By: ABP Desam | Updated at : 04 Dec 2022 12:42 PM (IST)
Edited By: omeprakash
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఉద్యోగాలు
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్సీఐఎల్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనీద్వారా జేవో&జేఎస్, సిర్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి డిప్లొమా(మైనింగ్/ మైనింగ్ ఇంజినీరింగ్/ మైన్ సర్వేయింగ్)/ డిగ్రీ(సివిల్) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 213
1) జూనియర్ ఓవర్‌మ్యాన్(ట్రైనీ): 51 పోస్టులు
2) జూనియర్ సర్వేయర్(ట్రైనీ): 15 పోస్టులు
3) సిర్దార్(సెలక్షన్ గ్రేడ్-1): 147 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి డిప్లొమా(మైనింగ్/ మైనింగ్ ఇంజినీరింగ్/ మైన్ సర్వేయింగ్)/ డిగ్రీ(సివిల్) ఉత్తీర్ణతతో పాటు ఓవర్‌మ్యాన్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ, మైనింగ్ సిర్దార్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ, సర్వేయింగ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్(NTC), సర్వేయర్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయో పరిమితి: 01.11.2022 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
జీత భత్యాలు: నెలకు జేవో, జేఎస్ పోస్టులకు రూ.31000 - రూ.100000, సిర్దార్ పోస్టులకు రూ.26000 - రూ.110000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
1) జేవో&జేఎస్: యూఆర్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ(NCL) అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.300+ ప్రాసెసింగ్ ఫీజు రూ.295=595. ఎస్సీ /ఎస్టీ/పీడబ్ల్యూడీ &ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు 295. అప్లికేషన్ ఫీజు నుంచి మినహయింపు.
2) సిర్దార్: యూఆర్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ(NCL) అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.250+ ప్రాసెసింగ్ ఫీజు రూ.236=486. ఎస్సీ /ఎస్టీ/పీడబ్ల్యూడీ &
ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు రూ. 236. అప్లికేషన్ ఫీజు నుంచి మినహయింపు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➛ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు ప్రారంభతేదీ: 02.12.2022.
➛ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 30.12.2022.
Also Read:
KVS Recruitment: కేంద్రీయ విద్యాలయాల్లో కొలువుల మేళా, 13404 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు!
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) ఖాళీల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగతన్ (కేవీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 13,404 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 6990 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఉండగా, 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. డిసెంబరు 26 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
స్టాఫ్ నర్సు పోస్టులు 957కి పెరిగాయి, రివైజ్డ్ నోటిఫికేషన్ విడుదల చేసిన వైద్యారోగ్యశాఖ
ఏపీలో ప్రభుత్వం మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. వైద్యారోగ్యశాఖలో స్టాఫ్ నర్సు ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 957 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇటీవల వైద్యారోగ్య శాఖలో ఏ ఒక్క పోస్టూ.. ఖాళీగా ఉండకూడదన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 957 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏడాది కాలపరిమితికి గాను కాంట్రాక్టు పద్ధతిలో స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీ వైద్య కళాశాలల్లో 631 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, అర్హతలివే!
ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్/ లేటరల్ ఎంట్రీ విధానంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెడికల్ పీజీ (ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డీఎం, ఎండీ, ఎంఎస్సీ), పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, మెరిట్ & రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 7 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
TSPSC Paper Leak: 'గ్రూప్-1' మెయిన్స్ పేపర్ కూడా లీకయ్యేదా? బయటపడుతున్న కుట్రలు!
TSPSC గ్రూప్ 1లో 100 మార్కులు వచ్చిన అభ్యర్థులపై సిట్ నిఘా, నేడు ముగిసిన నిందితుల కస్టడీ
Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?
APPSC Group 4 Hall Tickets: ఏపీపీఎస్సీ-గ్రూప్ 4 హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
SSC Selection Posts: 5369 సెలక్షన్ పోస్టుల దరఖాస్తుకు నేడే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!
KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!
Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మరడం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత