News
News
X
IND in ZIM, 3 ODI Series, 2022 | 2nd ODI | Harare Sports Club, Harare - 20 Aug, 12:45 pm IST
(Match Yet To Begin)
ZIM
ZIM
VS
IND
IND
Asia Cup Qualifier, 2022 | Match 1 | Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman - 20 Aug, 07:30 pm IST
(Match Yet To Begin)
SIN
SIN
VS
HK
HK

Ghee Rice: నెయ్యి అన్నం ఇలా చేస్తే పిల్లలు వదలకుండా తినేస్తారు

నెయ్యి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా పిల్లలకు.

FOLLOW US: 

నెయ్యి తింటే లావై పోతాం అనుకుంటారు చాలా మంది. కానీ నెయ్యి తినడం కూడా అవసరమే. కాకపోతే మితంగా తినాలి. ఆయుర్వేదం ప్రకారం రోజుకి ఒక స్పూను నెయ్యిని ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఇలా నెయ్యి తినడం వల్ల చాలా సమస్యలు రావు. నెయ్యి తినడం వల్ల ముఖంలో తేజస్సు పెరగుతుంది. చర్మం మృదువుగా మారుతుంది. దీనిలో యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ ఫంగల్ గుణాలు అధికం. పిల్లలకు ఆహారంలో కలిపి కనీసం అర స్పూను నెయ్యి అయినా పెట్టేందుకు ప్రయత్నించండి. సీజనల్ వ్యాధులను ఇది అడ్డుకుంటుంది. భోజనం చేసేటప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి కలిపి పిల్లలకు తినిపించినా మంచిదే. ముఖ్యంగా శీతాకాలం, వానాకాలంలో శరీరంలో వేడి తగ్గిపోకుండా ఉండేందుకు నెయ్యి సహాయపడతుంది. 

కావాల్సిన పదార్థాలు
బాస్మతి బియ్యం - ఒక కప్పు
నెయ్యి - రెండు స్పూనులు
వెల్లుల్లి రెబ్బలు - ఆరు
ఉల్లిపాయ తరుగు - పావు కప్పు (నిలువుగా తరగాలి)
పచ్చి మిర్చి - రెండు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
జీడిపప్పులు - గుప్పెడు
బిర్యానీ ఆకు - ఒకటి 
లవంగాలు - మూడు
యాలకులు - ఒకటి
దాల్చిన చెక్క - ఒక ముక్క
అనాస పువ్వు - ఒకటి
షాజీరా - అర టీస్పూను
కొత్తీమీర తరుగు - రెండు స్పూనులు
ఉప్పు - తగినంత
నీళ్లు - రెండు గ్లాసులు

తయారీ ఇలా...
1. కళాయిలో నెయ్యి వేసి జీడి పప్పును వేయించి తీసి పక్కనపెట్టుకోవాలి. బాస్మతి బియ్యాన్ని అరగంట ముందే నీళ్లలో నానబెట్టుకోవాలి.
2. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో మసాలా దినుసులు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.
3. అవి వేగాక నిలువుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. 
4. అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి. ఈ మిశ్రమమంతా బాగా వేగితే సువాసన వస్తుంది. 
5. అందులో ఉప్పు, నీళ్లు కూడా వేయాలి. 
6. నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి మూతపెట్టాలి. 
7. పావుగంట సేపు సిమ్ లో ఉడికించాలి. 
8 . దించడానికి అయిదు నిమిషాల ముందు స్పూను నెయ్యి పైన చల్లాలి. అలాగే ముందు వేయించిపెట్టుకున్న జీడిపప్పులు వేయాలి. 
9. చివరన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. 
10. ఈ నెయ్యి అన్నం చాలా రుచిగా ఉంటుంది. చేయడం కూడా చాలా సులువు.
11. వారానికోసారైతనా పిల్లలకు లంచ్ బాక్సు రెసిపీగా పెడితే బావుంటుంది.  

Also read: తరచూ పండ్లు తినే వారిలో డిప్రెషన్ వచ్చే అవకాశం తక్కువ, చెబుతున్న కొత్త అధ్యయనం

Also read: చల్ల మిరపకాయలు ఇలా చేసుకుంటే కారం కారంగా భలేగుంటాయ్

Also read: చిక్కని పాయ సూప్ రెసిపీ, చల్లని వేళ రోగనిరోధక శక్తిని పెంచే వెచ్చని రుచి

Published at : 18 Jul 2022 10:09 AM (IST) Tags: Telugu vantalu Telugu recipes Ghee Rice Recipe Ghee Rice Recipe in telugu Ghee Rice Making

సంబంధిత కథనాలు

టాయిలెట్‌లో టైంపాస్? గంటలు గంటలు కూర్చుంటే చెప్పుకోలేని రోగం వస్తుందట!

టాయిలెట్‌లో టైంపాస్? గంటలు గంటలు కూర్చుంటే చెప్పుకోలేని రోగం వస్తుందట!

30 Days Water Challenge: 30 డేస్ వాటర్ ఛాలెంజ్ - ఈ ట్రెండ్ ఫాలో కావద్దు, ప్రాణాలు పోతాయ్, ఎందుకంటే..

30 Days Water Challenge: 30 డేస్ వాటర్ ఛాలెంజ్ - ఈ ట్రెండ్ ఫాలో కావద్దు, ప్రాణాలు పోతాయ్, ఎందుకంటే..

70 ఏళ్ల వయస్సులో బిడ్డకు జన్మనిచ్చిన బామ్మగారు, 54 ఏళ్ల కల ఫలించిన వేళ!

70 ఏళ్ల వయస్సులో బిడ్డకు జన్మనిచ్చిన బామ్మగారు, 54 ఏళ్ల కల ఫలించిన వేళ!

ఈ లక్షణాలు మీలో కనిపిస్తే రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం, ఏం తినాలంటే

ఈ లక్షణాలు మీలో కనిపిస్తే రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం, ఏం తినాలంటే

Kobbari Junnu: జున్నుపాలు అవసరమే లేని జున్ను రెసిపీ, కుక్కర్లో ఇలా వండేయచ్చు

Kobbari Junnu: జున్నుపాలు అవసరమే లేని జున్ను రెసిపీ, కుక్కర్లో ఇలా వండేయచ్చు

టాప్ స్టోరీస్

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Harish Rao :  అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ?  -  షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

IND Vs ZIM: వికెట్ పడకుండా కొట్టేశారు - మొదటి వన్డేలో టీమిండియా ఘనవిజయం!

IND Vs ZIM: వికెట్ పడకుండా కొట్టేశారు - మొదటి వన్డేలో టీమిండియా ఘనవిజయం!

Vijayashanthi : ఫైర్ బ్రాండ్ విజయశాంతి దారెటు ? బీజేపీలో ఆమెను దూరం పెడుతున్నారా ?

Vijayashanthi : ఫైర్ బ్రాండ్ విజయశాంతి  దారెటు ? బీజేపీలో ఆమెను దూరం పెడుతున్నారా ?