CNP Recruitment: కరెన్సీ నోట్ ప్రెస్‌లో 125 సూపర్‌వైజర్, జూనియర్ టెక్నీషియన్ పోస్టులు
సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా(ఇంజినీరింగ్), బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. డిసెంబరు 16 వరకు ఆన్‌లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
నాసిక్ (మహారాష్ట్ర)లోని కరెన్సీ నోట్ ప్రెస్ సూపర్‌వైజర్, జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 125 పోస్టులను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా(ఇంజినీరింగ్), బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ పరీక్ష, మెరిట్‌లిస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 26 నుంచి డిసెంబరు 16 వరకు ఆన్‌లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష యొక్క తాత్కాలిక తేదీ జనవరి/ఫిబ్రవరి 2023 లేదా అభ్యర్థుల సంఖ్యను బట్టి పరీక్ష తేదీలను పొడిగించవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 125 పోస్టులు.
1. సూపర్‌వైజర్ (టెక్నికల్ ఆపరేటర్- ప్రింటింగ్): 10 పోస్టులు
2. సూపర్‌వైజర్(టెక్నికల్ఆపరేటర్- ఎలక్ట్రికల్): 02 పోస్టులు
3. సూపర్‌వైజర్(టెక్నికల్ఆపరేటర్- ఎలక్ట్రానిక్స్): 02 పోస్టులు
4. సూపర్‌వైజర్(టెక్నికల్ఆపరేటర్- మెకానికల్): 02 పోస్టులు
5. సూపర్‌వైజర్(టెక్నికల్ఆపరేటర్- ఎయిర్ కండిషనింగ్): 01 పోస్టు
6. సూపర్‌వైజర్(ఎన్విరాన్‌మెంట్): 01 పోస్టు
7. సూపర్‌వైజర్(ఐటీ): 04 పోస్టులు
8. జూనియర్ టెక్నీషియన్(ప్రింటింగ్/ కంట్రోల్): 103 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా(ఇంజినీరింగ్), బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు 18-25 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
జీతం: జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు రూ.18,780-రూ.67,390, మిగిలిన పోస్టులకు రూ.27,600-రూ.95,910 ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: అన్-రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు రూ.600. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.200 ఇంటిమేషన్ ఛార్జీలు.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష, మెరిట్‌లిస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలు: 1. నాసిక్, 2. ముంబై/నవీ ముంబై/థానే/ఎంఎంఆర్(MH) 3. కోల్‌కతా, 4. హైదరాబాద్, 5. ఢిల్లీ-NCR, 6. భోపాల్.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 26.11.2022
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 16.12.2022
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: జనవరి/ ఫిబ్రవరి 2023.
Also Read:
ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నతహోదా ఉద్యోగాలకు 'ఏఎఫ్‌క్యాట్' - నోటిఫికేషన్ వెల్లడి!
భారత వైమానిక దళంలో ఉన్నత హోదా ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఏఎఫ్‌క్యాట్ 01/2023 నోటిఫికేషన్ విడుదలైంది. వైమానిక దళంలో టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల ఖాళీలను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఎంపికైన అభ్యర్థులను వైమానిక దళంలో కమిషన్డ్ ఆఫీసర్లుగా నియమిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి
ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు, 1400 అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన అగ్రిపథ్ స్కీమ్‌లో భాగంగా.. ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 1400 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిసెంబర్ 8 నుంచి 17 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. అగ్నివీర్‌గా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్ఎస్ చిల్కాలో ప్రారంభమయ్యే 01/2023 (మే 23) బ్యాచ్ పేరుతో శిక్షణ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో ఏడాది రూ.33 వేలు, మూడో ఏడాది రూ.35500, నాలుగో ఏడాది రూ.40 వేల వేతనం లభిస్తుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి