Sweets After Meals: భోజనం తర్వాత స్వీట్లు తింటున్నారా? ‘ఆయుర్వేదం’ ఏమిటీ ఇలా షాకిచ్చింది!
మీరు భోజనం తర్వాత స్వీట్లు తింటున్నారా? అయితే, అలా చేయొద్దని ఆయుర్వేం చెబుతోంది. ఎందుకో తెలుసా?
సాధారణంగా చాలామందికి భోజనం తర్వాత స్వీట్ తినడం అలవాటు. కొంతమంది కిళ్లీ లేదా పాన్ కూడా నములుతారు. పెళ్లిల్లు, ఫంక్షన్స్‌లో కూడా స్వీట్లు, ఐస్‌క్రీమ్‌లు పెడుతుంటారు. స్వీట్లు తింటే ఆహారం బాగా జీర్ణం అవుతుందని అంతా భావిస్తుంటారు. మరి, భోజనానికి ముందు స్వీట్లు తినడం మంచిదా? లేదా భోజనం తిన్న తర్వాత స్వీట్లు తినడం మంచిదా? దీనిపై ఆయుర్వేద నిపుణులు ఏమంటున్నారు?
భోజనం తర్వాత స్వీట్లు తినడం అనేది సర్వసాధారణమే. అలా తీసుకోవడమే మంచిదని కూడా అనుకుంటారు. కానీ, ఈ విషయంలో ఆయుర్వేదం ఒపీనియన్ వేరేగా ఉంది. ప్రాచీన భారతీయ శాస్త్రాలు మాత్రం దీనికి పూర్తి వ్యతిరేకంగా చెబుతున్నాయి. శరీరానికి తగిన పోషకాలు అందాలన్నా, జీర్ణక్రియ సక్రమంగా జరగాలన్నా.. భోజనానికి ముందే స్వీట్లు తినేయాలని ఆయుర్వేదంలో పేర్కొన్నారు. అది కూడా కేవలం ఒక స్పూన్ సైజ్ అంత స్వీట్ మాత్రమే తీసుకోవాలట.
ఆయుర్వేదం ప్రకారం.. భోజనం తినే సమయంలో స్వీట్లు తింటే అమ(విషం) లేదా ఓజస్(జీవశక్తి) ఉత్పన్నమవుతాయట. అయితే, అది మనం స్వీట్లు తీసుకొనే సమయంపై ఆధారపడతాయట. ఇది కొంచెం భయపట్టే విషయమే కదా. చూస్తూ చూస్తూ ఆహారాన్ని విషంగా ఎందుకు మార్చుకుంటాం చెప్పండి. అయినా, ఆయుర్వేదం ఇలా చెప్పడానికి తగిన కారణాలే ఉన్నాయి. కాబట్టి, వాటి గురించి మనం ముందుగా తెలుసుకుందాం.
⦿ భోజనానికి ముందు స్వీట్లు తినడం వల్ల శరీరంలో జీర్ణక్రియ హార్మోన్లు విడుదలవుతాయి.
⦿ భోజనం తర్వాత స్వీట్లు తీసుకోవడం వల్ల సాధారణ జీర్ణక్రియ ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతుంది.
⦿ స్వీట్‌లలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
⦿ భోజనం తర్వాత స్వీట్లు అజీర్ణానికి కారణమవుతాయి.
⦿ ఒక టీస్పూన్ కంటే ఎక్కువ స్వీ్ట్ తీసుకుంటే బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెజర్, క్యాలరీలపై ప్రభావం చూపుతుంది.
⦿ భోజనానికి ముందు స్వీట్లు తినడం వల్ల నాలుకపై ఉండే రుచి మొగ్గలు యాక్టీవ్ అవుతాయి.
⦿ భోజనానికి ముందు స్వీట్లు తినాలని ఆయుర్వేదం సిఫార్సు చేస్తున్నప్పటికీ, పరిమిత స్థాయిలో మాత్రమే తీసుకోవాలి.
⦿ భోజనం తర్వాత స్వీట్లు తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు ఏర్పడతాయి.
ఆరోగ్యానికి మంచిదేనా?: స్వీట్లు ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిది కాదు. ఆహారం జీర్ణమయ్యేందుకు అది తాత్కాలికంగా పనిచేయొచ్చు. కానీ, అది దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. డయాబెటిస్‌కు దారి తీయోచ్చు. ఆహారం తిన్న తర్వాత స్వీటు తినాలనిపించడం ఒక మానసిక సమస్య. సాధారణంగా భోజనం తర్వాత శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి.. ఈ అలవాటును మానుకోవడమే బెటర్. ఒకవేళ భోజనం తర్వాత స్వీటు తినాలనే కోరిక తగ్గకపోతే డార్క్ చాక్లెట్‌ను తినొచ్చు. లేదా చిన్న బెల్లం ముక్క తిన్నా పర్వాలేదు. వీటిలో షుగర్ చాలా తక్కువగా ఉంటుంది. భోజనం చేసిన తర్వాత కాసేపు నడిస్తే స్వీట్ తినాలనే ఆలోచన నుంచి డైవర్ట్ కావచ్చు. భోజనం తర్వాత బ్రష్ చేయడం, లేదా మౌత్ వాష్‌తో నోటిని శుభ్రం చేసుకుంటే తిపి తినాలనే కోరిక పుట్టదు. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కూడా భోజనం తర్వాత తీపి తినాలనే కోరికను కంట్రోల్ చేసుకోవచ్చు.
Also read: మూడో బిడ్డను కంటే పదకొండున్నర లక్షల రూపాయల బోనస్, ఓ కంపెనీ బంపర్ ఆఫర్