Shravan Masam: శ్రావణ మాసంలో ఈ ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకండి
హిందూ సంప్రదాయం ప్రకారం శ్రావణ మాసం చాలా పవిత్రంగా భావిస్తారు. అందుకే శ్రావణ మాసంలో మాంసాహారానికి దూరంగా ఉంటారు. జులై, ఆగస్ట్ మధ్యలో ఈ మాసం ప్రారంభమవుతుంది.
ఆషాఢమాసం ముగిసిపోయి శ్రావణమాసం రాబోతుంది. హిందూ సంప్రదాయం ప్రకారం శ్రావణ మాసం చాలా పవిత్రంగా భావిస్తారు. అందుకే శ్రావణ మాసంలో మాంసాహారానికి దూరంగా ఉంటారు. జులై, ఆగస్ట్ మధ్యలో ఈ మాసం ప్రారంభమవుతుంది. వివాహాది శుభకార్యాలకి ఇది చాలా మంచిది. అందుకే చాలా మంది శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ప్రతి శుక్రువారం భక్తి శ్రద్దలతో పూజ కార్యక్రమాలు చేసి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. ఎంతో నియమ నిష్టాలతో ఉపవాసం ఉండి దేవుడికి పూజలు చేస్తారు. శివుడికి ఎంతో ప్రీతికరమైన మాసంగా దీన్ని చెప్పుకుంటారు. అందుకే ఉపవాసం చేసే వాళ్ళు తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటిస్తారు. ఉపవాసం ఉండటం ఎందుకని చాలామంది అంటారు కానీ వైద్య పరంగా కూడా ఒక రోజు ఉపవాసం ఉండటం శరీరానికి చాలామంచిదని అంటారు. అయితే ఈ మాసంలో ఉపవాసం ఉండే వాళ్ళు తప్పని సరిగా కొన్ని పదార్థాలకి దూరంగా ఉండాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
గ్రీన్, ఆకు కూరలు
ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను, ప్రోటీన్స్ అందిస్తుంది. కానీ శ్రావణ మాసంలో వీటిని తినకపోవడమే మంచిది. వీటి వల్ల పిత్తాశయంలో పిత్తరసలను అధికంగా స్రవించే గుణాలను కలిగి ఉంటాయి. అందుకే ఆకు కూరలని కొన్ని రోజుల పాటు దూరంగా ఉంచాలి.
చికెన్, మటన్, చేపలు
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మాసం ఇది. అందుకే ఈ మాసంలో అందరూ మాంసాహారానికి దూరంగా ఉంటారు. నెల రోజుల పాటు చిక్కే, మటన్, చేపలు వంటి నీసు పదార్థాలను తినరు. వర్షాకాలం సంతానోత్పత్తి కాలం అంటారు. ఈ సమయంలో నాన్ వెజ్ తినడం ఆరోగ్యానికి హానికరం అని నమ్ముతారు. అందుకే దాన్ని పూర్తిగా పక్కనపెట్టేస్తారు.
వంకాయ
హిందూ సంప్రదాయం ప్రకారం వంకాయ స్వచ్చమైన, పవిత్రమైన ఆహారంగా పరిగణించరు. వర్షాకాలంలో ఇది చాలా ఎక్కువగా తెగుళ్ళ బారిన పడుతుంది. దీన్ని తినడం వల్ల ఇన్ఫెక్షన్స్, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉండటం వల్ల వంకాయని చాలా మంది శ్రావణ మాసంలో తినరు.
ఉల్లిపాయ, వెల్లుల్లి
ప్రతి ఇంట్లోనూ ఉల్లిపాయ, వెల్లుల్లి వేయకుండా వంట చేయరు. ఇవి రెండు రుచిని మరింత పెంచుతాయి. అందుకే భారతీయ వంటకాల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ శ్రావణ మాసంలో మాత్రం వీటిని ఉపయోగించకూడదని పెద్దలు చెబుతారు. ఇవి రెండు వేడిని ఉత్పత్తి చేసే గుణాలు కలిగి ఉండటమే అందుకు కారణం.
పాలు
మనలో చాలా మంది ఉపవాసం ఉన్నప్పుడు నీళ్ళు అయిన తాగుతారు కానీ పాలు మాత్రం తాగరు. ఎందుకంటే ఇది శరీరంలో పిట్ట రసాన్ని పెంచుతుంది. అందుకే పాలకు బదులుగా పెరుగు, లస్సీ వంటి వాటిని ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.
మద్యపానం
సాధారణంగానే మద్యపానం ఆరోగ్యానికి హానికరం. శ్రావణ మాసంలో మద్యపానానికి దూరంగా ఉండాలి. ఇది సేవించడం వల్ల శరీరం, మనసు నియంత్రణ కోల్పోతాయి. ఇది అపవిత్రమైనది. అందుకే దీనికి దూరంగా ఉండాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: బిడ్డకు పాలివ్వడం శిశువుకే కాదు తల్లికీ ప్రయోజనమే
Also read: మగవారిని నిశ్శబ్దంగా చంపేస్తున్న ప్రొస్టేట్ క్యాన్సర్, ఈ అలవాటు ఉంటే మానుకోండి
Also read: నెయ్యి అన్నం ఇలా చేస్తే పిల్లలు వదలకుండా తినేస్తారు