News
News
X

Indian Airforce: ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నతహోదా ఉద్యోగాలకు 'ఏఎఫ్‌క్యాట్' - నోటిఫికేషన్ వెల్లడి!

ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

FOLLOW US: 
Share:

భార‌త వైమానిక ద‌ళంలో ఉన్నత హోదా ఉద్యోగాల భ‌ర్తీకి నిర్వహించే ఏఎఫ్‌క్యాట్ 01/2023 నోటిఫికేషన్ విడుద‌లైంది. వైమానిక దళంలో టెక్నిక‌ల్‌, నాన్ టెక్నిక‌ల్‌ విభాగాల ఖాళీలను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఎంపికైన అభ్యర్థులను వైమానిక దళంలో కమిషన్డ్ ఆఫీసర్లుగా నియమిస్తారు.

* ఏఎఫ్‌క్యాట్ -  AFCAT -  01/2023 

మొత్తం పోస్టుల సంఖ్య: 258

1) ఫ్లయింగ్ బ్రాంచ్: 10 (మెన్-05, ఉమెన్-05)

2)  గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్): 130 (మెన్-117, ఉమెన్-13)

బ్రాంచ్: ఏరోనాటికల్ ఇంజినీరింగ్.

3) గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్): 118 (మెన్-103, ఉమెన్-15)

బ్రాంచ్: వెపన్ సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్, ఎల్‌జీఎస్‌, అకౌంట్స్, ఎడ్యుకేషన్, మెటియోరాలజీ. 

అర్హత‌:

🔰 ఫ్లయింగ్ బ్రాంచ్ పోస్టులకు 60 శాతం మార్కులతో డిగ్రీ (ఫిజిక్స్, మ్యాథ్స్) లేదా బీఈ/ బీటెక్, బీకాం ఉత్తీర్ణత‌. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ ఉండాలి. డిగ్రీ చివరిసంవత్సరం చదవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎత్తు కనీసం 162.5 సెం.మీ ఉండాలి. 

🔰 గ్రౌండ్ డ్యూటీ టెక్నిక‌ల్ పోస్టుల‌కు ఏరోనాటిక‌ల్ ఇంజినీరింగ్‌(ఎల‌క్ట్రానిక్స్‌/మెకానిక‌ల్) విభాగాల్లో లేదా అనుంబంధ బ్రాంచీల్లో బీటెక్‌/బీఈ పూర్తి చేసి ఉండాలి. ఇంట‌ర్‌‌లో ఫిజిక్స్, మ్యాథ్స్ ఉండాలి. . పురుషులు 157.5 సెం.మీ, మహిళలు 152.5 సెం.మీ ఎత్తు ఉండాలి.

🔰 గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నిక‌ల్) పోస్టుల్లో వివిధ విభాగాలను అనుసరించి ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్ స‌బ్జెక్టుల్లో ఉత్తీర్ణత, ఏదైనా డిగ్రీ లేదా బీఈ/బీటెక్ లేదా బీకాం/ బీఎస్సీ/ బీబీఏ/ సీఏ/ సీఎంఏ/ సీఎస్/ సీఎఫ్ఏ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి. పురుషులు 157.5 సెం.మీ, మహిళలు 152.5 సెం.మీ ఎత్తు ఉండాలి. 

వయోపరిమితి:

🔰  ఫ్లయింగ్ బ్రాంచ్: 20 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

🔰 గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్/ నాన్ టెక్నికల్): 20 - 26 సంవత్సరాల మధ్య ఉండాలి.

పేస్కేలు: శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు. శిక్షణ తర్వాత ఫ్లయింగ్ ఆఫీసర్ ర్యాంకుతో రూ.1,77,500 చెల్లిస్తారు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఇతర అలవెన్సులు ఉంటాయి. మిలిటరీ సర్వీస్ పేలో భాగంగా ప్రతి నెలా రూ.15,500 చెల్లిస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.250. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ అభ్యర్థులకు ఫీజు ఉండదు. డెబిట్/ క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, చలానా రూపంలో ఫీజు చెల్లించవచ్చు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

పరీక్ష విధానం: మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్, రీజనింగ్, మిలిటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. 


ముఖ్యమైన తేదీలు..

⏩ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.12.2022.

⏩ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.12.2022.

⏩ అడ్మిట్ కార్డు: 08.02.2023 నుండి.

⏩ పరీక్ష తేది: 24 - 26.02.2023.

Notification

Also Read:

ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు, 1400 అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన అగ్రిపథ్ స్కీమ్‌లో భాగంగా.. ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 1400 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిసెంబర్ 8 నుంచి 17 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. అగ్నివీర్‌గా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్ఎస్ చిల్కాలో ప్రారంభమయ్యే 01/2023 (మే 23) బ్యాచ్ పేరుతో శిక్షణ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో ఏడాది రూ.33 వేలు, మూడో ఏడాది రూ.35500, నాలుగో ఏడాది రూ.40 వేల వేతనం లభిస్తుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణలో 'గ్రూప్‌-4' ఉద్యోగాల జాతర - 9,168 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్!
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఈ మేరకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది.  ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్థికశాఖ జారీచేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 9,168 గ్రూప్-4 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆర్థికమంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.
పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 27 Nov 2022 07:40 PM (IST) Tags: Air Force AFCAT Notification 2023 AFCAT Recruitment AFCAT Notification 01/2023 Indian Airforce AFCAT AFCAT 2023 Notification

సంబంధిత కథనాలు

CAPF Vacancies 2023: కేంద్ర సాయుధ బలగాల్లో 83 వేల పోస్టులు ఖాళీ, లోక్‌సభలో కేంద్రం ప్రకటన!

CAPF Vacancies 2023: కేంద్ర సాయుధ బలగాల్లో 83 వేల పోస్టులు ఖాళీ, లోక్‌సభలో కేంద్రం ప్రకటన!

AIIMS Recruitment: ఎయిమ్స్‌, రిషికేశ్‌లో 62 సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు, వివరాలు ఇలా!

AIIMS Recruitment: ఎయిమ్స్‌, రిషికేశ్‌లో 62 సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు, వివరాలు ఇలా!

TSPSC DAO Exam: ఒకేరోజు 5 పరీక్షలు, టెన్షన్‌లో నిరుద్యోగులు! వాయిదావేయాలంటూ వేడుకోలు!

TSPSC DAO Exam: ఒకేరోజు 5 పరీక్షలు, టెన్షన్‌లో నిరుద్యోగులు! వాయిదావేయాలంటూ వేడుకోలు!

KVS Recruitment Exams: నేటి నుంచి కేవీల్లో ఉద్యోగాలకు పరీక్ష, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?

KVS Recruitment Exams: నేటి నుంచి కేవీల్లో ఉద్యోగాలకు పరీక్ష, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?

LIC ADO Recruitment: 9394 ఉద్యోగాల దరఖాస్తుకు కొద్దిరోజులే గడువు, వెంటనే అప్లయ్ చేయండి! మారిన పరీక్ష తేదీ!

LIC ADO Recruitment: 9394 ఉద్యోగాల దరఖాస్తుకు కొద్దిరోజులే గడువు, వెంటనే అప్లయ్ చేయండి! మారిన పరీక్ష తేదీ!

టాప్ స్టోరీస్

MLC Kavitha: ఈ నెల 10న చెన్నైకి ఎమ్మెల్సీ కవిత - 2024 ఎన్నికల చర్చకు హాజరు!

MLC Kavitha: ఈ నెల 10న చెన్నైకి ఎమ్మెల్సీ కవిత - 2024 ఎన్నికల చర్చకు హాజరు!

Kadiyam Srihari On Sharmila: జగన్ జైలుకు వెళ్తే సీఎం చాన్స్ - ఏపీకి వెళ్లాలని షర్మిలకు కడియం శ్రీహరి సలహా !

Kadiyam Srihari On Sharmila:   జగన్ జైలుకు వెళ్తే సీఎం చాన్స్ - ఏపీకి వెళ్లాలని షర్మిలకు కడియం శ్రీహరి సలహా !

Kiranmayee Alivelu: మిసెస్ ఇండియా పోటీల్లో సత్తా చాటిన తెలంగాణ అందం!

Kiranmayee Alivelu: మిసెస్ ఇండియా పోటీల్లో సత్తా చాటిన తెలంగాణ అందం!

YS Jagan: 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు - ఎస్ఐపీబీ సమావేశంలో సీఎం జగన్ ప్రకటన

YS Jagan: 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు - ఎస్ఐపీబీ సమావేశంలో సీఎం జగన్ ప్రకటన