Detailed Application Form-II: సివిల్ సర్వీసెస్ డీఏఎఫ్-2 అప్లికేషన్స్ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
ఇంటర్వ్యూకు అర్హత సాధించిన వారు డీటైల్డ్ అప్లికేషన్ ఫాం-2 (డీఏఎఫ్-II) నింపాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 8న ప్రారంభమైంది, డిసెంబరు 14 లోపు సమర్పించాల్సి ఉంటుంది.
సివిల్ సర్వీసెస్ మెయిన్స్-2022 పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబరు 6న వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష-2022 ఫలితాలు విడుదలైన నేపథ్యంలో.. ఇంటర్వ్యూకు అర్హత సాధించిన వారు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో డీటైల్డ్ అప్లికేషన్ ఫాం-2 (డీఏఎఫ్-II) నింపాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 8న ప్రారంభమైంది, డిసెంబరు 14 లోపు సమర్పించాల్సి ఉంటుంది. నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసుకోవల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా డీఏఎఫ్-II అప్లికేషన్‌ను సమర్పించాల్సి ఉంటుంది. డీఏఎఫ్‌లేనిదే ఇంటర్వ్యూకి అనుమతి ఉండదు.
DETAILED APPLICATION FORM-II APPLICATION
దేశవ్యాప్తంగా మొత్తం 2,529 మంది అభ్యర్ధులు ఇంటర్వ్యూలకి ఎంపికయ్యారు. ఇంటర్వ్యూ తేదీల వివరాలను త్వరలోనే విడుదల చేస్తామని కమిషన్ పేర్కొంది. మెయిన్స్ పరీక్షకు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 650 మంది వరకు పరీక్షలకు హాజరుకాగా.. 75 మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు.
యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ఎంపికైనవాళ్లకు ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్-2 నింపి, యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ 275 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూ ప్రతిభ, మెయిన్స్, ప్రిలిమ్స్ మార్కులను బట్టి ఆలిండియా సర్వీసులకి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిన్ జూన్ 25న 72 నగరాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. వీటి ఫలితాలను జూన్ 22న వెల్లడించింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబరు 16 నుండి 25 వరకు మెయిన్ పరీక్షలు నిర్వహించింది. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన 11,845 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో తెలంగాణ నుంచి 673 మంది అభ్యర్థులు హాజరయ్యారు. హైదరాబాద్‌లో మూడు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.
యూపీఎస్‌సీ ఈ ఏడాది 1011 ఖాళీల భర్తీకి సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గతేడాది కంటే ఈసారి 300 పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. గత ఐదేళ్లతో పోలిస్తే 2021లో ప్రకటించిన ఖాళీలు చాలా తక్కువ. సివిల్ సర్వీసెస్ పరీక్ష నుంచి రైల్వే సర్వీసెస్‌ను తొలగించడం వల్ల ఇలా ఖాళీల సంఖ్య తగ్గింది. ఈ సంవత్సరం వాస్తవంగా ప్రకటించిన ఖాళీలు 861. ఆ తర్వాత రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌కు చెందిన 150 ఖాళీలను ప్రభుత్వం జోడించడంతో మొత్తం 1011 ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో గతేడాదితో పోలిస్తే ఖాళీలు 42 శాతం పెరిగాయి.
Also Read:
కేంద్రీయ విద్యాలయాల్లో 13,404 ఉద్యోగాల భర్తీకి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ, వివరాలు ఇలా!
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) ఖాళీల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగతన్ (కేవీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 13,404 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 6990 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఉండగా, 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబరు 26 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
దరఖాస్తు, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..
సీహెచ్‌ఎస్‌ఎల్-2022 నోటిఫికేషన్ విడుదల - 4500 కేంద్ర కొలువుల భర్తీ! పరీక్ష, ఎంపిక విధానం ఇలా!
కేంద్రప్రభుత్వ విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించే 'కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) ఎగ్జామినేషన్-2022' నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) విడుదల చేసింది. దీనిద్వారా పలు విభాగాల్లోని లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇంటర్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. రెండు దశల పరీక్షల (టైర్-1, టైర్-2) ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..