అన్వేషించండి

AP Staff Nurse Posts: స్టాఫ్ నర్సు పోస్టులు 957కి పెరిగాయి, రివైజ్డ్ నోటిఫికేషన్ విడుదల చేసిన వైద్యారోగ్యశాఖ- దరఖాస్తు చేసుకోండిలా!

నవంబరు 28న 461 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా... ఇదే నోటిఫికేషన్‌లో మార్పులు చేస్తూ 957 ఉద్యోగాల భర్తీకి తాజా నోటిఫికేషన్‌ను డిసెంబరు 1న ప్రభుత్వం విడుదల చేసింది..

ఏపీలో ప్రభుత్వం మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. వైద్యారోగ్యశాఖలో స్టాఫ్ నర్సు ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 957 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇటీవల వైద్యారోగ్య శాఖలో ఏ ఒక్క పోస్టూ.. ఖాళీగా ఉండకూడదన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 957 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏడాది కాలపరిమితికి గాను కాంట్రాక్టు పద్ధతిలో స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిసెంబరు 2 నుండి 8 వరకు ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి చేసిన అప్లికేషన్లను డిసెంబర్ 9 లోగా అయా రీజనల్ డైరెక్టర్ కార్యాలయాల్లో అందజేయాల్సి ఉంటుంది. రీజినల్ డైరెక్టర్ కార్యాలయాల అడ్రస్‌లను కూడా వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

పెరిగిన పోస్టులు..
ఏపీలో స్టాఫ్‌నర్స్ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ప్రజారోగ్య & కుటుంబ సంక్షేమ సంచాలకులు నవంబరు 28న 461 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. డిసెంబరు 5 వరకు దరఖాస్తులు సమర్పణకు అవకాశం ఇచ్చింది. అయితే ఇదే నోటిఫికేషన్‌లో మార్పులు చేస్తూ 957 ఉద్యోగాల భర్తీకి తాజా నోటిఫికేషన్‌ను డిసెంబరు 1న ప్రభుత్వం విడుదల చేసింది. డిసెంబరు 9 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం కల్పించింది. డిసెంబరు 8 వరకు దరఖాస్తు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనుంది. 

Also Read: ఏపీలో 461 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు, అర్హతలివే! (Previous Notification)

పోస్టుల వివరాలు..

* స్టాఫ్ నర్స్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 957

అర్హత: జనరల్ నర్సింగ్ & మిడ్ వైఫరీ (లేదా) బీఎస్సీ(నర్సింగ్) అర్హత ఉండాలి.

వయోపరిమితి: 01.07.2022 నాటికి 42 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, సంబంధిత చిరునామాలో నిర్ణీత గడువులోగా సమర్పించాలి.

ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. వీటిలో 75 శాతం క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్‌లో మార్కులకు కేటాయించారు. 10 శాతం విద్యార్హతలకు కేటాయించారు. ఇక మిగతా 15 శాతం అభ్యర్థుల పని అనుభవానికి కేటాయించారు.

దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామాలు:

The Regional Director  
Medical and Health Services, 
Opp. Bullaiah College,
Resapuvanipalem,
Visakhapatnam.
The Regional Director 
Medical and Health Services,
Aswini Hospital Backside, 
Old Itukulabatti Road, Guntur. 
The Regional Director
Medical and Health Services, 
District Headquarters Hospital Compound,
Rajamahendravaram.
The Regional Director 
Medical and Health Services, 
Old RIMS, Kadapa.

ముఖ్యమైన తేదీలు...

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.12.2022.

➥ దరఖాస్తు అందుబాటులో ఉండేది: 08.12.2022 వరకు.

దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 09.12.2022.

Notification & Application

Website

Also Read: 

ఏపీలో 6,511 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!
ఏపీలోని నిరుద్యోగులకు ప్రభత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6511 పోలీసు ఉద్యోగాల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 411 ఎస్‌ఐ పోస్టులు, 6100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. కానిస్టేబుల్ పోస్టులకు నవంబరు 30 నుంచి డిసెంబరు 28 దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌ఐ పోస్టులకు డిసెంబరు 14 నుంచి జనవరి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న, ఎస్‌ఐ పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఏపీ వైద్య కళాశాలల్లో 631 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, అర్హతలివే!
ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్/ లేటరల్ ఎంట్రీ విధానంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెడికల్ పీజీ (ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డీఎం, ఎండీ, ఎంఎస్సీ), పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, మెరిట్ & రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 7 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
TTD Board Chairman :  అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
PM Modi Podcast :  నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు  - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
Fun Bucket Bhargava:  ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Prathyusha Challa Case | అతుల్ సుభాష్ కేసును గుర్తు చేస్తున్న మరో కేసు | ABP DesamPawan Kalyan vs YS Jagan | జగన్, పవన్ ఎదురెదురు పడిన ఘటన..తీవ్ర ఉద్రిక్తత | ABP DesamYanam Fruit and Flower Show | పుష్ప అంట్లే ఫ్లవర్ అనుకుంటివా...కాదు యానాం ఫ్లవర్ | ABP DesamFun Bucker Bhargav 20Years Sentence | సంచలన తీర్పు ఇచ్చిన విశాఖ పోక్సో కోర్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
TTD Board Chairman :  అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
PM Modi Podcast :  నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు  - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
Fun Bucket Bhargava:  ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
Ashwin In Politics: రాజకీయ చదరంగంలోకి అశ్విన్..!!l తమిళ పాలిటికల్‌ ఎంట్రీ కోసమే హిందీ వ్యతిరేక వ్యాఖ్యలా!
రాజకీయ చదరంగంలోకి అశ్విన్..!!l తమిళ పాలిటికల్‌ ఎంట్రీ కోసమే హిందీ వ్యతిరేక వ్యాఖ్యలా!
Telangana News: తెలంగాణలో చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం మార్గదర్శకాలు జారీ
తెలంగాణలో చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం మార్గదర్శకాలు జారీ
Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
NTR Nagar:  జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
Embed widget