అన్వేషించండి

ABP Southern Rising Summit : జయలలిత చాలా స్వీట్.. అన్నాడీఎంకేలో గౌతమి చేరడానికి ఆమె రీజనా?

ABP Southern Rising Summit 2024 : హైదరాబాద్‌లో జరుగుతున్న ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024లో ప్రముఖ నటి గౌతమి పాల్గొన్నారు.

ABP Southern Rising Summit Gauthami Speech : నటిగా సినీ కెరీర్ మొదలు పెట్టి 36 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ప్రజలు ఈజీగా జడ్జ్ చేస్తారు. పర్సనల్ లైఫ్ గురించి గాసిప్ చేస్తారంటూ సినీ నటి గౌతమి వాపోయింది. తన లైఫ్​లో జరిగిన అతి పెద్ద, సెన్సిటివ్ విషయాల గురించి ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024లో పంచుకుంది గౌతమి. అన్నాడీఎంకే డిప్యూటీ సెక్రటరీగా నియమితులైన ప్రముఖ నటి, కాస్ట్యూమ్ డిజైనర్ గౌతమి తాడిమళ్ల ఏబీపీ నిర్వహించిన సమ్మెట్​లో పాల్గొని.. ఆమె పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్​ గురించి ఎన్నో విషయాలను ఏబీపీతో పంచుకున్నారు. 

జయలలిత.. 

ఈ సందర్భంగా ఆమె స్వర్గీయ జయలలితను గుర్తుచేసుకున్నారు. అన్నాడీఎంకేలోకి వెళ్లడానికి ఆమె రీజనా? అని అడిగిన ప్రశ్నకు.. గౌతమి బదులిస్తూ.. నాకు జయలలిత అంటే ఎనలేని అభిమానం ఉంది. ఆమె నటిగా ఉన్నప్పుడు నేను చిన్నపిల్లని.. రాజకీయాల్లోకి వచ్చాక ఆమెను మీట్ అయ్యాను. తను చాలా స్వీట్. నిజానికి రాజకీయాల్లోకి రావడానికి తను రీజన్ కాదు. అయినప్పటికీ రాజకీయాల్లో స్ట్రాంగ్ మహిళగా ఆమెంటే నాకు చాలా గౌరవం ఉంది. 

క్యాన్సర్​ సమయంలో.. 

నాకు క్యాన్సర్ వచ్చే సమయానికి నేను సింగిల్ పేరెంట్. ఆ సమయంలో నాకు ఏమి చేయాలో తెలియలేదు. కానీ అప్పుడు నేను నా కూతురు గురించి బాగా ఆలోచించాను. నేను లేకపోతే తన పరిస్థితి ఏంటి అనే ప్రశ్నే నన్ను ఈ బ్యాటిల్​ని గెలిచేలా చేసింది. ఆ సమయంలో శారీరకంగా, మానసికంగా నేను ఎంతో వీక్​గా ఉన్నాను. చిన్నతనంలో పేరెంట్స్ లేకపోతే.. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నా కూతురుకి ఆ పరిస్థితి రాకూడదని అనుకున్నాను. అందుకే క్యాన్సర్​ ట్రీట్​మెంట్ కోసం నేను ముందుకు వచ్చాను. 

బాధ ఉంటుందని అందరూ భయపెట్టారు. కానీ.. ఇది కూడా ప్రాబ్లమే.. దానిని నేను క్లియర్ చేసుకోవాలి. దానికి నా మైండ్​ని స్ట్రాంగ్​గా చేసుకోవాలని అనుకున్నాను. అదే మనోధైర్యంతో నేను ముందుకు వెళ్లాను. క్యాన్సర్​ను జయించి మీ ముందు నిలిచాను. ప్రతి మహిళ గుర్తించాల్సింది ఏమిటంటే.. తమ లైఫ్​లో ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం ముఖ్యమని గుర్తించాలి. మానసికంగా స్ట్రాంగ్​గా ఉంటే దేనినైనా జయించవచ్చని గౌతమి తెలిపారు. 

సినిమాల గురించి.. 

నేను సంవత్సరానికి 12 నుంచి 14 వరకు సినిమాలు చేసేదానిని. ఆ సమయంలో నాకు రెస్ట్ తీసుకునే సమయం ఉండేది కాదు. కానీ నాకు వర్క్ చేయడం నచ్చేది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో వర్క్ చేసేదానిని. ఒక్కోసారి నేను ఏ సినిమాకి చేస్తున్నానో కూడా మరచిపోయేదానినంటూ ఆనాటి విషయాలను గౌతమి గుర్తు చేసుకున్నారు. సినిమా విషయాల్లో సెన్సిటివ్గా, రాజకీయ విషయాల్లో కాస్త కరకుగా ఉంటానని.. ఈ విషయంలో నేను చాలా సార్లు ఎమోషనల్ అయ్యాను. కానీ కొన్నిసార్లు ఇది తప్పట్లేదు అంటూ తెలిపారు. కొన్నిసార్లు కరకుగా ఉండడంలో తప్పు లేదని చెప్తారు. 

Also Read : పొట్టిగా, మొండిగా ఉండే మహిళలు ఎక్కువకాలం బతుకుతారట : అన్యు ఆచార్య

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget