UPSC Stenographer Exam 2022: స్టెనోగ్రాఫర్ రాతపరీక్ష తేది వెల్లడి, షెడ్యూలు ఇదే!
స్టెనోగ్రాఫర్ 2022 రాతపరీక్ష షెడ్యూలును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. రాతపరీక్ష షెడ్యూలుతోపాటు షార్ట్‌హ్యాండ్ టెస్ట్ నిర్వహణ తేదీలను కూడా యూపీఎస్సీ ప్రకటించింది.
యూపీఎస్సీ స్టెనోగ్రాఫర్ 2022 రాతపరీక్ష షెడ్యూలును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల షెడ్యూలును అందుబాటులో ఉంచింది. స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్‌సైట్‌లో పరీక్ష షెడ్యూలును చూసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 11, 12 తేదీల్లో స్టెనోగ్రాఫర్ రాతపరీక్షలు నిర్వహించనున్నారు.
రాతపరీక్ష షెడ్యూలుతోపాటు షార్ట్‌హ్యాండ్ టెస్ట్ నిర్వహణ తేదీలను కూడా యూపీఎస్సీ ప్రకటించింది. మార్చి 18, 19 తేదీల్లో షార్ట్ హ్యాండ్ (హిందీ/ఇంగ్లిష్) పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి పరీక్ష నిర్వహిస్తారు. షార్ట్‌హ్యాండ్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు (కేటగిరీ IV, V, VI, VII & IX) పరీక్షలో నిమిషానికి పదాలు టైప్ చేయగలగాలి. పరీక్షల షెడ్యూలును ప్రకటించినప్పటికీ అడ్మిట్‌కార్డు తేదీలను మాత్రం యూపీఎస్సీ వెల్లడించలేదు.
పరీక్షల షెడ్యూలు ఇలా..
➥ మార్చి 11న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష నిర్వహించనున్నారు.
➥మార్చి 11న మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.
➥మార్చి 12న ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు పేపర్-3 పరీక్ష నిర్వహించనున్నారు.
పరీక్ష విధానం..
➥మొత్తం 500 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో పేపర్-1కు 150 మార్కులు, పేపర్-2కు 150 మార్కులు, పేపర్-3కు 200 మార్కులు కేటాయించారు.
➥పేపర్-1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ నాలెడ్జ్ (కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్- మెషినరీ ఆఫ్ గవర్నమెంట్ ప్రాక్టీస్, ప్రొసీజర్స్, సమాచార హక్కుచట్టం-2005) నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి.
➥పేపర్-2లో ప్రొసీజర్ & ప్రాక్టీస్ - గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటేరియట్, అనుబంధ కార్యాలయాలు, మరియు జనరల్ ఫైనాన్షియల్ అండ్ సర్వీస్ రూల్స్ నుంచి నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి.
➥పేపర్-3(సబ్జెక్టివ్)లో నోటింగ్, డ్రాఫ్టింగ్, ప్రిసైజ్ రైటింగ్ అంశాలు ఉంటాయి.
Also Read:
GAIL Recruitment: గెయిల్‌లో 277 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(గెయిల్) వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 277 ఇంజినీర్, ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు, అనుభవం నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 4న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభకాగా.. జనవరి 20తో దరఖాస్తు గడువు ముగియనుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎయిమ్స్‌లో 88 సీనియర్ రెసిడెంట్ ఖాళీలు, వివరాలు ఇలా!
భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ డీఎన్‌బీ/ ఎంఎస్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మెయిల్ ద్వారా జనవరి 14, స్పీడ్ పోస్టు ద్వార 19వరకు దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..