాన్స్ చేస్తారు. బేబీ షార్క్ పాటను 2015లో కొరియన్ - అమెరికన్ సింగర్ హోప్ సెగోయిన్ పాడగా... ఈ వీడియోను 2016 జూన్‌లో అప్‌లోడ్ చేశారు. 2016 నుంచి 2020 నవంబర్ నాటికి ఈ వీడియో 700 కోట్ల వ్యూస్‌ని సాధించింది. తాజాగా ఈ వీడియో వెయ్యికోట్ల వ్యూస్ మైలురాయిని సాధించింది.
Also Read: కౌగిలించుకుంటే ఇన్ని ప్రయోజనాలా? ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు.. ఇక చెలరేగిపోతారు
పింక్‌ఫాంగ్...దక్షిణ కొరియాలో ఎడ్యుకేషన్ అండ్ రైమ్స్ క్రియేట్ చేసే కంపెనీ . ప్రపంచ జనాభానే దాదాపు 7.8 బిలియన్ కి అటుగా ఉంటే.. 10 బిలియన్ వ్యూస్ ఎలాగబ్బా అని అనుమానం రావొచ్చు. యూట్యూబ్ ఆల్గారిథం ప్రకారం.. అదనంగా ఆ 2 బిలియన్ వ్యూస్ జత అయ్యాయని భావిస్తున్నారు. ఈ బేబీ షార్క్ పాటకు ఎన్నో పేరడీలు వచ్చాయి. బేబీ షార్క్ పేరుతో చాలా వీడియోలు ఇప్పుడు యూ ట్యూబ్‌లో ఉన్నాయి.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి