News
News
వీడియోలు ఆటలు
X

Waxing: బికినీ వ్యాక్సింగ్ చేయించుకుంటే చర్మం ఊడి వచ్చింది

అందానికి ప్రాధాన్యత ఇచ్చి, ఆరోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారు ఎంతోమంది యువత.

FOLLOW US: 
Share:

అందంగా కనిపించేందుకు ఫేషియల్ దగ్గరనుంచి వ్యాక్సింగ్ వరకు ఎన్నో రకాల సౌందర్య ప్రక్రియలను పాటిస్తారు అమ్మాయిలు. అలా ఓ అమ్మాయి బికినీ వ్యాక్సింగ్ చేయించుకోవడానికి వెళ్లి ఆసుపత్రి పాలయ్యింది. 

ఏం జరిగింది?
ఇండోర్లోని ఒక మహిళ బికినీ వ్యాక్సింగ్ చేయించుకునేందుకు స్పాకు వెళ్ళింది.  ఆ వ్యాక్సింగ్ ఖరీదు ₹4,500. ఈ వ్యాక్సింగ్ చేసేందుకు వేడిగా ఉన్న జిగటలాంటి పదార్థాన్ని శరీరంపై రాసి తర్వాత అక్కడున్న వెంట్రుకలను తొలగిస్తారు. ఆ పదార్ధాన్నే వ్యాక్స్ అంటారు. ఆ పదార్థాన్ని శరీరానికి రాయగానే చాలా మంటగా ఉందని చెప్పింది ఆ అమ్మాయి. కానీ వ్యాక్సిన్ చేసే బ్యూటిషియన్ మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. అలానే ఉంటుందని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది బ్యూటిషియన్. చివరికి వ్యాక్సిన్ చేయడానికి స్ట్రిప్ ను ఆ జిగటైనా పదార్థం పై ఉంచి లాగగానే వెంట్రుకలతో పాటు చర్మం కూడా ఊడి వచ్చింది. దీంతో ఆ అమ్మాయి నొప్పి, మంటతో విలవిలలాడింది. చివరికి ఆసుపత్రి పాలయ్యింది.తాను చెబుతున్నా కూడా వినకుండా వ్యాక్సింగ్ చేసిందని ఆ స్పా యజమానిపై వినియోగదారుల కోర్టులో కేసు వేసింది. 

వినియోగదారుల కోర్టు ఈ మొత్తం కేసుని పరిశీలించాక నష్టపరిహారంగా 30000 రూపాయలు అమ్మాయికి చెల్లించాలని, అలాగే ఆమెకు మానసిక వేదన కలిగించినందుకు మరో 20000 రూపాయలు, ఆమె వైద్య చికిత్స కోసం మరో 20000 రూపాయలు... మొత్తంగా 70,000 రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని స్పా యజమాని నెల రోజుల్లోగా చెల్లించాలని ఆజ్ఞాపించింది. సౌందర్య ప్రక్రియలకు వెళ్లే ముందు అవి ఆ చర్మానికి పడతాయో లేదో చెక్ చేయాలని కూడా సూచించింది. 

ఏంటీ బికినీ వ్యాక్సింగ్?
బికినీ వ్యాక్సింగ్, బ్రెజిలియన్ వ్యాక్సింగ్ దాదాపు ఒకటే. బికినీ వేసుకునే వారు ఈ వ్యాక్సింగ్ చేయించుకుంటారు. బికినీ వేసుకుంటే ఒంటి మీద ఎక్కడా వెంట్రుకలు కనిపించకుండా వ్యాక్సింగ్ చేయించుకుంటారు. అందుకే దీన్ని బికినీ వ్యాక్సింగ్ అంటారు. ఈ వ్యాక్సింగ్ లో భాగంగా జననేంద్రియాల వద్ద ఉన్న వెంట్రుకలను కూడా తొలగిస్తారు. అందుకే ఈ వ్యాక్సింగ్ కేవలం అనుభవం ఉన్నవారి చేత మాత్రమే చేయించుకోవాలి. లేకుంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. లోపలి తొడ భాగం, ఎగువ కాలు  మధ్య ఉండే బికినీ లైన్ ప్రాంతాన్ని ముఖ్యంగా వ్యాక్స్ చేస్తారు.  ఇది చాలా జాగ్రత్తలు తీసుకుని చేయించుకోవాల్సిన వ్యాక్సింగ్ ఇది.

Also read: పాలకూర పిల్లలు తినడం లేదా? టేస్టీ పాలక్ పులావ్ చేయండి

Also read: రెస్టారెంట్లో తందూరి రోటీలను ఆర్డర్ చేస్తున్నారా? వాటితో వచ్చే ఆరోగ్య ప్రమాదాలు ఇవే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 19 Apr 2023 11:24 AM (IST) Tags: Waxing Bikini waxing Waxing precautions body waxing

సంబంధిత కథనాలు

Diabetes: మీ పొట్టే మిమ్మల్ని డయాబెటిస్ నుంచి రక్షిస్తుందట - తాజా స్టడీతో సరికొత్త ఆశలు!

Diabetes: మీ పొట్టే మిమ్మల్ని డయాబెటిస్ నుంచి రక్షిస్తుందట - తాజా స్టడీతో సరికొత్త ఆశలు!

Babies In Lab: గర్భంలో కాదు ల్యాబ్‌లోనే పిల్లల సృష్టి - ఇంకో ఐదేళ్లలో అందుబాటులోకి!

Babies In Lab: గర్భంలో కాదు ల్యాబ్‌లోనే పిల్లల సృష్టి - ఇంకో ఐదేళ్లలో అందుబాటులోకి!

Curd: సమ్మర్‌లో రోజూ పెరుగు ఎందుకు తీసుకోకూడదు? ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

Curd: సమ్మర్‌లో రోజూ పెరుగు ఎందుకు తీసుకోకూడదు?  ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

Diabetes: మతిమరుపు, మధుమేహానికి దారితీస్తుందా?

Diabetes: మతిమరుపు, మధుమేహానికి దారితీస్తుందా?

ఈ అలవాట్లు మీకున్నాయా? జాగ్రత్త, డయాబెటిస్ రావొచ్చు!

ఈ అలవాట్లు మీకున్నాయా? జాగ్రత్త, డయాబెటిస్ రావొచ్చు!

టాప్ స్టోరీస్

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

Partner Swapping Case: భార్యల మార్పిడి కేసులో సంచలనం, విషం తాగిన నిందితుడు - మృతి

Partner Swapping Case: భార్యల మార్పిడి కేసులో సంచలనం, విషం తాగిన నిందితుడు - మృతి

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా