Space Travel: అంతరిక్ష ప్రయాణంతో రక్తహీనత... స్పేస్ ట్రావెలింగ్‌పై తొలి అధ్యయనం, బయటపడిన షాకింగ్ నిజాలు
అంతరిక్ష ప్రయాణం ఒక అధ్భుతం. అది అందరికీ దక్కేది కాదు. కానీ ఆ ప్రయాణం వ్యోమగాముల ప్రాణానికే ముప్పు తెస్తోంది.
తొలిసారి ప్రపంచంలోనే అంతరిక్ష ప్రయాణం చేసిన వ్యోమగాముల ఆరోగ్యంపై అధ్యయనం జరిగింది. అందులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ‘నేచర్ మెడిసిన్’అనే జర్నల్‌లో ఈ అధ్యయనం తాలూకు వివరాలను ప్రచురించారు. అంతరిక్ష ప్రయాణం చేసి వచ్చిన వ్యోమగాముల్లో ఎర్రరక్త కణాల సంఖ్య 54 శాతం తగ్గిపోయినట్టు అధ్యయనంలో తేలింది. దీన్ని ‘స్పేస్ ఎనీమియా’అంటారు. దాదాపు 14 మంది వ్యోమగాములపై ఈ అధ్యయనం సాగింది. భూమిపై ఉన్నప్పుడు వారి శరీరంలో ఉన్న ఎర్రరక్త కణాల సంఖ్య, అంతరిక్షంలోకి వెళ్లి వచ్చాక సగానికి పడిపోయింది. దీంతో స్పేస్‌లో ఎర్రరక్తకణాలు నాశనం అవుతున్నట్టు గుర్తించారు పరిశోధకులు.
అందుకే పరిశోధనా...
కెనడాలోని ఒట్టావా యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు డాక్టర్ గై ట్రూడెల్ మాట్లాడుతూ ‘అంతరిక్ష యాత్రల నుంచి తిరిగి వచ్చిన వ్యోమగాముల్లో రక్తహీనత కనిపించేది. ఒకరిద్దరిలో కాదు, ఎంత మంది వెళ్లొస్తే వారందరిలోనూ ఎనీమియా ఉండేది. ఎందుకో మాకు అర్థం అయ్యేది కాదు, అందుకే ఆ విషయంపై పరిశోధన నిర్వహించాం’ అని చెప్పారు.
అధ్యయనానికి ముందు అంతరిక్షంలోకి మొదటిసారి చేరగానే వ్యోమగాముల శరీరంలో చిన్న చిన్న మార్పులు సహజమేనని భావించేవారు. అంతరిక్షంలోకి చేరగానే వ్యోమగాముల తమ రక్తనాళాల్లోని 10 శాతం ద్రవాన్ని కోల్పోతారు. అలాగే ఓ పది శాతం ఎర్రరక్తకణాలు నాశనం అవుతాయని అనుకునేవారు. కానీ భారీ స్థాయిలో ఎర్ర రక్తకణాలు నాశనం అవుతాయని పరిశోధన తరువాతే తెలిసింది. భూమిపై ఉన్నప్పుడు మానవ శరీరం ప్రతి సెకనుకు 20 లక్షల ఎర్రరక్తకణాలను సృష్టించి నాశనం చేస్తాయి. అయితే వ్యోమగాములు అంతరిక్షంలో ఉన్నప్పుడు ప్రతి సెకనుకు 30 లక్షల ఎర్రరక్తకణాలు నాశనం అవుతున్నట్టు గుర్తించారు. స్త్రీ, పురుష వ్యోమగాములకు ఇద్దరిలోనూ ఇలాగే జరుగుతోంది.
అదే అదృష్టం
అంతరిక్షంలో శరీరం శూన్య బరువుతో ఉంటుంది. గాలిలో తేలుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితిలో తక్కువ ఎర్రరక్తకణాలు ఉన్నా సమస్య లేదు. అదే అదృష్టం, లేకుంటే వ్యోమగాములు చాలా తీవ్రమైన ఆరోగ్యసమస్యలను ఎదుర్కోవలసి వచ్చేది. కానీ వారు భూమిపైకి తిరిగి వచ్చాక మాత్రం వారికి కచ్చితంగా సమస్య తీవ్రత తెలుస్తుంది. భూమిపైకి వచ్చిన నాలుగైదు నెలల తరువాత వారి ఎర్రరక్తకణాల సంఖ్య సాధారణ స్థితికి చేరుకుంటుంది.
కారణం తెలియదు
అంతరిక్షంలో రక్తహీనత ఏర్పడుతుందని కనుగొనగలిగారు కానీ, ఎందుకన్నది ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. కారణం తెలిస్తే దాన్ని నిరోధించడం ఎలాగో కనిపెట్టవచ్చు అని చెప్పారు పరిశోధకులు.
Also read: రోజుకు రెండు స్పూనుల నువ్వులు... బరువు తగ్గించడమే కాదు, గుండెపోటునూ అడ్డుకుంటాయి
Also read: ఈ కాయల పేరేమిటో తెలుసా? ఎక్కడైనా కనిపిస్తే వదలకండి, ముఖ్యంగా మధుమేహ రోగులు...
Also read: నెగిటివ్ వచ్చినా వాసనా రుచి తెలియడం లేదా... అయితే ఇలా చేయండి
Also read: ‘ఊ అంటావా మావా’కు స్టెప్పులేసిన టాంజానియా పిలగాడు, అతడు ఎంత పాపులర్ అంటే...
Also read: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్ ఇది... తయారయ్యేది గాడిద పాలతో, రుచి అదిరిపోతుంది
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్