AP Jobs: ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు, అర్హతలివే!
సైకియాట్రిస్ట్, కౌన్సెలర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టుని అనుసరించి గ్రాడ్యుయేషన్, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు.
ప్రకాశం జిల్లాకు చెందిన డి-అడిక్షన్ సెంటర్, ప్రభుత్వ ఆసుపత్రి, ఒంగోలు ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. దీనిద్వారా సైకియాట్రిస్ట్, కౌన్సెలర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టుని అనుసరించి గ్రాడ్యుయేషన్, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ దరఖాస్తులను సూపరింటెండెంట్ ప్రభుత్వ ఆసుపత్రి-ఒంగోలు కార్యాలయంలో డిసెంబరు 8న సాయంత్రం 5 గంటల్లోగా సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
1. సైకియాట్రిస్ట్: 01
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎంబీబీఎస్ & అడిక్షన్ మెడిసిన్‌లో శిక్షణ సర్టిఫికేట్ ఉండాలి.
వేతనం: రూ. 60,000.
2. కౌన్సెలర్: 01
అర్హత: గ్రాడ్యుయేషన్‌తో పాటు సండంధిత విభాగంలో 3 ఏళ్ళ పని అనుభవం ఉండాలి. ఎన్‌ఐఎస్‌డీ(NISD) ద్వారా డి-అడిక్షన్ కౌన్సెలింగ్‌లో 3 నెలల సర్టిఫికేట్ కోర్సు, ఇంగ్లీషు అలాగే ప్రాంతీయ భాషపై పట్టు ఉండాలి.
వేతనం: రూ.12,500.
3. డేటా ఎంట్రీ ఆపరేటర్: 01
అర్హత: గ్రాడ్యుయేషన్(ఎకౌంట్స్) ఉత్తీర్ణత ఉండాలి. కంప్యూటర్ ఆపరేట్ చేయకలగాలి.
వేతనం: రూ.10,000.
కాంట్రాక్ట్ వ్యవధి: 01 సంవత్సరం.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి.
ఎంపిక విధానం: నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తారు.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 08.12.2022.
చిరునామా:
The Superintendent,
Government General Hospital,
Bhagyanagar, Ongole.
prakasam Dist.
Also Read:
కరెన్సీ నోట్ ప్రెస్‌లో 125 సూపర్‌వైజర్, జూనియర్ టెక్నీషియన్ పోస్టులు
నాసిక్ (మహారాష్ట్ర)లోని కరెన్సీ నోట్ ప్రెస్ సూపర్‌వైజర్, జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 125 పోస్టులను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా(ఇంజినీరింగ్), బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ పరీక్ష, మెరిట్‌లిస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 26 నుంచి డిసెంబరు 16 వరకు ఆన్‌లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష యొక్క తాత్కాలిక తేదీ జనవరి/ఫిబ్రవరి 2023 లేదా అభ్యర్థుల సంఖ్యను బట్టి పరీక్ష తేదీలను పొడిగించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.
ఏపీలో 6,511 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!
ఏపీలోని నిరుద్యోగులకు ప్రభత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6511 పోలీసు ఉద్యోగాల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 411 ఎస్‌ఐ పోస్టులు, 6100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. కానిస్టేబుల్ పోస్టులకు నవంబరు 30 నుంచి డిసెంబరు 28 దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌ఐ పోస్టులకు డిసెంబరు 14 నుంచి జనవరి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న, ఎస్‌ఐ పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్లు, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
పోలీస్ ఉద్యోగార్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్!! - డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించి అడ్మిట్ కార్డులను పోలీసు నియామక మండలి నవంబర్ 29న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. డిసెంబర్ 3 వరకు ఈ అడ్మిట్ కార్డులు వెబ్‌సైట్‌లో ఉండనున్నాయి. అభ్యర్థులు తమ వ్యక్తిగత యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలని చేసుకోవచ్చు.
హాల్‌టికెట్లు, ఫిజికల్ ఈవెంట్ల వివరాల కోసం క్లిక్ చేయండి..