అన్వేషించండి

Indian Navy Agniveer Recruitment 2022: ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు, 1400 అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

ఇంటర్ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిసెంబర్ 8 నుంచి 17 వరకు దరఖాస్తు కొనసాగనుంది. రాతపరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపికచేస్తారు.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన అగ్రిపథ్ స్కీమ్‌లో భాగంగా.. ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 1400 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిసెంబర్ 8 నుంచి 17 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. అగ్నివీర్‌గా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్ఎస్ చిల్కాలో ప్రారంభమయ్యే 01/2023 (మే 23) బ్యాచ్ పేరుతో శిక్షణ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో ఏడాది రూ.33 వేలు, మూడో ఏడాది రూ.35500, నాలుగో ఏడాది రూ.40 వేల వేతనం లభిస్తుంది.

వివరాలు..

* అగ్నివీర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్) 

మొత్తం ఖాళీల సంఖ్య: 1400 పోస్టులు (మెన్-1120, ఉమెన్-280)

అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యా్ర్హత. 

వయోపరిమితి: 01.05.2002 - 31.10.2005 మధ్య జన్మించినవారు దరఖాస్తుకు అర్హులు. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి.

ఇతర అర్హతలు:  కనిష్ఠ ఎత్తు - పురుషులు 157 సెం.మీ., స్త్రీలు 152 సెం.మీ. ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.550.

ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్, కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(సీబీఈ), ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్(పీఎఫ్‌టీ), వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. హిందీ/ఇంగ్లిష్ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఇంటర్ స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి ఒక గంట. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు.

శిక్షణ: అగ్నివీర్‌లుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్ఎస్ చిల్కాలో వచ్చే ఏడాది మే నెలలో కోర్సు శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

వేతనం: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో ఏడాది రూ.33 వేలు, మూడో ఏడాది రూ.35500, నాలుగో ఏడాది రూ.40 వేల వేతనం లభిస్తుంది.

ముఖ్యమైన తేదీలు..

🔰 ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: 08.12.2022

🔰 ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 17.12.2022.

🔰 శిక్షణ ప్రారంభం: 2023, మే నెలలో.

Notification

Website  

Also Read:

6,511 ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేస్తోంది!! వివరాలు ఇలా!
ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ ఉద్యోగాల కోసం చూస్తున్న నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6,511 ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి 2 రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. వీటిలో 483 ఎస్‌ఐ పోస్టులు, 6028 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. సబ్‌ ఇన్‌స్పెక్టర్ విభాగంలో.. ఎస్‌ఐ(సివిల్)-387, ఎస్‌ఐ (ఏపీఎస్‌పీ)-96 పోస్టుల ఉన్నాయి. ఇక  కానిస్టేబుల్ ఉద్యోగాల్లో.. కానిస్టేబుల్ (సివిల్)-3508,  కానిస్టేబుల్ (ఏపీఎస్‌పీ)-2520 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నవంబరు నెలాఖరులో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. డిసెంబరు నాటికి దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తిచేయనున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 

తెలంగాణలో 'గ్రూప్‌-4' ఉద్యోగాల జాతర - 9,168 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్!
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఈ మేరకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది.  ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్థికశాఖ జారీచేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 9,168 గ్రూప్-4 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆర్థికమంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.
పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! 92 లక్షల మందికి నోటీసులు! అక్టోబర్‌ 19న తుది జాబితా!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! 92 లక్షల మందికి నోటీసులు! అక్టోబర్‌ 19న తుది జాబితా!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget