అన్వేషించండి

SSC CHSL 2022: సీహెచ్‌ఎస్‌ఎల్-2022 నోటిఫికేషన్ విడుదల - 4500 కేంద్ర కొలువుల భర్తీ! పరీక్ష, ఎంపిక విధానం ఇలా!

ఇంటర్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కేంద్రప్రభుత్వ విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించే 'కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) ఎగ్జామినేషన్-2022' నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) విడుదల చేసింది. దీనిద్వారా పలు విభాగాల్లోని లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇంటర్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. రెండు దశల పరీక్షల (టైర్-1, టైర్-2) ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు.

✪ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) ఎగ్జామినేషన్-2022

ఖాళీల సంఖ్య: 4500.

1) లోయర్ డివిజన్ క్లర్క్

2) జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్

3) డేటా ఎంట్రీ ఆపరేటర్

అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

వయోపరిమితి: 01.01.2022 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.01.1995 - 01.01.2004 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు.

ఎంపిక విధానం: టైర్-1, టైర్-2 పరీక్షలు, స్కిల్‌టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా.

టైర్-1 పరీక్ష (ఆబ్జెక్టివ్) పరీక్ష విధానం:
మొత్తం 200 మార్కులకు టైర్-1 ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం నాలుగు విభాగాల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ (బేసిక్ నాలెడ్జ్) నుంచి 15 ప్రశ్నలు - 50 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు - 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూట్ నుంచి 25 ప్రశ్నలు - 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 25 ప్రశ్నలు - 50 మార్కులు ఉంటాయి. ప్రశ్నలన్నీ కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు.
SSC CHSL 2022: సీహెచ్‌ఎస్‌ఎల్-2022 నోటిఫికేషన్ విడుదల - 4500 కేంద్ర కొలువుల భర్తీ! పరీక్ష, ఎంపిక విధానం ఇలా!

టైర్-2 పరీక్ష విధానం..

SSC CHSL 2022: సీహెచ్‌ఎస్‌ఎల్-2022 నోటిఫికేషన్ విడుదల - 4500 కేంద్ర కొలువుల భర్తీ! పరీక్ష, ఎంపిక విధానం ఇలా!

స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్ పరీక్ష విధానం..

✦  టైర్-2 పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు టైర్-3లో స్కిల్‌టెస్ట్/ టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత ప‌రీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కుల‌ను తుది ఎంపిక‌లో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు.

✦ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు.. డేటా ఎంట్రీ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కాల వ్యవధి 15 నిమిషాలు. డేటా ఎంట్రీ పోస్టుల‌కు గంట‌కు 8000 కీ డిప్రెష‌న్స్ కంప్యూట‌ర్‌పై ఇవ్వాలి. ఇందుకోసం సుమారు 2000-2200 కీ డిప్రెష‌న్స్ ఉన్న ఇంగ్లిష్ వ్యాసాన్ని ఇచ్చి 15 నిమిషాల వ్యవ‌ధిలో కంప్యూట‌ర్‌లో టైప్ చేయ‌మంటారు.

✦ లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. పరీక్ష సమయం 10 నిమిషాలు. టైపింగ్ టెస్ట్‌లో ఇంగ్లిష్ ఎంచుకున్నవారు నిమిషానికి 35 ప‌దాలు, హిందీని ఎంచుకున్నవారు నిమిషానికి 30 ప‌దాలు టైప్ చేయాలి.


ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.12.2022.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 04.01.2023.

➥ చలానా జనరేషన్‌కు చివరితేదీ: 04.012023.

➥ ఫీజు చెల్లించడానికి చివరితేదీ (ఆన్‌లైన్): 05.01.2023.

➥ చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది (ఆఫ్‌లైన్): 06.01.2023.

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 09.01.2023 - 10.01.2023 (23:00)

➥ టైర్-1(సీబీఈ) పరీక్ష తేదీ: ఫిబ్రవరి-మార్చి, 2023.

➥ టైర్-2(సీబీఈ) పరీక్షతేదీ: తర్వాత వెల్లడిస్తారు.

Notification

Online Application

Also Read:

కేంద్రీయ విద్యాలయాల్లో కొలువుల మేళా, 13404 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు! 
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) ఖాళీల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగతన్ (కేవీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 13,404 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 6990 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఉండగా, 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. డిసెంబరు 26 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

నైవేలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌లో 213 ఉద్యోగాలు, వివరాలు ఇవే!
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్సీఐఎల్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనీద్వారా జేవో&జేఎస్, సిర్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి డిప్లొమా(మైనింగ్/ మైనింగ్ ఇంజినీరింగ్/ మైన్ సర్వేయింగ్)/ డిగ్రీ(సివిల్) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget