By: ABP Desam | Updated at : 03 Dec 2022 09:22 AM (IST)
Edited By: omeprakash
డీఎంఈ నోటిఫికేషన్
ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్/ లేటరల్ ఎంట్రీ విధానంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెడికల్ పీజీ (ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డీఎం, ఎండీ, ఎంఎస్సీ), పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, మెరిట్ & రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 7 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి.
వివరాలు..
అసిస్టెంట్ ప్రొఫెసర్
మొత్తం ఖాళీలు: 631 పోస్టులు
స్పెషాలైజేషన్లు: సీటీ సర్జరీ, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ జీఈ, మెడికల్ అంకాలజీ, నియోనాటాలజీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ, న్యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, సర్జికల్ జీఈ, సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ, అనస్థీషియా, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ మెడిసిన్, ఓబీజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, సైకియాట్రీ, రేడియాలజీ, రేడియోథెరపీ, టీబీ సీడీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫోరెన్సిక్ మెడిసిన్, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫార్మాకాలజీ, ఫిజియాలజీ, ఎస్‌పీఎం, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ, కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ, ఓరల్ మాక్సిలో ఫేషియల్ సర్జరీ, ఓరల్ పాథాలజీ, ఆర్థోడాంటిక్స్, పెడోంటిక్స్, పీరియాడోంటిక్స్, ప్రోసోథోడోంటిక్స్.
అర్హత: సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ (ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డీఎం, ఎండీ, ఎంఎస్సీ), పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1000. బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.500.
ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం,మెరిట్& రూల్ ఆఫ్‌రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభతేదీ: 01.12.2022.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 07.12.2022.
Also Read:
ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు, అర్హతలివే!
ప్రకాశం జిల్లాకు చెందిన డి-అడిక్షన్ సెంటర్, ప్రభుత్వ ఆసుపత్రి, ఒంగోలు ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. దీనిద్వారా సైకియాట్రిస్ట్, కౌన్సెలర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టుని అనుసరించి గ్రాడ్యుయేషన్, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ దరఖాస్తులను సూపరింటెండెంట్ ప్రభుత్వ ఆసుపత్రి-ఒంగోలు కార్యాలయంలో డిసెంబరు 8న సాయంత్రం 5 గంటల్లోగా సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీలో 6,511 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!
ఏపీలోని నిరుద్యోగులకు ప్రభత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6511 పోలీసు ఉద్యోగాల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 411 ఎస్‌ఐ పోస్టులు, 6100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. కానిస్టేబుల్ పోస్టులకు నవంబరు 30 నుంచి డిసెంబరు 28 దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌ఐ పోస్టులకు డిసెంబరు 14 నుంచి జనవరి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న, ఎస్‌ఐ పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్లు, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
PWC India: గుడ్‌న్యూస్ చెప్పిన PWC - 30వేల ఉద్యోగాలు ఇస్తారట!
LIC ADO Recruitment: 9394 ఉద్యోగాల దరఖాస్తుకు కొద్దిరోజులే గడువు, వెంటనే అప్లయ్ చేయండి! మారిన పరీక్ష తేదీ!
AP SI Hall Tickets: ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే! ఫిబ్రవరి 15 వరకు అందుబాటులో! పరీక్ష ఎప్పుడంటే?
DMHO Recruitment: కృష్ణా జిల్లా, డీఎంహెచ్‌వోలో రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు, అర్హతలివే!
Agniveer Recruitment Process: 'అగ్నివీరుల' నియామక ప్రక్రియలో కీలక మార్పులు, ఈ ఏడాది నుంచే అమలు!
KTR Comments : EV ఇండస్ట్రీలో మూడేళ్లలో రూ. 50వేల కోట్ల పెట్టుబడులు - తెలంగాణకు రానున్నాయన్న కేటీఆర్ !
Top Mileage Bikes: మంచి మైలేజ్ ఇచ్చే బైక్స్ కొనాలనుకుంటున్నారా? - బడ్జెట్లో బెస్ట్ లుక్, బెస్ట్ మైలేజ్ వీటిలోనే!
Twitter Gold: గోల్డ్ టిక్కు నెలకు రూ.82 వేలు - మరో కొత్త స్కీమ్‌తో రానున్న మస్క్!
Supreme Court Amaravati Case : ఫిబ్రవరి 23న సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ - త్వరగా చేపట్టాలని ఏపీ న్యాయవాది విజ్ఞప్తి !